Team India Player: పుట్టుకతోనే అతను నాయకుడు.. రహానేపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్..

Team India Player: టీమిండియా క్రికెటర్ అజింక్య రహానేపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రహానే పుట్టుకతోనే..

Team India Player: పుట్టుకతోనే అతను నాయకుడు.. రహానేపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్..

Edited By: Ram Naramaneni

Updated on: Jan 04, 2021 | 8:17 AM

Team India Player: టీమిండియా క్రికెటర్ అజింక్య రహానేపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రహానే పుట్టుకతోనే నాయకుడు అంటూ కితాబిచ్చాడు. భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండవ టెస్ట్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. అజింక్య రహానే కెప్టెన్సీలో జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో రహానే కెప్టెన్సీపై ఇయాన్ చాపెల్ స్పందించాడు. ‘క్రికెట్ టీమ్‌కు లీడ్ చేయడానికే జన్మించాడు’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘రహానే కనీస పొరపాటు లేకుండా కెప్టెన్సీ బాధ్యతలను చక్కగా నిర్వర్తించడంలో ఏమాత్రం సందేహ పడాల్సిన అవసరం  లేదు. అతను చాలా ధైర్యవంతుడు, తెలివైన వాడు. అన్ని పరిస్థితుల్లోనూ చాలా కూల్‌గా ఉంటాడు.’ అని ఇయాన్ చాపెల్ చెప్పుకొచ్చాడు. కాగా, మెల్‌బోర్న్ క్రికెట్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో టెస్ట్ మ్యా్చ్‌లో టీమిండియా ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే.

 

Also read:

రైతుల కష్టాలను పట్టించుకోరా ? మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఫైర్, ఇది మొండి సర్కార్ అని వ్యాఖ్య

మా రాష్ట్రాన్ని బీజేపీ నేతలు టార్గెట్ చేస్తున్నారు, కానీ వారి ఆటలు సాగవు, పంజాబ్ సీఎం అమరేందర్ సింగ్