‘పుల్వామా’ అమరవీరుల పిల్లల కోసం సెహ్వాగ్​ ఏం చేశాడంటే..?

| Edited By: Pardhasaradhi Peri

Oct 19, 2019 | 1:52 PM

భారత మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫార్మాట్ ఏదైనా దూకుడుతో ఆటను ప్రదర్శించే అతడు..ఇండియా గురించి మాట్లాడే పాక్ క్రికెటర్లను కూడా అదే రేంజ్‌లో వాయించేస్తాడు. ఇక ఎప్పుడూ తన దేశభక్తిని చాటుకుంటూ..అందరికి అభిమాన వ్యక్తిగా మారిపోయాడు. తాజాగా సెహ్వాగ్ తన మంచి మనసును మరోసారి చాటుకున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్​పీఎఫ్​ జవాన్లు మరణించగా.. ఆ అమర జవాన్ల పిల్లలకు సహాయం చేస్తానని ఇంతకు […]

పుల్వామా అమరవీరుల పిల్లల కోసం సెహ్వాగ్​  ఏం చేశాడంటే..?
Follow us on

భారత మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫార్మాట్ ఏదైనా దూకుడుతో ఆటను ప్రదర్శించే అతడు..ఇండియా గురించి మాట్లాడే పాక్ క్రికెటర్లను కూడా అదే రేంజ్‌లో వాయించేస్తాడు. ఇక ఎప్పుడూ తన దేశభక్తిని చాటుకుంటూ..అందరికి అభిమాన వ్యక్తిగా మారిపోయాడు. తాజాగా సెహ్వాగ్ తన మంచి మనసును మరోసారి చాటుకున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్​పీఎఫ్​ జవాన్లు మరణించగా.. ఆ అమర జవాన్ల పిల్లలకు సహాయం చేస్తానని ఇంతకు ముందే తెలిపాడు. ప్రస్తుతం ‘అంతర్జాతీయ స్కూల్‌’లో కొంతమంది జవాన్ల పిల్లలు క్రికెట్‌ శిక్షణ పొందుతున్న దృశ్యాలను తాజాగా సెహ్వాగ్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. నెటిజన్లు సెహ్వాగ్​పై ప్రశంసలు కురిపిస్తున్నారు.”దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన వీరులకు ఎంతో కొంత తిరిగి ఇవ్వడం మన విధి మీరు గొప్ప వారు సర్‌” అంటూ కామెంట్లు చేస్తున్నారు.

‘నా స్కూల్‌లో ఈ చిన్నారులకు సేవలు అందించడం ఎంతో గొప్ప విషయంగా భావిస్తున్నా. ఈ చిన్నారులు భారత అమర వీరుల బిడ్డలు. బ్యాట్స్‌మెన్‌ చేస్తున్న వ్యక్తి అర్పిత్‌ సింగ్‌ పుల్వామా అమర జవాన్ రామ్‌ వకీల్‌ కుమారుడు, బౌలర్‌ రాహుల్‌ సోరెంగ్‌ పుల్వామా అమర జవాన్ విజయ్‌ సోరెంగ్‌ కుమారుడు. ఇంతకన్నా ఆనందాన్నిచ్చే పనులు ఉంటాయా’ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇటీవల మరో మాజీ క్రికెటర్‌, బీజేపీ ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ సైతం అమర వీరుల చెందిన 100 మంది చిన్నారుల సంరక్షణ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. వారి చదువులకు అయ్యే ఖర్చును గౌతమ్‌ గంభీర్‌ ఫౌండేషన్‌ తరపున తానే భరిస్తానని గంభీర్‌ చెప్పారు.