Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sania Mirza: సానియా పేరు లేకుండానే ట్వీట్.. ఎట్టకేలకు మౌనం వీడినా.. క్లారిటీ ఇవ్వని షోయబ్ మాలిక్..

Shoaib Malik-Sania Mirza: సానియా మీర్జా శుక్రవారం ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్ మ్యాచ్ ఆడింది. ఇది తన కెరీర్‌లో చివరి గ్రాండ్‌స్లామ్ మ్యాచ్. టైటిల్ మిస్సయినా ఎంతోమంది అభిమానుల హృదయాలను భావోద్వేగానికి గురి చేసింది.

Sania Mirza: సానియా పేరు లేకుండానే ట్వీట్.. ఎట్టకేలకు మౌనం వీడినా.. క్లారిటీ ఇవ్వని షోయబ్ మాలిక్..
Shoaib Malik-Sania Mirza
Follow us
Venkata Chari

|

Updated on: Jan 28, 2023 | 6:37 AM

ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్లో ఇద్దరు భారత స్టార్ల జోడీ ఓడిపోయింది. ముఖ్యంగా ఈ ఓటమితో సూపర్ స్టార్ సానియా మీర్జా కెరీర్ కూడా ముగిసింది. భారతదేశంలో మహిళల టెన్నిస్‌కు గుర్తింపు తెచ్చిన సానియా మీర్జా తన చివరి గ్రాండ్‌స్లామ్‌లో టైటిల్‌ను కోల్పోయింది. దీంతో కన్నీటి పర్వంతమైంది.

ఆస్ట్రేలియా నుంచి భారతదేశం వరకు ప్రతి ఒక్కరూ సానియా అందించిన సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. సానియా ఓడిపోవడమే కాదు, ఇప్పుడు మళ్లీ గ్రాండ్‌స్లామ్‌లో ఆడడాన్ని చూడలేకపోతామనే బాధను కూడా వ్యక్తం చేశారు. ఇదే ఆమెకు చివరి గ్రాండ్‌స్లామ్. సోషల్ మీడియాలో సానియాపై అందరూ తమ ప్రేమను, కృతజ్ఞతలు తెలిపారు. అదే సమయంలో, ఈ అద్భుతమైన కెరీర్ ముగింపులో సానియా భర్త షోయబ్ మాలిక్ ఎందుకు మౌనంగా ఉన్నారనే దానిపై కూడా అందరి కళ్ళు నిలిచాయి.

ఇవి కూడా చదవండి

నిశ్శబ్దాన్ని ఛేదించిన షోయబ్..

సానియా ప్రయాణం దాదాపు ముగిసింది. షోయబ్ మాలిక్ పుకార్ల మధ్య సానియాకు ఒక ట్వీట్‌లో శుభాకాంక్షలు తెలిపాడు. సానియా పేరును ఎక్కడా ప్రస్తావించకుండా కేవలం ఫోటోను మాత్రమే పోస్ట్ చేయడం ఆశ్చర్యం కలిగించింది.

‘మీరు క్రీడలలో మహిళలందరికీ స్ఫూర్తిగా నిలిచారు. మీ కెరీర్‌లో మీరు సాధించిన దానికి నేను చాలా గర్వపడుతున్నాను. మీరు చాలా బలంగా ముందుకు కొనసాగండి. అద్భుతమైన కెరీర్‌కు అభినందనలు’ అంటూ ట్వీట్ చేశాడు.

చాలా కాలంగా విడిపోతారనే పుకార్లు..

గత కొన్ని నెలలుగా, సానియా, షోయబ్ మధ్య సంబంధం క్షీణించడంతో విడిపోయే అవకాశం ఉందనే కారణంగా వార్తల్లో నిలిచారు. ఇద్దరు ఆటగాళ్లు చాలా కాలంగా కలిసి జీవించడం లేదని నిరంతరం వార్తలు వచ్చాయి. మోడల్‌తో ఉన్న సంబంధం కారణంగానే షోయబ్ మాలిక్ సానియాను మోసం చేసి పట్టుబడ్డాడని, దీంతో భారత టెన్నిస్ స్టార్ దూరంగా ఉంటుందంటూ పాకిస్థాన్ మీడియాలో ఆరోపణలు వచ్చాయి. సానియా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అనేక పోస్ట్‌లను కూడా షేర్ చేసింది. ఇది విడిపోతున్న పుకార్లకు బలం ఇచ్చింది. అయితే, ఇప్పటికీ వీరిద్దరి నుంచి ఈ వార్తలను ఖండించకపోవడంతో, విడిపోతారనే వార్తలకు మరింత బలం చేకూరింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

జంక్ ఫుడ్ అలవాటు ఉన్నవారికి దీన్ని కచ్చితంగా తినిపించండి
జంక్ ఫుడ్ అలవాటు ఉన్నవారికి దీన్ని కచ్చితంగా తినిపించండి
ఓటీటీలోకి విక్కీ కౌశల్, రష్మికల బ్లాక్ బస్టర్ మూవీ ఛావా..
ఓటీటీలోకి విక్కీ కౌశల్, రష్మికల బ్లాక్ బస్టర్ మూవీ ఛావా..
మీరు పండ్లు తినేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి..!
మీరు పండ్లు తినేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి..!
గుట్టలాంటి పొట్టకు పవర్‌ఫుల్ ఛూమంత్రం.. డైలీ ఓ కప్పు తాగితే..
గుట్టలాంటి పొట్టకు పవర్‌ఫుల్ ఛూమంత్రం.. డైలీ ఓ కప్పు తాగితే..
పేదింటి బిడ్డలను ఐపీఎల్‌ స్టార్స్‌ చేస్తున్నారు! హ్యాట్సాఫ్‌ MI
పేదింటి బిడ్డలను ఐపీఎల్‌ స్టార్స్‌ చేస్తున్నారు! హ్యాట్సాఫ్‌ MI
ఇంట్లో గొడవలా.. వెంటనే ఈ అలవాట్లకు గుడ్ బై చెప్పండి..
ఇంట్లో గొడవలా.. వెంటనే ఈ అలవాట్లకు గుడ్ బై చెప్పండి..
సాయి ధరమ్ తేజ్‌కు నోటీసులు.. దెబ్బకు సినిమానే ఆపేశారు
సాయి ధరమ్ తేజ్‌కు నోటీసులు.. దెబ్బకు సినిమానే ఆపేశారు
ఈవారం థియేటర్స్‌లో దుమ్మురేపే మూవీస్ ఇవే..
ఈవారం థియేటర్స్‌లో దుమ్మురేపే మూవీస్ ఇవే..
ఇరకాటంలో 'దోస్త్' ఆన్‌లైన్ వ్యవస్థ.. కన్వినర్ నియామకం ఇంకెప్పుడో?
ఇరకాటంలో 'దోస్త్' ఆన్‌లైన్ వ్యవస్థ.. కన్వినర్ నియామకం ఇంకెప్పుడో?
భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌ల భవిష్యత్తుపై షాకింగ్ అప్‌డేట్!
భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌ల భవిష్యత్తుపై షాకింగ్ అప్‌డేట్!