SRH vs GT Highlights: 8 వికెట్ల తేడాతో గుజరాత్‌పై హైదరాబాద్ గెలుపు..
Sunrisers Hyderabad vs Gujarat Titans Live Score in Telugu: సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరుగుతోన్న మ్యాచ్ లో హైదరాబాద్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ తీసుకుంది. మరి హైదరాబాద్ నిర్ణయం ఏమేర ఫలిస్తుందో చూడాలి..
Sunrisers Hyderabad vs Gujarat Titans Live Score in Telugu: ఐపీఎల్ 2022 (IPL 2022)లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ముంబయిలోని పటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad), గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) జట్ల మధ్య జరగనున్న మ్యాచ్‌పై అందరి దృష్టి పడింది. గుజరాత్ టీమ్ ఈ ఐపీఎల్‌లో హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగానే ఇప్పటి వరకు జరిగిన మూడు మ్యాచ్‌ల్లోనూ గుజరాత్ విజయ కేతనం ఎగరేసింది. ఇక శనివారం చెన్నైని ఓడించి తొలి విజయాన్ని అందుకుంది హైదరాబాద్. దీంతో విజయ ఉత్సాహంతో ఉన్న ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ సర్వత్రా ఆసక్తి నెలకొంది.
అటు సన్‌రైజర్స్, ఇటు గుజరాత్ టైటాన్స్ రెండు జట్లు ఫామ్ విషయంలో ఢీ అంటే ఢీ అనేలా ఉన్నాయి.పాయింట్ల పట్టికలో గుజరాత్ జట్టు మూడో స్థానంలో ఉంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన ఈ జట్టు మూడింటిలోనూ విజయం సాధించింది. సన్‌రాజర్స్‌పై గుజరాత్ ఈ ఫామ్‌ను నిలబెట్టుకోవాలనుకుంటోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌ను ధీటుగా ఎదుర్కోవాలని జట్టులో పలు మార్పులు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక సన్‌రైజర్స్ విషయానికొస్తే ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.
రెండు జట్ల ప్లేయింగ్ XI (అంచనా):
సన్‌రైజర్స్ హైదరాబాద్ – కేన్ విలియమ్సన్ (కెప్టెన్) అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్ (కీపర్), శశాంక్ సింగ్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, మార్కో యాన్సన్, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్.
గుజరాత్ టైటాన్స్ – హార్దిక్ పాండ్యా(కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్ (కీపర్), శుభమాన్ గిల్, సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, అభినవ్ మనోహర్, రషీద్ ఖాన్, లాకీ ఫెర్గూసన్, మహమ్మద్ షమీ, దర్శన్ నల్కండే.
Key Events
తొలి ఐపీఎల్ ఆడుతోన్న గుజరాత్ టైటాన్స్ జోష్ మీదుంది. ఇప్పటికే వరుసగా మూడు విజయాలను అందుకొని హ్యాట్రిక్ సాధించిన గుజరాత్ అనే జోరు కనిపించేలా ఉంది.
సన్‌రైజర్స్ చివరి మ్యాచ్ చెన్నైపై విజయాన్ని సాధించినప్పటికీ. గుజరాత్‌పై విజయాన్ని సాధించడం అంత సులభంగా కనిపించట్లేదు. గుజరాత్ నుంచి గట్టి పోటీ ఎదుర్కునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
LIVE Cricket Score & Updates
-
రెండో వికెట్ కోల్పోయిన హైదరాబాద్
హైదరాబాద్ రెండో వికెట్ కోల్పోయింది. 57 పరుగులు చేసిన కెప్టెన్ కేన్ విలియమ్సన్ పాండ్యా బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.
-
హాఫ్ సెంచరీ చేసిన విలియమ్సన్
హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ హాఫ్ సెంచరీ చేశాడు. 42 బంతుల్లో 52(2 ఫోర్లు, 4 సిక్స్‌లు) పరుగులు చేశాడు.
-
-
రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరి రాహుల్ త్రిపాఠి
హైదరాబాద్ ఆటగాడు.. రాహుల్ త్రిపాఠి 17 పరుగులు చేసి రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. బ్యాటింగ్ చేయడంలో ఇబ్బంది పడుతుండడంతో మైదానాన్ని విడాడు.
-
మొదటి వికెట్ కోల్పోయిన హైదరాబాద్
సన్‌రైజర్స్ హైదరాబాద్ మొదటి వికెట్ కోల్పయింది. అభిషేక్ శర్మ ఔటయ్యాడు.
-
ఆచితూచి ఆడుతోన్న హైదరాబాద్ బ్యాట్స్‌మెన్..
గుజరాత్ ఇచ్చిన 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ ఆచితూచి ఆడుతోంది. వికెట్ కోల్పోకూడదనే ఉద్ధేశంతో నెమ్మదిగా పరుగులు సాధిస్తున్నారు. రిస్క్ తీసుకోకుండా ఆడుతున్నారు. విలియమ్‌సన్, అభిషేక్ శర్మ సేఫ్ గేమ్ ఆడుతున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ 5 ఓవర్లు ముగిసే సమయానికి 25 పరుగుల వద్ద కొనసాగుతోంది.
-
-
ముగిసిన గుజరాత్ ఇన్నింగ్స్..
గుజరాత్ ఇన్నింగ్స్ ముగిసింది. 20 ఓవర్లు ఆడిన గుజరాత్ 7 వికెట్ల నష్టానికి 162 పరుగులు సాధించింది. గుజరాత్ టీమ్‌లో హార్ధిక్ పాండ్యే 50 పరుగులతో అజేయంగా నిలిచాడు. చివరి క్షణంలో హైదరాబాద్ బౌలర్స్ రాణించడంతో గుజరాత్‌ను తక్కువ స్కోర్‌కే పరిమితం చేశారు.
-
హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న పాండ్యా..
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 42 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు.
-
మరో వికెట్ కోల్పోయిన గుజరాత్..
జట్టు స్కోరు దూసుకుపోతున్న దిశలో గుజరాత్ మరో వికెట్ కోల్పోయింది. అభినవ్ మనోహర్ భువనేశ్వర్ బౌలింగ్‌లో త్రిపాఠికి క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు.
-
మరో వికెట్ కోల్పోయిన గుజరాత్..
గుజరాత్ టైటాన్స్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్కోరు క్రమంగా పెరుగుతోంది అనుకుంటున్న సమయంలో నాలుగో వికెట్ కోల్పోయింది. మార్కో యాన్సన్ బౌలింగ్‌లో అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చిన డేవిడ్ మిల్లర్ 12 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. 14 ఓవర్లు ముగిసే సమయానికి గుజరాత్ 108 పరుగుల వద్ద కొనసాగుతోంది.
-
వంద దాటిన గుజరాత్ స్కోర్..
జట్టు స్కోరు పెంచే క్రమంలో గుజరాత్ బ్యాట్స్‌మెన్ ఆచితూచి ఆడుతున్నారు. ఈ క్రమంలోనే గుజరాత్ 100 పరుగుల మార్క్‌ను దాటేసింది. 13 ఓవర్లు ముగిసే సమయానికి గుజరాత్ 102 పరుగుల వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం క్రీజులో డేవిడ్ మిల్లర్ (11), హార్ధిక్ పాండ్యా (36) పరుగుల వద్ద కొనసాగుతున్నాడు.
-
మరో వికెట్ కోల్పోయిన గుజరాత్..
గుజరాత్ మరో వికెట్‌ను కోల్పోయింది. మాథ్యూ వేడ్ మాలిక్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో గుజరాత్ 3 వికెట్లు కోల్పోయి 65 పరుగుల వద్ద కొనసాగుతోంది.
-
రెండో వికెట్ కోల్పోయిన గుజరాత్..
గుజరాత్ సాయి సుదర్శన్ రూపంలో రెండో వికెట్‌ను కోల్పోయింది. నటరాజన్ బౌలింగ్‌లో విలియమ్‌సన్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. గుజరాత్ ప్రస్తుతం రెండు వికెట్లు కోల్పోయి 52 పరుగుల వద్ద కొనసాగుతోంది.
-
తొలి వికెట్ గాన్..
గుజరాత్ తొలి వికెట్ కోల్పోయింది. 7 పరుగుల వద్ద శుభమ్ గిల్ అవుట్ అయ్యాడు. భువనేశ్వర్ బౌలింగ్‌లో త్రిపాఠికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు.
-
టాస్ గెలిచిన హైదరాబాద్..
గుజరాత్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలుత బౌలింగ్‌కు దిగేందుకు ఆసక్తి చూపించింది. మరి కేన్ విలియమ్సన్ తీసుకున్న ఈ నిర్ణయం ఆ జట్టుకు ఏమేర ఉపయోగపడుతుందో చూడాలి.
-
మ్యాచ్‌లో అరుదైన దృశ్యం..
ఈరోజు జరిగే ఈ మ్యాచ్‌లో ఓ అరుదైన దృశ్యం కనిపించనుంది. గతంలో ఒకే జట్టుకు చెందిన ఇద్దరు ప్లేయర్స్ ఇప్పుడు తలపడనున్నారు. హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, గుజరాత్‌కు చెందిన రషీద్ ఖాన్ ఢీకొట్టనున్నారు. గతంలో వీరిద్దరూ సన్‌రైజర్స్ టీమ్‌లో ఆడిన విషయం తెలిసిందే. గత సీజన్‌లో సన్‌రైజర్స్‌కు ఆడిన రషీద్ ఇప్పుడు గుజరాత్ తరఫున జట్టులోకి దిగుతున్నాడు.
Published On - Apr 11,2022 6:52 PM