Rishabh Pant: ఆర్సీబీ కెప్టెన్‌గా పంత్‌..? ఫుల్ క్లారిటీ ఇచ్చిన టీమిండియా వికెట్ కీపర్

| Edited By: Janardhan Veluru

Sep 27, 2024 | 5:49 PM

పంత్ ఆర్సీబీ మెనెజ్‌మెంట్‌ను తన మెనేజర్ ద్వారా సంప్రదించి ఉన్న కెప్టెన్సీ ఖాళీ స్థానాన్ని తనకు ఇవ్వాలని కోరాడని, దానికి విరాట్ నిరాకరించాడని, ఒకవేళ పంత్ వస్తే ఇండియా టీమ్‌లో రచించిన వ్యూహాలను ఆర్సీబీలో కూడా చేస్తాడని విరాట్ విముఖత చూపినట్లు ఎక్స్‌లో పలువురు కామెంట్లు చేస్తున్నారు. తాజాగా ఈ వార్తలపై రిషబ్ పంత్ ఘాటుగా స్పందించాడు. ముఖ్యంగా ఈ రూమార్‌పై అసహనం వ్యక్తం చేశాడు.

Rishabh Pant: ఆర్సీబీ కెప్టెన్‌గా పంత్‌..? ఫుల్ క్లారిటీ ఇచ్చిన టీమిండియా వికెట్ కీపర్
Rishabh Pant
Follow us on

వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఆర్సీబీ జట్టులోకి రానున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. పంత్ దిల్లీ క్యాపిటల్స్‌(DC)ని వదిలి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB)కి వస్తున్నాడని, కానీ దానికి విరాట్ కోహ్లీ ఒప్పుకోవడం లేదనే పుకార్లు వినిపిస్తున్నాయి. పంత్ ఆర్సీబీ మెనెజ్‌మెంట్‌ను తన మెనేజర్ ద్వారా సంప్రదించి ఉన్న కెప్టెన్సీ ఖాళీ స్థానాన్ని తనకు ఇవ్వాలని కోరాడని, దానికి విరాట్ నిరాకరించాడని, ఒకవేళ పంత్ వస్తే ఇండియా టీమ్‌లో రచించిన వ్యూహాలను ఆర్సీబీలో కూడా చేస్తాడని విరాట్ విముఖత చూపినట్లు ఎక్స్‌లో పలువురు కామెంట్లు చేస్తున్నారు. తాజాగా ఈ వార్తలపై రిషబ్ పంత్ ఘాటుగా స్పందించాడు. ముఖ్యంగా ఈ రూమార్‌పై అసహనం వ్యక్తం చేశాడు. ఈ వార్త ఫేక్ న్యూస్‌ అని, ఇలాంటి ఫేక్ వార్తలను ఎందుకు వ్యాప్తి చేస్తున్నారని, ఇలా చేయడం ఇది మొదటి సారి కాదని, దయ చేసి ఫేక్ న్యూస్‌ని షేర్ చేయవద్దని కోరారు.

రిషబ్ పంత్ స్పందించిన ట్వీట్:

 

నిజంగా కోహ్లీ పంత్ ఆర్సీబీలోకి వస్తానంటే వద్దన్నాడా?

పంత్ ఆర్సీబీలోకి వస్తానంటే కోహ్లీ వద్దన్నాడనే వార్త సోషల్‌మీడియాలో సంచలనంగా మారింది. వాస్తవానికి 2021 నుంచి పంత్ డీసీ కెప్టెన్‌గా ఉన్నాడు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన పంత్ 2022 డిసెంబర్ తర్వాత ఆటకు దూరమైయ్యాడు. ఇటీవలే చైన్నెలో బంగ్లాదేశ్‌తో జరిగిన ఫస్ట్ టెస్ట్‌లో సెంచరీ చేశాడు. ఈ ప్రదర్శనతో ఐసీసీ ర్యాకింగ్స్‌లో టాప్‌ 10లోకి వచ్చాడు. ప్రస్తుతం ఐసీసీ ప్రకటించిన ర్యాకింగ్స్‌లో పంత్ బెస్ట్ బాట్స్‌మెన్‌లో 6వ స్థానంలో ఉన్నాడు. అదే విధంగా బంగ్లాదేశ్ మొదటి టెస్ట్ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన యశస్వీ జైశ్వాల్ 5వ ర్యాంక్‌‌కి వచ్చాడు. భారత్ క్రికెటర్లలో యశస్వీదే బెస్ట్ స్థానం..కాగా డీసీ టీమ్ కెప్టెన్‌గా కొనసాగుతున్న పంత్‌ ఆర్సీబీలోకి వెళ్తునట్లు వస్తున్న వార్తలో నిజం లేదని పంత్ ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. భారత్ బంగ్లాదేశ్ టెస్ట్‌ సీరిస్‌లో భాగంగా మొదటి మ్యాచ్ సెంచరీ చేసి మ్యాచ్ విజయంలో భాగస్వామమైన పంత్ రెండో మ్యాచ్‌లో సెంచరీ చేస్తాడని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

2025 ఐపీఎల్ వేలం డిసెంబర్‌లో జరగనున్నట్లు తెలుస్తుంది. ఐపీఎల్ ప్లేయర్ల రిటెన్షన్‌లో భాగంగా రైట్ టు మ్యాచ్ కార్డును తీసేసి.. ఒక్కో జట్లు 5 ఆటగాళ్లను రిటెన్షన్ చేసుకొనే అవకాశాన్ని బీసీసీఐ కల్పించబోతున్నట్లు సమాచారం. ఈ విషయంపై త్వరలో అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తుంది. ఇలా ఐపీఎల్ గూర్చి రోజుకో అప్‌డేట్ వస్తుంది. ఐపీఎల్‌లో ఈ సారి మ్యాచ్‌లు పెంచాలనే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు అప్పట్లో చర్చ జరిగింది. కానీ తాజాగా బీసీసీఐ ఆటగాళ్లపై పని భారం పడకుండా ఉండేందకు గత సీజన్ల మాదిరిగానే 74 మ్యాచ్‌లు ఆడించాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. దీనిపై కూడా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.