Muttiah Muralitharan: అంతర్జాతీయ క్రికెట్‌లో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ముత్తయ్య మురళీధరన్. అన్ని ఫార్మాట్లు కలిపి 1,374 వికెట్లు తీసుకున్న ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఇక టెస్టు క్రికెట్‌లో 800 వికెట్లు తీసిన తొలి ఆటగాడిగా, వన్డేల్లో 534 వికెట్లతో చరిత్రకెక్కాడు. తాజాగా మురళీధరన్ కొడుకు నరేన్ బౌలింగ్ యాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అచ్చం తండ్రి బౌలింగ్ యాక్షన్‌ను దింపిన నరేన్ వీడియో హల్‌చల్ చేస్తుంది. ఈ వీడియోనూ స్వయంగా మురళీధరన్ తన ట్విటర్‌లో షేర్ చేస్తూ.. ఇట్స్ ఫాదర్ అండ్ సన్ టైమ్.. వీడియో క్రెడిట్స్ టూ సన్‌రైజర్స్ అంటూ కామెంట్ చేశాడు.
ఇదిలా ఉండగా, రావల్సిండి ఎక్స్‌ప్రెస్‌గా గుర్తింపు దక్కించుకున్న షోయబ్ అక్తర్, ముత్తయ్య మురళీధరన్‌కు బౌలింగ్ చేసేందుకు తెగ ఇబ్బంది పడేవాడంట. అవును మీరు విన్నది నిజమే.. టాప్ క్లాస్ బ్యాట్స్‌మెన్లకు బౌలింగ్ చేసిన షోయబ్ అక్తర్, ముత్తయ్యకి బౌలింగ్ చేయడానికి బాగా ఇబ్బందిపడ్డాడట. ఈ విషయాన్ని తాజాగా వెల్లడించాడు అక్తర్. తాను బౌన్సర్ వేస్తే, అది తగిలి తాను చనిపోతానని, దయచేసి అలాంటి బాల్స్ వేయొద్దని కోరాడని తెలిపాడు అక్తర్.
రిక్వెస్ట్ చేస్తున్నాడు కదా అని… తాను సాధారణంగా బాల్స్ వేసేవాడినని.. వాటిని అతను బౌండరీకి తరలించేవాడని చెప్పుకొచ్చాడు. బౌండరీ కొట్టిన తర్వాత అనుకోకుండా తగిలేసిందని, కొట్టాలని అనుకోలేదని చెప్పేవాడని తెలిపాడు.
Muttiah Muralitharan:
Father and Son Time! Video credits @SunRisers pic.twitter.com/Jv8fYOAZcp
— Muthiah Muralidaran (@Murali_800) July 15, 2021
Also read:
Pushpa Movie: “పుష్ప” షూట్ మళ్లీ ఆగిపోయిందా ? అసలు కారణం ఇదేనా..