చెలరేగిన రోహిత్… విండీస్ విజయ లక్ష్యం 168!

విండీస్‌తో జరుగుతున్న రెండో టీ20 భారత్ భారీ స్కోరు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. రోహిత్ శర్మ విజృంభణతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. రోహిత్ 51 బంతుల్లో 6 ఫోర్లు, మూడు సిక్సర్లతో 67 పరుగులు చేశాడు. ధవన్ 23, కోహ్లీ 28 పరుగులు చేశారు. చివరి ఓవర్‌లో కృనాల్ పాండ్యా (20) రెండు, రవీంద్ర జడేజా (9) ఓ సిక్సర్ బాదడంతో ఆ ఓవర్లో […]

చెలరేగిన రోహిత్... విండీస్ విజయ లక్ష్యం 168!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 04, 2019 | 9:59 PM

విండీస్‌తో జరుగుతున్న రెండో టీ20 భారత్ భారీ స్కోరు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. రోహిత్ శర్మ విజృంభణతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. రోహిత్ 51 బంతుల్లో 6 ఫోర్లు, మూడు సిక్సర్లతో 67 పరుగులు చేశాడు. ధవన్ 23, కోహ్లీ 28 పరుగులు చేశారు. చివరి ఓవర్‌లో కృనాల్ పాండ్యా (20) రెండు, రవీంద్ర జడేజా (9) ఓ సిక్సర్ బాదడంతో ఆ ఓవర్లో ఏకంగా 20 పరుగులు వచ్చాయి. దీంతో భారత్ 167 పరుగులు చేసి ప్రత్యర్థి విండీస్‌ ఎదుట భారీ విజయ లక్ష్యాన్ని ఉంచింది. విండీస్ బౌలర్లలో ఓష్నె థామస్, షెల్డన్ కాట్రెల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. కీమో పాల్‌కు ఓ వికెట్ దక్కింది.