ఆ ఒక్క బంతి సంచలనం సృష్టిస్తోంది

| Edited By: Srinu

Mar 06, 2019 | 7:53 PM

విశాఖ: డెత్ ఓవర్లలో జాస్ప్రిత్ బూమ్రాకు ఉన్న పేరు మామూలు పేరు కాదు. అతనకు ఈ విషయంలో అంతకంతకూ పేరు పెరిగిపోతోంది. డెత్ ఓవర్లలో రాటుదేలిపోయిన బూమ్రాను చూస్తే ప్రత్యర్ధి ఆటగాళ్లు వణికిపోతున్న పరిస్థితి ఏర్పడింది. తాజాగా బూమ్రా మరోసారి పొగడ్తల వర్షంలో తడిసిపోతున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో దుమ్ము దులిపేశాడు. అతను వేసిన 19వ ఓవర్ గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. ఆ ఓవర్‌లో కూడా ఆఖరి బంతి గురించి అయితే మరింత ఎక్కువగా […]

ఆ ఒక్క బంతి సంచలనం సృష్టిస్తోంది
Follow us on

విశాఖ: డెత్ ఓవర్లలో జాస్ప్రిత్ బూమ్రాకు ఉన్న పేరు మామూలు పేరు కాదు. అతనకు ఈ విషయంలో అంతకంతకూ పేరు పెరిగిపోతోంది. డెత్ ఓవర్లలో రాటుదేలిపోయిన బూమ్రాను చూస్తే ప్రత్యర్ధి ఆటగాళ్లు వణికిపోతున్న పరిస్థితి ఏర్పడింది. తాజాగా బూమ్రా మరోసారి పొగడ్తల వర్షంలో తడిసిపోతున్నాడు.

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో దుమ్ము దులిపేశాడు. అతను వేసిన 19వ ఓవర్ గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. ఆ ఓవర్‌లో కూడా ఆఖరి బంతి గురించి అయితే మరింత ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఆ బంతి ఒక అద్భుతం. బూమ్రా వేసిన ఆ బంతి ఇన్ స్వింగ్ అయ్యి బ్యాట్ మధ్య సందులో నుంచి వేగంగా దూసుకుపోయి వికెట్లను గిరాటేసింది.

అంతే ఏం జరిగిందో అంటూ సహచర భారత ఆటగాళ్లు, అంపైర్‌తో పాటు ఔటైన ఆసిస్ బ్యాట్స్‌మెన్ కౌంటర్ నిలే కూడా ఆశ్చర్యపోయాడు. 142 కిలో మీటర్ల వేగంతో బూమ్రా వేసిన ఆ బంతికి కౌంటర్ నిలే దగ్గర సమాధానం లేదు. అతనే కాదు ఏ బ్యాట్స్‌మెన్‌కైనా ఆ బంతికి బౌల్డ్ కాకుండా ఉండటం సాధ్యం కాదేమో అన్న విధంగా అద్భుతంగా వేశాడు బూమ్రా.

ఈ బంతి డెలివరీ గురించి క్రికెట్ విశ్లేషకులు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. డెత్ ఓవర్ల కింగ్‌గా పేరొందిన బూమ్రా పేరు ఈ డెలివరీతో మరింత పెరిగింది. క్రికెట్ ప్రపంచంలో ఇది సంచలన సృష్టిస్తోంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత జట్టు 127 పరుగులు చేయగా ఛేదనలో ఆసిస్ జట్టు ఆఖరి బంతికి 2 పరుగులు చేయడం ద్వారా 128 పరుగులకు చేరుకుని విజయం సాధించింది.