AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐపీఎల్ 2020: ఫ్రాంచైజీలకు షాక్ ఇవ్వనున్న బీసీసీఐ!

ఐపీఎల్ 2020 వేలంలో కొన్ని సర్‌ప్రైజ్‌లు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఆసీస్ ఆల్‌రౌండర్ పాట్ కమ్మిన్స్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. కేకేఆర్ 15.50 కోట్లతో ఈ ఆస్ట్రేలియన్ స్టార్ ప్లేయర్‌ను కొన్న విషయం తెలిసిందే. ఒక్క కమ్మిన్స్ మాత్రమే కాదు.. గ్లెన్ మాక్స్‌వెల్, క్రిస్ మోరిస్, నాథన్ కౌల్టర్‌నైల్. షెల్డన్ కాట్రేల్ కూడా వేలంలో అత్యధిక ధరలకు అమ్ముడైయ్యారు. ఇదిలా ఉంటే.. మార్టిన్ గప్తిల్, బెన్ కటింగ్, టిమ్ […]

ఐపీఎల్ 2020: ఫ్రాంచైజీలకు షాక్ ఇవ్వనున్న బీసీసీఐ!
Ravi Kiran
|

Updated on: Dec 25, 2019 | 8:48 PM

Share

ఐపీఎల్ 2020 వేలంలో కొన్ని సర్‌ప్రైజ్‌లు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఆసీస్ ఆల్‌రౌండర్ పాట్ కమ్మిన్స్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. కేకేఆర్ 15.50 కోట్లతో ఈ ఆస్ట్రేలియన్ స్టార్ ప్లేయర్‌ను కొన్న విషయం తెలిసిందే. ఒక్క కమ్మిన్స్ మాత్రమే కాదు.. గ్లెన్ మాక్స్‌వెల్, క్రిస్ మోరిస్, నాథన్ కౌల్టర్‌నైల్. షెల్డన్ కాట్రేల్ కూడా వేలంలో అత్యధిక ధరలకు అమ్ముడైయ్యారు.

ఇదిలా ఉంటే.. మార్టిన్ గప్తిల్, బెన్ కటింగ్, టిమ్ సౌథీ, ఆడమ్ జాంప, ముస్తాఫిజుర్ రెహమాన్ లాంటి అంతర్జాతీయ ఆటగాళ్లపై ఈ వేలంలో ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపించకపోవడం క్రికెట్ ఫ్యాన్స్‌తో పాటు విశ్లేషకులకు కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ఐపీఎల్ వేలం ముగిసింది. ఇప్పుడు అందరి కళ్ళు టోర్నమెంట్‌పై ఉంది. బీసీసీఐ కూడా త్వరలోనే తేదీలను ప్రకటించనుంది. అయితే తాజాగా ఐపీఎల్ 2020 స్టార్టింగ్ డేట్‌పై ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇక అది కాస్తా ఫ్రాంచైజీలను గాబరా పెడుతోంది. దేనికో ఇప్పుడు తెలుసుకుందాం.

ఐపీఎల్ ఆరంభం మిస్ కానున్న స్టార్ ప్లేయర్స్…

మార్చి 28న ఐపీఎల్ మొదలుపెట్టాలని బీసీసీఐ ఆలోచిస్తోంది. ఒకవేళ ఇదే ఫైనల్ అయితే చాలామంది స్టార్ ఆటగాళ్లు ఆరంభ మ్యాచులు మిస్ కానున్నారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, శ్రీలంక ప్లేయర్స్ అందరూ కూడా స్టార్టింగ్ మ్యాచులకు అందుబాటులో ఉండరు.

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య టీ20 సిరీస్.. అదే విధంగా ఇంగ్లాండ్, శ్రీలంక మధ్య టెస్ట్ సిరీస్ మార్చి 28 నుంచే మొదలు కానున్నాయి. ఒకవేళ బీసీసీఐ ఏప్రిల్ మొదటి వారంలో టోర్నమెంట్ మొదలుపెట్టాలని చూసినా.. ఈ ఆటగాళ్లు రెండు, మూడు మ్యాచులు మిస్ కావడం గ్యారంటీ.

ఫ్రాంచైజీల వారీగా ఆరంభ మ్యాచులు మిస్ కానున్న ప్లేయర్స్ వీరే..

కోల్‌కతా: పాట్ కమ్మిన్స్

పంజాబ్: గ్లెన్ మాక్స్‌వెల్

సన్‌రైజర్స్: కేన్ విలియమ్సన్, డేవిడ్ వార్నర్

రాజస్థాన్ : స్టీవ్ స్మిత్, జోస్ బట్లర్, జోఫ్రా ఆర్చర్

Follow Us
ఈ షాకింగ్‌ ఘటన చూస్తే వణుకుపుట్టాల్సిందే..!
ఈ షాకింగ్‌ ఘటన చూస్తే వణుకుపుట్టాల్సిందే..!
ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుడి బ్యాగులో గన్.. అంతలోనే కాల్పులతో..
ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుడి బ్యాగులో గన్.. అంతలోనే కాల్పులతో..
గంటకు 320 కి.మీ. వేగంతో నీటి అడుగున భారత్ తొలి బుల్లెట్ రైలు..
గంటకు 320 కి.మీ. వేగంతో నీటి అడుగున భారత్ తొలి బుల్లెట్ రైలు..
ఆస్తి ఆశతో దారుణ హత్యలు.. సీసీకెమెరాలో కిల్లర్ తల్లి, కొడుకు !
ఆస్తి ఆశతో దారుణ హత్యలు.. సీసీకెమెరాలో కిల్లర్ తల్లి, కొడుకు !
వందే భారత్ ఢీ కొని యువతి మృతి! మౌలాలి వద్ద విషాద ఘటన
వందే భారత్ ఢీ కొని యువతి మృతి! మౌలాలి వద్ద విషాద ఘటన
బెడ్‌షీట్ల నుంచి చెమట, ముక్క వాసన వస్తోందా..? ఇలా క్లీన్ చేస్తే
బెడ్‌షీట్ల నుంచి చెమట, ముక్క వాసన వస్తోందా..? ఇలా క్లీన్ చేస్తే
ఇరుముడి 'మల్లెపూల పల్లకి' సాంగ్ వచ్చేసింది.. లిరికల్ వీడియో
ఇరుముడి 'మల్లెపూల పల్లకి' సాంగ్ వచ్చేసింది.. లిరికల్ వీడియో
31 ఏళ్ల రికార్డులు బద్దలు.. కమిన్స్ పేరిట చెత్త రికార్డ్..!
31 ఏళ్ల రికార్డులు బద్దలు.. కమిన్స్ పేరిట చెత్త రికార్డ్..!
ఇదెక్కడి బాల్ రా సామీ.. ఆసీస్ బ్యాటర్ మైండ్ బ్లాంక్
ఇదెక్కడి బాల్ రా సామీ.. ఆసీస్ బ్యాటర్ మైండ్ బ్లాంక్
రాత్రిపూట పుదీనా టీ తాగి పడుకుంటే ఏమవుతుందో తెలుసా? ఆరోగ్య లాభాలు
రాత్రిపూట పుదీనా టీ తాగి పడుకుంటే ఏమవుతుందో తెలుసా? ఆరోగ్య లాభాలు