ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపిన రైనా
ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు మాజీ క్రికెటర్ సురేష్ రైనా. ఈ నెల 15న భారత క్రికెట్ అభిమానులకు మహేంద్ర సింగ్ ధోని, సురేష్ రైనాలు పెద్ద షాక్ ఇచ్చారు. ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి తాము తప్పుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా వీరు తెలిపారు. దీంతో ధోనికి నిన్న ప్రధాని మోదీ...
ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు మాజీ క్రికెటర్ సురేష్ రైనా. ఈ నెల 15న భారత క్రికెట్ అభిమానులకు మహేంద్ర సింగ్ ధోని, సురేష్ రైనాలు పెద్ద షాక్ ఇచ్చారు. ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి తాము తప్పుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా వీరు తెలిపారు. దీంతో ధోనికి నిన్న ప్రధాని మోదీ భావోద్వేగ సందేశాన్ని పోస్ట్ చేశారు. ఇక తాజాగా ప్రధాని సురేష్ రైనాకు కూడా లేఖ రాసారు.
”ఆ లేఖలో.. రైనా ఈ ఆగష్టు 15న కఠినమైన నిర్ణయం తీసుకున్నావు. దానిని నేను రిటైర్మెంట్ అనే పదంతో పిలవలేను. నువ్వు ఇంకా ఆడుతావని నేను భావిస్తున్నా. ఏది ఏమైనా నీ సెకండ్ ఇన్నింగ్స్ బాగా సాగాలని కోరుకుంటున్నా. 2011 ప్రపంచ కప్‌లో బాగా రాణించావు. సెమిస్‌లో ఆసీస్‌పైన నీ ఇన్నింగ్స్‌ను ఎవరు మర్చిపోరు. ఆ రోజు నువ్వు ఆడిన ఇన్నింగ్స్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. ఈ మ్యాచ్‌ను నేను మొతేరా స్టేడియంలో చూశాను. ఇకపై గ్రేసియా, రియోతో ఎక్కువ సమయం గడపాలని ఆశిస్తున్నాను. భారత జట్టు అగ్రస్థానంలో ఉండటం కోసం నువ్వు చేసిన దానికి ధన్యవాదాలు” అంటూ లేఖలో మోదీ పేర్కొన్నారు. ప్రధాని లేఖపై మాజీ క్రికెటర్ సురేష్ రైనా స్పందించాడు.” మేము ఆడుతున్నప్పుడు, దేశం కోసం మా రక్తం, చెమటను చిందిస్తాము. ఈ దేశ ప్రజలు, దేశ ప్రధాని మంత్రి చేత ప్రేమించబడటం కంటే మంచి ప్రశంసలు లేవు. మీ ప్రశంసలకు, శుభాకాంక్షలకు ధన్యవాదాలు! జైహింద్!” అని రైనా ట్వీట్ చేశాడు.
Read More:
ప్రభాస్ ‘ఆది పురుష్’ గ్రాఫిక్స్ కోసం అంత ఖర్చా?