‘అప్పుడే తొలిసారిగా ధోని కంటతడి పెట్టాడు’..

భారత మాజీ కెప్టెన్ మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోనితో తనకున్న మధుర స్మృతులను బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ గుర్తు చేసుకున్నాడు. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆ జ్ఞాపకాలను పంచుకున్నాడు.

'అప్పుడే తొలిసారిగా ధోని కంటతడి పెట్టాడు'..
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 21, 2020 | 12:56 PM

Dhoni Test Retirement: భారత మాజీ కెప్టెన్ మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోనితో తనకున్న మధుర స్మృతులను బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ గుర్తు చేసుకున్నాడు. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆ జ్ఞాపకాలను పంచుకున్నాడు. టెస్టులకు వీడ్కోలు పలికిన రోజు ధోని రాత్రంతా ఇండియా జెర్సీ వేసుకునే ఉన్నాడు. అంతేకాకుండా బాధతో కంటతడి కూడా పెట్టుకున్నాడు.

”2014లో ధోని టెస్టులకు రిటైర్మెంట్ ఇచ్చిన రోజు ఇంకా గుర్తుంది. అప్పుడు మెల్‌బోర్న్‌ టెస్టులో జట్టును గెలిపించేందుకు నేను, ధోని చాలా కష్టపడ్డాం. కానీ చివరికి ఓటమి పాలయ్యాం. అప్పుడే ధోని స్టంప్స్ వెనుక నుంచి ఇక నేను ముగిస్తున్నా అని అన్నాడు. ఆ రోజు సాయంత్రం నేను, రైనా, ఇషాంత్ కలిసి ధోని రూమ్‌కి వెళ్ళాం. అక్కడ మహీ ఇండియా జెర్సీలో కూర్చుని కంటతడి పెట్టుకున్నాడు” అని అశ్విన్ పేర్కొన్నాడు. కాగా, తాను అత్యున్నత స్థాయి బౌలర్‌గా ఎదగడానికి ధోనినే కారణమని అశ్విన్ కొనియాడాడు.

Also Read:

కలియుగ కర్ణుడికి ఒక్క రోజే 31 వేల మెసేజ్‌లు..

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ స్కూళ్లకు ఇంటర్నెట్..