Tokyo Olympics 2020: బికినీలతోనే జిమ్నాస్టిక్స్ చేయాలా..? ఈ అథ్లెట్ చేసిన పనికి సలాం అంటోన్న జనం
జిమ్నాస్టిక్స్ వ్యాయామ సంబధిత క్రీడగా ప్రాచుర్యం పొందింది. ఇందులో బలంతోపాటు చురుకుదనం, ఓర్పు, నియంత్రణ చాలా అవసరం. సాహసకృత్యాలే నిలయంగా మారిన ఈ క్రీడల్లో పురుషులతో పాటు మహిళలు కూడా సత్తా చాటుతున్నారు.
Gymnastics: జిమ్నాస్టిక్స్ వ్యాయామ సంబధిత క్రీడగా ప్రాచుర్యం పొందింది. ఇందులో బలంతోపాటు చురుకుదనం, ఓర్పు, నియంత్రణ చాలా అవసరం. సాహసకృత్యాలే నిలయంగా మారిన ఈ క్రీడల్లో పురుషులతో పాటు మహిళలు కూడా సత్తా చాటుతున్నారు. పురుషులు ఆరు విభాగాలలో పోటీ పడతారు. (నేలమీద చేసే వ్యాయామాలు (Floor Exercise), పొమ్మెల్ హార్స్ (Pommel Horse), స్టిల్ రింగ్స్ (Still Rings), వాల్ట్, పారలల్ బార్స్, హారిజాంటల్ బార్). మహిళలు నాలుగు విభాగాలలో పోటీ పడతారు (వాల్ట్, అన్‌ఈవెన్ బార్స్, బాలన్స్ బీమ్, నేలమీద చేసే వ్యాయామాలు (Floor Exercise). అయితే అమ్మాయిలు కేవలం స్విమ్ సూట్‌తోనే ఈ పోటీల్లో పాల్గొనడం మనం చూస్తునే ఉన్నాం. కేవలం బికినీలే ధరించి ఈ పోటీల్లో పాల్గొనలా.. లేదా శరీరాన్ని పూర్తిగా కవర్ చేసే దుస్తులు ధరించకూడదా.. అనే ప్రశ్నలు తరచుగా మహిళా అథ్లెట్లను వేధింస్తుంటాయి. అయితే, వీటికి సమాధానం జర్మనీ అమ్మాయిలు చెప్పేశారు. ఎవరి కంఫర్ట్ అనుగుణంగా వారు దుస్తులు ధరిస్తుంటారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో బికినీలు ధరించి పాల్గొనాలంటే మాత్రం ఇప్పటికీ కొంతమంది వెనకడుగు వేస్తునే ఉంటారు.
కాగా, జర్మనీ అమ్మాయిలు మాత్రం బికినీలు కాకుండా పూర్తిగా శరీరాన్ని కవర్ చేసే దుస్తులు ధరించి జిమ్నాస్టిక్స్ పోటీల్లో పాల్గొని ఆశ్చర్యపరిచారు. అయితే, ఇందుకు కారణం కూడా వారు వెల్లడించారు. బికినీలు వేసుకుని జాతీయ, అంతర్జాతీయ వేదికలపై జిమ్నాస్టిక్స్‌లో పాల్గొంటుంటే.. లైగింక వేధింపులు, మహిళా అథ్లెట్లను చెడు దృష్టితో చూడడం కూడా పెరిగిపోయిందని వారు పేర్కొన్నారు. అందుకే ఇలాంటి వాటికి చెక్ పెట్టే ఉద్దేశంతోనే పూర్తిగా శరీరాన్ని కప్పి ఉంచిన దుస్తులు ధరించామని తెలపారు. ఈమేరకు జర్మనీ జిమ్నాస్ట్ సారా మాట్లాడుతూ, ‘బికినీలలో పాల్గొనే రూల్స్ అంటూ ఏమీ లేవు. కానీ, ఇలా చేయడం వల్ల లైంగిక వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. దీంతో ఇలాంటి వాటికి చెక్ పెట్టాలనే నేను పూర్తిగా శరీరాన్ని కప్పి ఉంచే దుస్తులు ధరించాను. వీటిల్లో కూడా మేము చాలా అందంగా కనిపిస్తున్నాం’ అని తెలపింది.
Also Read: