Tokyo Olympics 2021 Highlights: 2-1 ఆధిక్యంలో భారత్ హాకీ జట్టు.. సెమీస్ లో ఓడిన నోవాక్ జకోవిచ్

| Edited By: Ravi Kiran

Jul 30, 2021 | 4:54 PM

Tokyo Olympics 2020 Highlights: టోక్యో ఒలింపిక్స్‌ ఎనిమిదవ రోజుకు చేరుకున్నాయి. మాజీ ప్రపంచ నంబర్ వన్ .. స్తుతం ప్రపంచంలో 5 వ స్థానంలో ఉన్న జపాన్ ప్లేయర్ యమగుచి పై సింధుపైచేయి సాధించింది. వరస సెట్స్ తో అకానె పై గెలిచి సెమీస్ లోకి అడుగు పెట్టింది తెలుగు తేజం సింధు

Tokyo Olympics 2021 Highlights: 2-1 ఆధిక్యంలో భారత్ హాకీ జట్టు.. సెమీస్ లో ఓడిన నోవాక్ జకోవిచ్
India Hockey

Tokyo Olympics 2020 Highlights: టోక్యో ఒలింపిక్స్‌ ఎనిమిదవ రోజుకు చేరుకున్నాయి. మాజీ ప్రపంచ నంబర్ వన్ .. స్తుతం ప్రపంచంలో 5వ స్థానంలో ఉన్న జపాన్ ప్లేయర్ యమగుచి పై సింధుపైచేయి సాధించింది. వరస సెట్స్ తో అకానె పై గెలిచి సెమీస్ లోకి అడుగు పెట్టింది తెలుగు తేజం సింధు

25 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్
ఈ రోజు 25 మీర్ పిస్టల్‌లో మహిళల అర్హత మ్యాచ్ మొదలుకానుంది. ఇందులో మను బాకర్, రాహి సర్నోబాట్ పాల్గొంటారు. ఈ రోజు వారు రాపిడ్ ఫైర్‌లో పాల్గొంటారు.

షూటింగ్ – రాహి సర్నోబాట్ మ్యాచ్ ప్రారంభం
రాపిడ్ ఫైర్ రౌండ్ ప్రారంభమైంది. రాహి సర్నోబాట్ తొమ్మిదితో ప్రారంభమైంది. రాహీ ప్రస్తుతం 25 వ స్థానంలో నిలిచింది.

అథ్లెటిక్స్- బరిలోకి ముగ్గురు అథ్లెట్లు
అథ్లెటిక్స్ ఈవెంట్స్ ఈ రోజు కూడా మ్యాచులున్నాయి. మొదటి రోజు ముగ్గురు భారత అథ్లెట్లు అవినాష్ సాబుల్ (3000 మీ. స్టీపుల్‌చేస్), ద్యుతీ చంద్, ఎంపీ జబీర్ బరిలోకి దిగనున్నారు.

భారత హాకీ జట్టు విజయం..

టోక్యో ఒలింపిక్స్‌ ఎనిమిదవ రోజులో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. లవ్లీనా సెమిస్ లో అడుగుపెట్టి పతకం ఖాయం చేసుకుంది. మరోవైపు తెలుగు తేజం పీవీ సింధు కూడా యమగుచి పైగెలిచి సెమీస్ లో అడుగు పెట్టింది. ఇక భారత మెన్స్ హాకీ జట్టు జపాన్ పై 5-3 తేడాతో గెలిచింది.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 30 Jul 2021 04:51 PM (IST)

    భారత హాకీ జట్టు విజయం

    టోక్యో ఒలింపిక్స్‌ ఎనిమిదవ రోజులో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. లవ్లీనా సెమిస్ లో అడుగుపెట్టి పతకం ఖాయం చేసుకుంది. మరోవైపు తెలుగు తేజం పీవీ సింధు కూడా యమగుచి పైగెలిచి సెమీస్ లో అడుగు పెట్టింది. ఇక భారత మెన్స్ హాకీ జట్టు జపాన్ పై 5-3 తేడాతో గెలిచింది.

  • 30 Jul 2021 03:51 PM (IST)

    సెమీస్‌లో జకోవిచ్‌కు షాక్ ఇచ్చి అలెగ్జాండర్ సంచలన విజయం.. ఫైనల్స్‌లో అడుగు

    వింబుల్డన్‌ 2021 మెన్స్ సింగిల్స్‌ విజేత, ప్రపంచ నంబర్‌వన్‌ జకోవిచ్ కు టోక్యో ఒలింపిక్స్‌ 2021లో భారీ షాక్‌ తగిలింది. టెన్నిస్ పురుషుల సింగిల్స్‌ విభాగంలో జకోవిచ్ పై అలెగ్జాండర్ జ్వెరెవ్ సంచలన విజయం సొంతం చేసుకున్నాడు. జకోవిచ్ పై 1-6,6-3,6-1 తేడాతో అలెగ్జాండర్ గెలుపొందాడు. జ్వెరెవ్ ఒలంపిక్స్ లో అరంగ్రేటం చేసిన ఇప్పటివరకు కేవలం ఒక సెట్ మాత్రమే ఓడిపోయాడు. దీంతో జ్వెరెవ్‌కు ఇది అద్భుతమైన ఒలింపిక్స్ అరంగేట్రం అని క్రీడాపండితులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

  • 30 Jul 2021 03:34 PM (IST)

    జపాన్‌తో తలపడుతున్న భారత హాకీ జట్టు.. 2-1తో ఆధిక్యం

    ఒలింపిక్స్‌లో భారత హాకీ టీమ్‌కి ఘనమైన చరిత్ర ఉంది. కానీ తడబడుతూ తన క్రీడాప్రస్థానం కొనసాగిస్తుంది ప్రస్తుతం. అయితే టోక్యో ఒలంపిక్స్ లో భారత మెన్స్ హాకీ జట్టు.. ఆస్ట్రేలియా చేతిలో చిత్తుగా ఓడిపోయిన తర్వాత ఢీలాపడిన తర్వాత మళ్ళీ పుంజుకుని తన జైత్ర యాత్రను కొనసాగించింది. ఈరోజు జపాన్ , భారత్ ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. ప్రస్తుతం భారత్ రెండు గోల్స్ చేయగా జపాన్ ఒక గోల్ తో ఆడుతుంది.

  • 30 Jul 2021 02:52 PM (IST)

    హోరా హోరీగా సాగిన మ్యాచ్ లో పీవీ సింధుగెలుపు.. సెమీస్ లోకి అడుగు

    టోక్యో ఒలింపిక్స్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సెమీ ఫైనల్ లో అడుగు పెట్టింది. శుక్రవారం జరిగిన మహిళల బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్‌ జపాన్ కు చెందిన అకానె యామగుచి తో తలపడింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్ లో తెలుగు తేజం పీవీ సింధు 2-0 తేడాతో గెలుపుని సొంతం చేసుకుని పతకం ఆశలను సజీవంగా నిలుపుకుంది.

  • 30 Jul 2021 02:35 PM (IST)

    రెండో సెట్ లో ముందంజలో ఉన్న పీవీ సింధు

    మాజీ ప్రపంచ నంబర్ వన్ .. స్తుతం ప్రపంచంలో 5 వ స్థానంలో ఉన్న జపాన్ ప్లేయర్ యమగుచి పై సింధు మొదటి సెట్ లో పైచేయి సాధించింది. 13-21 తేడాతో పివి సింధు గెలిచింది. ఇక రెండో గేమ్ లో సింధు అకానె హోరాహోరీగా తలపడుతున్నారు. ఇద్దరు ప్రారంభం నుంచే ఆధిక్యాన్ని సందించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే సహనం కోల్పోయిన అకానె తప్పులు చేయడంతో సింధు తనదైనశైలిలో విజృంభించింది రెండో సెట్ లో 5-3తో ముందంజలో ఉంది.  

  • 30 Jul 2021 02:24 PM (IST)

    తొలి సెట్ ను కైవసం చేసుకున్న పీవీ సింధు

    టోక్యో ఒలింపిక్స్‌లో శుక్రవారం మహిళల బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్‌ భారత నెంబర్ వన్ షట్లర్ తెలుగు తేజం పీవీ సింధు జపాన్ కు చెందిన అకానె యామగుచి తో క్వార్టర్ ఫైనల్ లో తలపడుతోంది. ఈ మ్యాచ్ లో పీవీ సింధు తొలి సెట్ ను కైవసం చేసుకుంది.

  • 30 Jul 2021 01:45 PM (IST)

    క్వార్టర్ ఫైనల్ లో జపాన్ ప్లేయర్ అకానె తో తలపడుతున్న పీవీ సింధు

    టోక్యో ఒలింపిక్స్‌లో శుక్రవారం మహిళల బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్‌ భారత నెంబర్ వన్ షట్లర్ తెలుగు తేజం పీవీ సింధు జపాన్ కు చెందిన అకానె యామగుచి తో క్వార్టర్ ఫైనల్ లో తలపడుతోంది. ఈ మ్యాచ్ లో పీవీ సింధు విజయం సాధించాలని ప్రతి ఒక్క భారతీయుడు కోరుకుంటున్నాడు.

  • 30 Jul 2021 12:05 PM (IST)

    ఒలంపిక్స్‌లో ముగిసిన దీపికా కుమారి పోరు.. క్వార్టర్ ఫైనల్‌లో ఓటమి

    టోక్యో ఒలంపిక్స్ లో పతకం పై ఆశలు రేపిన దీపిక పోరు ముగిసింది. ఆర్చరీ వ్యక్తిగత రికర్వ్‌ విభాగంలో దక్షిణ కొరియాకు చెందిన ఆర్చర్‌ ఆన్‌ సాన్‌ చేతిలో ఓడిపోయింది. క్వార్టర్‌ ఫైనల్లో 0-6 తేడాతో దీపిక పరాజయం పాలైంది.

  • 30 Jul 2021 11:25 AM (IST)

    ద్యుతీ చంద్ పేలవ ప్రదర్శన ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్ లో భారత పతక ఆశలు గల్లంతు

    టోక్యో ఒలంపిక్స్ లోని ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్ లో భారత పతక ఆశలు గల్లంతయ్యాయి. కచ్చితంగా పతకం తీసుకొస్తుందని ఆశలు పెట్టుకున్న స్టార్ స్ప్రింట‌ర్ ద్యుతీ చంద్ పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరిచింది. 100 మీటర్ల రేసులో ద్యుతి చంద్ విఫలమైంది. హీట్ 5లో పాల్గొన్న ద్యుతీ చంద్ 11.54 సెక‌న్ల‌లో రేసు పూర్తి చేయడంతో 7వ స్థానానికి ప‌రిమిత‌మైంది. మరోవైపు వినాష్ ముకుంద్, మాదారి జ‌బీర్ లు కూడా తమ తమ రేసుల్లో విఫలమయ్యారు.

  • 30 Jul 2021 11:12 AM (IST)

    ఐర్లాండ్ పై గెలిచి .. రేస్ లో నిలిచిన భారత మహిళల హాకీ జట్టు..

    టోక్యో ఒలంపిక్స్ లో భారత మహిళల హాకీ జట్టు క్వార్టర్ ఫైనల్ ఆశలు సజీవంగా ఉండలాంటే.. ఐర్లాండ్ తో జరిగే మ్యాచ్ లో గెలవాల్సి ఉంది. పూల్ ఎ మ్యాచ్‌లో భాగంగా భారత మహిళల హాకీ జట్టు ఐర్లాండ్‌ తో తలపడింది. ఇరు జట్లు నువ్వానేనా అన్నట్లు తలపడ్డాయి. భారత ఆటగాళ్లు ఫెనాల్టీకార్నర్ ను గోల్ గా మలచడంలో విఫమయ్యారు. దీంతో తోలి గోల్ నమోదు చేయడానికి ఇరు జట్లకు కష్టపడ్డాయి. మ్యాచ్ ముగిసే సమయం దగ్గర పడుతున్నప్పుడు భారత జట్టుకు నవనీత్ కౌర్ ఊపిరి అందిస్తూ.. తొలిగోల్ చేసింది. నవనీత్ క్లోజ్ రేంజ్ లో అద్భుతమైన పాస్ అందుకుని.. దానిని గోల్ గా మలిచింది. నవనీత్ కౌర్ గోల్ తో ఐర్లాండ్ పై గెలిచి .. భారత మహిళల హాకీ జట్టు..టోక్యో ఒలంపిక్స్  రేస్ లో నిలిచింది.

  • 30 Jul 2021 09:35 AM (IST)

    సెమిస్ కు దూసుకెళ్లిన లవ్లినా

    లవ్లినా బోర్గోహైన్ చరిత్రను లిఖించింది. శుక్రవారం కొకుకిగాన్ అరేనాలో జరిగిన మహిళల వెల్టర్‌వెయిట్ (64-69 కేజీలు) బాక్సింగ్ క్వార్టర్ ఫైనల్లో చైనీస్‌ తైపీకి చెందిన మాజీ ప్రపంచ ఛాంపియన్ చెన్ నీన్-చిన్‌ను ఓడించింది. సెమీ ఫైనల్‌కు చేరుకుంది. దీంతో టోక్యో ఒలింపిక్స్‌లో భారతదేశానికి రెండో పతకం ఖాయమైంది. టోక్యో ఒలింపిక్స్‌లో కనీసం కాంస్య పతకం లవ్లినా కు దక్కనుంది. దీంతో విజేందర్ సింగ్, మేరీ కోమ్ తర్వాత ఒలింపిక్ పతకం సాధించిన మూడవ భారతీయ బాక్సర్ గా నిలవనుంది.

  • 30 Jul 2021 08:51 AM (IST)

    షూటింగ్ – మను బాకర్ ఒలింపిక్ ప్రయాణం ముగిసింది

    25 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ క్వాలిఫైయింగ్ రౌండ్ ముగిసిన వెంటనే మను బాకర్ ఒలింపిక్ ప్రయాణం కూడా పూర్తయింది. మను మూడు ఈవెంట్‌లలో పాల్గొంది. ఆమె ఫైనల్స్‌ చేరుకోవడంలో తడబడింది. వరుసగా రెండో ఒలింపిక్స్‌లో షూటింగ్‌లో భారత్ పతకం సాధించలేకపోయింది.

  • 30 Jul 2021 08:50 AM (IST)

    ప్రీక్వార్టర్స్ నుంచే వెనుదిరిగిన భారత్ బాక్సర్ సిమ్రన్

    శుక్రవారం జరుగుతున్న టోక్యో ఒలింపిక్స్‌లో భారత బాక్సర్ సిమ్రన్ జిత్ కౌర్ పోరాటం ముసిగింది. మహిళల 60 కేజీల ప్రిక్వార్టర్‌ ఫైనల్‌లో సిమ్రన్ ఓటమిపాలైంది. థాయ్‌లాండ్‌కు చెందిన సుదాపోర్న్‌ సీసోండీతో జరిగిన బౌట్‌లో 0-5 తేడాతో ఓడిపోయింది.

  • 30 Jul 2021 08:46 AM (IST)

    మనుబాకర్, సర్నబోత్‌ రహీ ద్వయం పేలవ ప్రదర్శన..

    టోక్యో ఒలింపిక్స్‌లో 8వ రోజు శుక్రవారం జరిగిన 25 మీటర్ల పిస్టల్ ఉమెన్స్ క్వాలిఫికేషన్ ఈవెంట్‌లో భారత మహిళా షూటర్లకు నిరాశే ఎదురైంది. మను భాకర్, సర్నబోత్‌ రహీ ద్వయం పేలవ ప్రదర్శనతో ఫైనల్ కు అర్హత సాధించలేకపోయారు. మను భాకర్, సర్నబోత్‌ రహీ ద్వయం మహిళల 25 మీటర్ల ర్యాపిడ్‌ పిస్టల్‌ క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో 290 పాయింట్లతో మనూబాకర్ 15వ స్థానంలో నిలవగా.. . 286 పాయింట్లతో సర్నబోత్‌ రహీ 32వ స్థానంలో నిలిచింది.

  • 30 Jul 2021 08:34 AM (IST)

    నేడు ఈక్వెస్ట్రియన్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్న భారత రైడర్ ఫౌద్ మీర్జా

    ఒలంపిక్స్ పోటీలు 8వ రోజులోకి అడుగు పెట్టాయి. ఈ రోజు నుంచి ఈక్వెస్ట్రియన్‌ ఈవెంట్ జరగనుంది. ఈ ఈవెంట్ లో పాల్గొనడానికి భారత రైడర్ ఫౌద్ మీర్జాకు మార్గం సుగమం మైంది. మీర్జా గుర్రానికి పరీక్షలు నిర్వహించిన ఈవెంట్ జాడ్జింగ్ కమిటీ గుర్రం సంపూర్ణ ఆరోగ్యంతో ఉందని రిపోర్ట్ ఇచ్చింది. దీంతో శుక్రవారం నుంచి సోమవారం వరకూ జరగనున్న ఈ అశ్విక క్రీడలో మీర్జా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈరోజు ఈవెంటింగ్‌ డ్రెస్సెజ్‌ తొలి రోజు సెషన్‌–2లో ఫౌద్‌ మీర్జా పాల్గొననున్నాడు. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం గం. 2 నుంచి జరుగనుంది.

  • 30 Jul 2021 08:18 AM (IST)

    టోక్యో ఒలంపిక్స్ విలేజ్‌లోకి నో ఎంట్రీ..

    2020 లో జరగాల్సిన టోక్యో ఒలంపిక్స్ కరోనా కారణంగా వాయిదాపడి ఈ ఏడాదిని నిర్వహిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఒలంపిక్స్ నిర్వాహకులు, ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. అయితే వేర్వేరు దేశాలకు చెందిన కొంతమంది క్రీడాకారులు కరోనా బారిన పడి.. పోటీ నుంచి తప్పుకున్నారు. ఇప్పటివరకూ ఒలంపిక్స్ స్టేడియం వద్ద పరిస్థితులు బాగానే ఉన్నప్పటికీ.. టోక్యో నగరంలో మాత్రం కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఇప్పటివరకూ ఎన్నడూ లేనివిధంగా భారీగా సిటీలో కేసులు నమోదవుతూ ఆందోళన రేకెత్తిస్తోంది. టోక్యో హెల్త్ డిపార్ట్మెంట్ గురువారం సాయంత్రం హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసింది. గత 24 గంటల్లో టోక్యోలో కొత్తగా 3,865 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ ఇక్కడ ఈ రేంజ్ లో కొట్టకేసులు నమోదు కాలేదు. గత రెండు రోజులుగా 3 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో టోక్యో అధికార యంత్రాంగం ఉల్కిపడింది. గత మూడురోజులుగా వరసగా మంగళ, బుధ, గురు వారాల్లో 9,890 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికార యంత్రాంగం తెలిపింది. ఇప్పటి వరకూ ఈ రేంజ్ లో కొత్తకేసులు ఎప్పుడూ నమోదు కాలేదని.. ఇది ఇక్కడితో ఆగకపోవచ్చనే ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి.

    కొత్త కేసులు అధిక సంఖ్యలో నమోదైన ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితులను విధించారు. టోక్యో ఒలింపిక్స్ విలేజ్‌లో ఇప్పటికే 155 కేసులు నమోదయ్యాయి. ఒలింపిక్స్‌తో ముడిపడి ఉన్న ఏడుమంది కొత్తగా కరోనా వైరస్‌కు గురయ్యారు. ఇప్పటిదాకా పలువురు అథ్లెట్లు, సపోర్టింగ్ స్టాఫ్ కరోనా బారిన పడ్డారు. టోక్యోలో 25 శాతం మేర కొత్త కేసులు నమోదైన ప్రతి ప్రాంతంలోనూ ఎమర్జెన్సీ విధించారు. కరోనా కేసులు పెరగడం, ఒలింపిక్స్ కొనసాగుతుండటం వంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అధికారులు మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. టోక్యో ఒలింపిక్స్ విలేజ్‌లోకి ఎవరినీ అడుగు పెట్టనివ్వడంలేదు. అంతేకాదు కమిటీ అధికారికంగా నియమించుకున్న వాలంటీర్ల సంఖ్యను కూడా మరింత పరిమితం చేశారు అధికారులు.

  • 30 Jul 2021 07:22 AM (IST)

    ఆర్చరీ – టాప్ సీడ్‌ను ఎదుర్కోనున్న దీపిక

    ఫ్రీక్వార్టర్స్‌లో అద్భుతంగా ఆడిన దీపికా కుమారి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. అయితే ఈ పోరు చాలా టఫ్‌గా ఉండనుంది. కొరియాకు చెందిన టాప్ సీడ్ అన్ సాన్‌తో దీపిక తలపడనుంది. టోక్యోలో శాన్ ఇప్పటికే రెండు బంగారు పతకాలు సాధించింది. కొరియన్ టాప్‌సీడ్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌తోపాటు మహిళల టీమ్ ఈవెంట్‌లో గోల్డ్ మెడల్ సాధించింది.

  • 30 Jul 2021 07:13 AM (IST)

    ఆర్చరీ – థ్రిల్లింగ్ మ్యాచ్‌లో దీపిక విజయం

    ఈ మ్యాచ్‌లో దీపిక 6-5 తేడాతో షూట్-ఆఫ్‌లో గెలిచింది. ఆర్‌ఓసీకి చెందిన పరోవా ఏడు స్కోరు సాధించగా, దీపిక 10 స్కోర్ సాధించింది. ఈ విజయంతో దీపికా క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది.

  • 30 Jul 2021 06:13 AM (IST)

    అథ్లెటిక్స్- బరిలోకి ముగ్గురు అథ్లెట్లు

    అథ్లెటిక్స్ ఈవెంట్స్ ఈ రోజు కూడా మ్యాచులున్నాయి. మొదటి రోజు ముగ్గురు భారత అథ్లెట్లు అవినాష్ సాబుల్ (3000 మీ. స్టీపుల్‌చేస్), ద్యుతీ చంద్, ఎంపీ జబీర్ బరిలోకి దిగనున్నారు.

  • 30 Jul 2021 06:12 AM (IST)

    షూటింగ్ – రాహి సర్నోబాట్ మ్యాచ్ ప్రారంభం

    రాపిడ్ ఫైర్ రౌండ్ ప్రారంభమైంది. రాహి సర్నోబాట్ తొమ్మిదితో ప్రారంభమైంది. రాహీ ప్రస్తుతం 25 వ స్థానంలో నిలిచింది.

  • 30 Jul 2021 06:12 AM (IST)

    25 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్

    ఈ రోజు 25 మీర్ పిస్టల్‌లో మహిళల అర్హత మ్యాచ్ మొదలుకానుంది. ఇందులో మను బాకర్, రాహి సర్నోబాట్ పాల్గొంటారు. ఈ రోజు వారు రాపిడ్ ఫైర్‌లో పాల్గొంటారు.

Follow us on