సిరీస్ కైవసం చేసుకున్న భారత్!
ఫ్లోరిడా: విండీస్‌తో జరిగిన రెండో టీ20లో కూడా భారత్ విజయభేరి మ్రోగించింది. డక్వర్త్ లూయిస్ పద్దతిలో టీమిండియా 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 167 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(67) అర్ధసెంచరీతో రాణించాడు. అనంతరం 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్.. 15.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసిన తరుణంలో వర్షం పడింది. […]
ఫ్లోరిడా: విండీస్‌తో జరిగిన రెండో టీ20లో కూడా భారత్ విజయభేరి మ్రోగించింది. డక్వర్త్ లూయిస్ పద్దతిలో టీమిండియా 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 167 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(67) అర్ధసెంచరీతో రాణించాడు. అనంతరం 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్.. 15.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసిన తరుణంలో వర్షం పడింది. అయితే వర్షం తగ్గకపోవడంతో అంపైర్లు డక్వర్త్ లూయిస్ పద్దతిలో టీమిండియాను విజేతగా ప్రకటించారు. దీంతో భారత్ మూడు టీ20ల సిరీస్‌ను 2-0తో వశం చేసుకుంది. అటు విండీస్ బ్యాట్స్‌మెన్‌లో రోమన్ పావెల్(54) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్ చేశాడు.
Play has been called off due to rain. We win by 22 runs (DLS) and take an unassailable lead of 2-0 in the three match T20I series.#WIvIND pic.twitter.com/ijcicFwsq3
— BCCI (@BCCI) August 4, 2019