Cricket: బీసీసీఐ నిర్ణయంతో కోహ్లీ ఫ్యాన్స్ సంబరాలు.. కర్మ అంటే ఇదేనంటూ మీమ్స్..

|

Nov 19, 2022 | 10:00 PM

ఆసియా కప్, ఆ తర్వాత టీ20 ప్రపంచ కప్ లో భారత్ ఓడ ఇపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న బీసీసీఐ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా చేతన్ శర్మ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీపై వేటు వేసింది. నూతన సెలక్షన్ కమిటీ కోసం దరఖాస్తులు ఆహ్వానించింది. పదవీ కాలం పూర్తి కాకముందే..

Cricket: బీసీసీఐ నిర్ణయంతో కోహ్లీ ఫ్యాన్స్ సంబరాలు.. కర్మ అంటే ఇదేనంటూ మీమ్స్..
virat kohli
Follow us on

ఆసియా కప్, ఆ తర్వాత టీ20 ప్రపంచ కప్ లో భారత్ ఓడ ఇపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న బీసీసీఐ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా చేతన్ శర్మ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీపై వేటు వేసింది. నూతన సెలక్షన్ కమిటీ కోసం దరఖాస్తులు ఆహ్వానించింది. పదవీ కాలం పూర్తి కాకముందే సెలక్షన్ కమిటీపై వేటు వేసింది. బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకోగానే విరాట్ కోహ్లి ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. సోషల్ మీడియాలో మీమ్స్ పోస్ట్ చేశారు. నెటిజన్లు తమదైన స్టైల్ లో కామెంట్స్ సైతం చేస్తున్నారు. గత ఏడాది టీ20 వరల్డ్ కప్‌లో భారత్ గ్రూప్ దశలోనే నిష్క్రమించడం.. తర్వాత కోహ్లి టీ20 వరల్డ్ కప్ కెప్టెన్సీ నుంచి వైదొలగడం తెలిసిందే. నెల రోజుల తర్వాత కోహ్లిని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించారు. ఇది తీవ్ర చర్చనీయాంశమైంది. కెప్టెన్సీకి రాజీనామా చేసే విషయమై పునరాలోచించుకోవాలని కోహ్లికి సూచించామని అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ తెలిపాడు. ఇదే విషయాన్ని చేతన్ శర్మ కూడా చెప్పుకొచ్చాడు. కానీ తర్వాత కోహ్లి మాట్లాడుతూ.. గంటన్నర ముందు మాత్రమే తనకు చెప్పారన్నాడు. జనవరిలో సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ ముగిశాక విరాట్ టెస్టు కెప్టెన్సీని సైతం వదిలేశాడు. కోహ్లికి వ్యతిరేకంగా ఈ ఎపిసోడ్ నడవడానికి సౌరభ్ గంగూలీ, చేతన్ శర్మ కారణమని విరాట్ ఫ్యాన్స్ బలంగా నమ్ముతూ వచ్చారు. ఇటీవలే గంగూలీ బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి దిగిపోగా.. తాజాగా చేతన్ శర్మ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీపై బోర్డు వేటు వేయడంతో.. కోహ్లి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

కర్మ అంటే ఇదేనంటూ కామెంట్స్ చేస్తున్నారు. 2021 నవంబర్ 18న కోహ్లిని కెప్టెన్‌గా తప్పిస్తే.. సరిగ్గా మరుసటి ఏడాది అదే రోజున చేతన్ శర్మపై బీసీసీఐ వేటు వేసిందంటూ మీమ్స్ పోస్టు చేస్తున్నారు. ఇప్పుడు గంగూలీ, చేతన్ శర్మ ఇద్దరూ లేరు.. విరాట్ కోహ్లి మళ్లీ ఫామ్‌లోకి వచ్చి అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇక రోహిత్ శర్మ కూడా టీ20 కెప్టెన్సీని పోగొట్టుకునేలా ఉన్నాడంటూ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ట్వీట్లు చేస్తున్నారు. నూతన సెలక్షన్ కమిటీ వచ్చే ఏడాది జనవరిలో బాధ్యతలు చేపట్టనుంది. వెంటనే టీ20లకు కొత్త కెప్టెన్‌ను నియమించే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

చేతన్ శర్మ సెలక్షన్ కమిటీ బాధ్యతలను పర్యవేక్షిస్తున్న సమయంలోనే.. 2021 టీ20 వరల్డ్ కప్‌లో తొలి దశలోనే నిష్క్రమించిన టీమిండియా.. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి చవిచూసింది. ఆసియా కప్ 2022లో ఫైనల్ చేరలేకపోయిన భారత్.. ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో ఫైనల్ చేరలేకపోయింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..