
ఈస్టర్ పర్వదినాన శ్రీలంకలో ఉగ్రవాదులు జరిపిన వరుస కాల్పుల నుంచి భారత క్రికెట్ దిగ్గజం అనిల్ కుంబ్లే కుటుంబం తృటిలో తప్పించుకుంది. తన భార్య, పిల్లలతో కలిసి వేసవి సెలవులను ఎంజాయ్ చేసేందుకు కుంబ్లే ఇటీవల శ్రీలంక వెళ్లాడు. బాంబు పేలుళ్లు చోటు చేసుకున్న కొలంబోలోని షాంగ్రి లా హోటల్‌లోనే వీరు బస చేశారు. అయితే పేలుడు జరగడానికి గంటల ముందే వారు హోటల్ నుంచి బయటకు వచ్చేశారు. ఆ తరువాత యాలా నేషనల్ పార్క్‌లో ఉండగా.. హోటల్‌లో బాంబు పేలుడు జరిగినట్లు కుంబ్లేకు సమాచారం అందింది. దీంతో శ్రీలంక పర్యటనను అర్ధాంతరంగా ముగించుకున్న వారు మంగళవారం నాడు సురక్షితంగా బెంగళూరుకు చేరుకున్నారు. కాగా అనిల్ కుంబ్లే కుటుంబం అల్పాహారం తీసుకున్న ప్రాంతంలోనే సూసైడ్ బాంబర్ తనను తాను పేల్చుకున్నట్లుగా సమాచారం.