విండీస్ ‘బాహుబలి’తో దోబూచులాట..!

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత భారీకాయుడిగా రికార్డు సృష్టించిన విండీస్ బాహుబలి రకీమ్ కార్న్‌వాల్.. కోహ్లీసేనతో జరిగే తొలి టెస్ట్‌లో అరంగేట్రం చేస్తున్నాడు. 140 కిలోల బరువు.. ఆరడుగుల పొడవైన ఇతగాడు దేశవాళీ క్రికెట్‌లో ఎన్నో అద్భుతమైన రికార్డులను సొంతం చేసుకున్నాడు. దీనితో బోర్డు క్రిస్ గేల్‌ను కాదని మరీ చోటిచ్చింది. ఇది ఇలా ఉండగా కొద్దిరోజుల క్రిందట ఇండియా-ఏతో జరిగిన వన్డే మ్యాచ్‌లో రకీమ్‌ను పేసర్ దీపక్ చాహర్ ఆటపట్టించాడు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో […]

  • Ravi Kiran
  • Publish Date - 3:34 pm, Sun, 11 August 19
విండీస్ 'బాహుబలి'తో దోబూచులాట..!

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత భారీకాయుడిగా రికార్డు సృష్టించిన విండీస్ బాహుబలి రకీమ్ కార్న్‌వాల్.. కోహ్లీసేనతో జరిగే తొలి టెస్ట్‌లో అరంగేట్రం చేస్తున్నాడు. 140 కిలోల బరువు.. ఆరడుగుల పొడవైన ఇతగాడు దేశవాళీ క్రికెట్‌లో ఎన్నో అద్భుతమైన రికార్డులను సొంతం చేసుకున్నాడు. దీనితో బోర్డు క్రిస్ గేల్‌ను కాదని మరీ చోటిచ్చింది. ఇది ఇలా ఉండగా కొద్దిరోజుల క్రిందట ఇండియా-ఏతో జరిగిన వన్డే మ్యాచ్‌లో రకీమ్‌ను పేసర్ దీపక్ చాహర్ ఆటపట్టించాడు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అయింది.

విండీస్ ఆటగాడు ఒకరు ఔటైనప్పుడు గ్రౌండ్‌లోకి అడుగుపెట్టిన రకీమ్‌. ఆ సమయంలో ఫీల్డింగ్ చేస్తున్న దీపక్ చాహర్ అతడి నడకను అనుసరిస్తూ ఎదురుగా వెళ్ళాడు. దాదాపు ఢీకొనే వరుకు వెళ్లినా.. పక్కకి వెళ్లిపోయాడు. అయితే కార్న్‌‌‌‌‌వాల్ మాత్రం దానికి ఎటువంటి ప్రతిస్పందన ఇవ్వకపోవడం గమనార్హం. కాగా ఆస్ట్రేలియా క్రికెటర్ వార్విక్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ తర్వాత భారీకాయుడిగా రకీమ్ రికార్డుల్లోకి ఎక్కాడు.