Paris 2024 Paralympics: పారా ఒలంపిక్స్‌లో భారత ఆశాకిరణం.. పతకంపై ఆశలను కాళ్లతో తీసుకుని వెళ్తోన్న శీతల్ దేవి..

|

Aug 26, 2024 | 6:25 PM

17 ఏళ్ల శీతల్‌కు పుట్టినప్పటి నుంచి రెండు చేతులు లేవు. పుట్టుకతోనే ఫోకోమెలియా అనే వ్యాధితో బాధపడుతోంది. అయితే ఆ యువతి తన జీవితంపై ఆశను ఎప్పుడూ వదులుకోలేదు. చేతులుగా తన కాళ్లను మార్చుకుంది. పాదాలతో మాత్రమే విలువిద్యను అభ్యసించింది. శీతల్ దేవి ఒక కుర్చీపై కూర్చొని, తన కుడి పాదంతో విల్లును ఎక్కుపెట్టి ఆమె కుడి భుజం నుండి తీగను లాగి, దవడ బలంతో బాణాన్ని వదులుతుంది. శ్రీతల్ బాణం సంధించే విధానం ఒక కళలాంటిందే.. అది చూసి ఎవరైనా సరే ఆశ్చర్యపోవాల్సిందే..

Paris 2024 Paralympics: పారా ఒలంపిక్స్‌లో భారత ఆశాకిరణం.. పతకంపై ఆశలను కాళ్లతో తీసుకుని వెళ్తోన్న శీతల్ దేవి..
Archer Sheetal Devi
Follow us on

పారిస్ లో పారాలింపిక్స్ 2024 ఆగస్టు 28 నుండి ప్రారంభం కానున్నాయి. ఈ క్రీడా పోటీలు సెప్టెంబర్ 8 వరకు జరుగుతాయి. ప్రపంచవ్యాప్తంగా 4,400 మంది అథ్లెట్లు 22 క్రీడల్లో పాల్గొననున్నారు. అదే సమయంలో భారత్ నుంచి 84 మంది పారా అథ్లెట్లు ఈసారి పారాలింపిక్స్‌లో పాల్గొననున్నారు. భారతదేశ పారాలింపిక్ చరిత్రలో ఇదే అతిపెద్ద బృందం. ఇందులో ఆర్చర్ శీతల్ దేవి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఎందుకంటే ఈ పారాలింపిక్స్‌లో పతకం సాధింస్తుంది అనే ఆశ పెట్టుకున్న క్రీడాకారుల్లో ఆమె ఒకరు.

భారతదేశపు గొప్ప ఆశాకిరణం శీతల్ దేవి ఎవరు?

జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్ అనే చిన్న గ్రామానికి చెందిన యువతి శీతల్ దేవి. అయితే పారాలింపిక్స్‌లో దేశానికి పతకం సాధించిపెట్టే బాధ్యతను చేతుల్లోకి తీసుకోలేదు ఆమె తన కాళ్లాకు అప్పగించింది. శీతల్ తండ్రి ఒక రైతు, తల్లి ఇంట్లో మేకలను చూసుకుంటుంది. 17 ఏళ్ల శీతల్‌కు పుట్టినప్పటి నుంచి రెండు చేతులు లేవు. పుట్టుకతోనే ఫోకోమెలియా అనే వ్యాధితో బాధపడుతోంది. అయితే ఆ యువతి తన జీవితంపై ఆశను ఎప్పుడూ వదులుకోలేదు. చేతులుగా తన కాళ్లను మార్చుకుంది. పాదాలతో మాత్రమే విలువిద్యను అభ్యసించింది. శీతల్ దేవి ఒక కుర్చీపై కూర్చొని, తన కుడి పాదంతో విల్లును ఎక్కుపెట్టి ఆమె కుడి భుజం నుండి తీగను లాగి, దవడ బలంతో బాణాన్ని వదులుతుంది. శ్రీతల్ బాణం సంధించే విధానం ఒక కళలాంటిందే.. అది చూసి ఎవరైనా సరే ఆశ్చర్యపోవాల్సిందే..

ఇవి కూడా చదవండి

శీతల్ దేవి చేతులు లేకుండా పోటీ పడుతున్న ప్రపంచంలోనే మొదటి, ఏకైక చురుకైన మహిళా ఆర్చర్ కూడా. 2023లో ఆమె పారా-ఆర్చరీ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకాన్ని గెలుచుకుంది. ఇది శీతల్ పారిస్ గేమ్స్‌లో పాల్గొనేందుకు అర్హత సాధించడంలో సహాయపడింది. అయితే పారిస్‌లో శీతల్ ప్రపంచ మూడో ర్యాంకర్ జాన్ కార్లా గోగెల్ , ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్‌షిప్ విజేత ఓజ్నూర్ క్యూర్‌తో సహా ఇతర క్రీడాకారుల నుంచి కఠినమైన పోటీని ఎదుర్కోవలసి ఉంటుంది.

ఆసియా పారా గేమ్స్ 2023లో చరిత్ర సృష్టించిన శీతల్

ఆసియా పారా గేమ్స్ 2023లో శీతల్ దేవి ఒక చారిత్రాత్మక ప్రదర్శన కనబరిచింది. చైనాలోని హాంగ్‌జౌలో జరిగిన ఆసియా పారా గేమ్స్‌లో రెండు బంగారు పతకాలు సహా మూడు పతకాలు సాధించి చరిత్ర సృష్టించింది. అదే ఎడిషన్‌లో రెండు స్వర్ణాలు సాధించిన తొలి భారతీయ మహిళగా కూడా రికార్డు సృష్టించింది. ఈ ఘనత సాధించిన శీతల్ ను అర్జున అవార్డుతో సత్కరించారు.

శీతల్ కెరీర్ ఎలా మొదలైందంటే

ఒక చిన్న గ్రామంలో రైతు కుటుంబంలో జన్మించిన దేవి 15 సంవత్సరాల వరకు విల్లు, బాణం చూడలేదు. 2022లో పరిచయస్తుడి సూచన మేరకు తన ఇంటికి దాదాపు 200 కిమీ (124 మైళ్ళు) దూరంలో ఉన్న జమ్మూలోని కత్రాలోని శ్రీ మాతా వైష్ణో దేవి ష్రైన్ బోర్డ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ని సందర్శించినప్పుడు శీతల్ జీవితం మలుపు తిరిగింది. అక్కడ శీతల్ అభిలాషా చౌదరి, ఆమె రెండవ కోచ్ కుల్దీప్ వెద్వాన్‌తో పరిచయం ఏర్పడింది. శ్రీతల్ ప్రతిభను గుర్తించి విలువిద్యలో శిక్షణ ఇచ్చారు. విలువిద్య ప్రపంచానికి పరిచయం చేశాడు. కత్రా నగరంలో శిక్షణా శిబిరానికి చేరుకున్న శీతల్ ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..