Neeraj Chopra: దేశం నిన్ను చూసి గర్విస్తోంది.. నీరజ్ అద్భుత విజయంపై ప్రముఖులు ఎలా స్పందించారంటే.

|

Aug 07, 2021 | 8:15 PM

Neeraj Chopra: జావెలిన్‌ త్రో క్రీడలో బంగారు పతకాన్ని సాధించిన దేశం దృష్టిని ఆకర్షించిన నీరజ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. వందేళ్ల భారత అథ్లెట్‌ చరిత్రలో సరికొత్త చరిత్రకు నాంది పలికిన నీరజ్‌ను దేశ ప్రజలు ఆకాశానికెత్తారు...

Neeraj Chopra: దేశం నిన్ను చూసి గర్విస్తోంది.. నీరజ్ అద్భుత విజయంపై ప్రముఖులు ఎలా స్పందించారంటే.
Neeraj Wishes
Follow us on

Neeraj Chopra: జావెలిన్‌ త్రో క్రీడలో బంగారు పతకాన్ని సాధించిన దేశం దృష్టిని ఆకర్షించిన నీరజ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. వందేళ్ల భారత అథ్లెట్‌ చరిత్రలో సరికొత్త చరిత్రకు నాంది పలికిన నీరజ్‌ను దేశ ప్రజలు ఆకాశానికెత్తారు. ఈసారి ఒలింపిక్స్‌లో భారత్‌ పసిడి పతకాన్ని గెలుచుకుంటుందా అన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ నీరాజ్‌ చివర రోజున అద్భుత విషయాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే నీరజ్‌కు నజరానాలతో పాటు అభినందనలు కూడా దక్కుతున్నాయి.

నీరజ్‌ చోప్రా అద్భుత విజయంపై స్పందించిన రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెటిక్స్‌లో ఒలింపిక్స్ చరిత్రలోనే తొలి మెడల్ సాధించి చరిత్ర సృష్టించిన నీరజ్.. యావత్ దేశ యువతను ఇన్‌స్పైర్ చేశాడని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. గోల్డ్ మెడల్ సాధించే బాటలో ఉన్న అడ్డంకులను నీ జావెలిన్ చీల్చుకుంటూ వెళ్లిందని ఆయన కీర్తించారు. ఇక ప్రధాని మోదీ స్పందిస్తూ.. నీరజ్‌ టోక్యోలో సరికొత్త చరిత్రను సృష్టించాడంటూ ట్వీట్‌ చేశారు. రక్షణ మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ శుభాకాంక్షలు తెలుపుతూ.. ఆర్మీలో సుబేదార్ కేడర్‌‌లో పని చేస్తున్న నీరజ్ చోప్రాకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కంగ్రాట్స్ చెప్పారు. నీరజ్ సాధించిన గోల్డెన్ విక్టరీ యావత్ దేశాన్ని, భారత ఆర్మీని గర్వింపజేస్తోందని అన్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ నిజమైన సైనికుడిలా పోరాడాడని అభివర్ణించారు.

ఇక ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వ భూషణ్ హరి చందన్ అభినందించారు. 135 కోట్ల మంది భారతీయులు ప్రపంచ యవనికపై తలెత్తుకొనేటట్లు చేశారని అభినందించారు. ప్రపంచ ఒలింపిక్స్ అద్లెట్స్ లో భారత్ కు ఇది తొలిస్వర్ణం కాగా నీరజ్ చోప్రా మరిన్ని విజయాలు సాధించాలని గవర్నర్ ఆకాంక్షించారు. ఈ మేరకు రాజ్ భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. టోక్యో ఒలింపిక్స్ లో జావెలిన్ త్రోలో మొట్టమొదటి సారిగా నీరజ్ చోప్రా స్వర్ణ పతకాన్ని సాధించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. వందేళ్లుగా స్వర్ణ పతకం కోసం ఎదురు చూస్తున్న భారతీయుల కలలను నీరజ్ చోప్రా నిజం చేశారని సీఎం కేసీఆర్ అభినందించారు.

ఈ విజయం ఎంతో మందికి స్ఫూర్తిని ఇస్తుంది: స్మృతి ఇరానీ

హార్ధిక్ పాండ్యా..

సురేశ్ రైనా..

రీతూ ఫోగట్..

అనిల్ కపూర్..

అభిషేక్ బచ్చన్..

అక్షయ్‌ కుమార్‌..

అజయ్ దేవగన్..

హేమా మాలిని..

తాప్సీ..

కరన్ జోహార్..

సల్మాన్ ఖాన్..

రాజమౌళి..

రష్మిక మందన్న..

Also Read:  Funny Video : అమ్మాయి టిక్‌ టాక్‌ వీడియో చేస్తోంది..! అప్పుడే వాళ్ల అమ్మ వచ్చింది..? ఏం జరిగిందంటే..

Neeraj Chopra: ఒలింపిక్స్ స్వర్ణం అంత ఈజీగా రాలేదు.. నీరజ్ కఠోర శ్రమ చూస్తే మీకే అర్థమవుతుంది. Viral Video

Tokyo Olympics 2020: టోక్యో ఒలింపిక్స్‌లో సరికొత్త రికార్డు.. భారత్ ఖాతాలో ఏడు పతకాలు