ఓ ఇంటివాడు కాబోతున్న టీమిండియా క్రికెటర్ విజయ్ శంకర్
భారత క్రికెట్ టీమ్ ప్లేయర్ విజయ్ శంకర్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. వైశాలి విశ్వేశ్వరన్‌తో ఇతడి గురువారం నిశ్చితార్థం జరిగింది.
భారత క్రికెట్ టీమ్ ప్లేయర్ విజయ్ శంకర్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. వైశాలి విశ్వేశ్వరన్‌తో గురువారం ఇతడి నిశ్చితార్థం జరిగింది. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు శంకర్. దీంతో తోటి సహచర ఆటగాళ్లతో పాటు నెటిజన్స్ ఈ కపుల్‌కి విషెస్ చెబుతున్నారు.
విజయ్ శంకర్ భారత్ తరఫున 12 వన్డేలు, 9 టీ20ల ఆడాడు. గతేడాది జరిగిన వరల్డ్‌కప్‌లో అనూహ్యంగా చోటు దక్కించుకున్నాడు. కానీ సరైన ప్రదర్శన చేయలేక విమర్శలు మూటగట్టుకున్నాడు. ప్రస్తుతం శంకర్ ఐపీఎల్ 13వ సీజన్ కోసం రెడీ అవుతున్నాడు. దుబాయి వేదికగా జరగబోతున్న ఈ లీగ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున ఆడబోతున్నాడు.
Also Read:
వాహనదారులకు బ్యాడ్ న్యూస్ : మళ్లీ పెరిగిన పెట్రోల్ ధర !