Paralympics: పారాలింపిక్స్‌లో భారత్‌కు పతకాల పంట.. డిస్కస్ త్రోలో సిల్వర్ మెడల్..

| Edited By: Anil kumar poka

Aug 30, 2021 | 8:56 PM

Paralympics: టోక్యో పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్స్ అదరగొడుతున్నారు. అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తూ దేశానికి పతకాల పంట పండిస్తున్నారు...

Paralympics: పారాలింపిక్స్‌లో భారత్‌కు పతకాల పంట.. డిస్కస్ త్రోలో సిల్వర్ మెడల్..
Discus Throw
Follow us on

టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్స్ అదరగొడుతున్నారు. అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తూ దేశానికి పతకాల పంట పండిస్తున్నారు. ఒక్క రోజులో ఏకంగా నాలుగు పతకాలను సాధించారు. వెరిసి భారత్ ఖాతాలో ఇప్పటివారు ఐదు పతకాలు చేరాయి. అందులో ఒక స్వర్ణం, మూడు రజతాలు, ఒక కాంస్య పతకం ఉంది. డిస్కస్ త్రోలో సిల్వర్ మెడల్ సాధించిన యోగేశ్.. పతకం గెలిచిన తర్వాత కన్నీటి పర్యంతం అయ్యాడు. జాతీయ జెండాను చేతబూని మైదానంలో కాసేపు అలాగే ఉండిపోయాడు. తన విజయానికి సహకారం అందించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపాడు.

ఇదిలా ఉంటే పారాలింపిక్స్ ఆరో రోజు డిస్కస్ త్రో పోటీల్లో భారత్ ఖాతాలోకి మరో పతకం చేరింది. పురుషుల ఎఫ్-56 విభాగంలో యోగేశ్ కధూనియా సిల్వర్ మెడల్ సాధించాడు. ఆరో దఫాలో డిస్క్‌ను 44.38 మీటర్లు విసిరి రెండో స్థానంలో నిలిచాడు. కాగా, ఢిల్లీకి చెందిన యోగేశ్‌ గతంలోనూ అద్భుతాలు సృష్టించాడు. 2019లో దుబాయ్‌లో జరిగిన ప్రపంచ పారా అథ్లెట్స్ ఛాంపియన్‌షిప్స్‌లో డిస్క్‌ను 42. 51 మీటర్లు విసిరి కాంస్యం దక్కించుకోగా.. 2018లో తొలి అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని ఎఫ్‌36 విభాగంలో ప్రపంచ రికార్డు సాధించడం గమనార్హం.

ఈ సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యోగేశ్ గెలుపును ట్విట్టర్ వేదికగా అభినందించారు.  ”రజత పతకాన్ని తీసుకురావడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. యోగేశ్ విజయం వర్ధమాన అథ్లెట్స్‌ను ప్రోత్సహిస్తుంది. యోగేశ్ భవిష్యత్తులో కూడా ఇలా విజయాలు నమోదు చేయాలని కోరుకుంటున్నా” అని మోడీ ట్వీట్ చేశారు.

Read Also: కివి పండ్లను వీరు అస్సలు తినకూడదు.. తింటే ఎలా పరిస్థితులు ఎదురవుతాయంటే..

RGV: 40 ఏళ్ల క్రితం ఇలాంటి అమ్మాయి కనిపించి ఉంటే.. నేను ఇప్పుడు ఇలా ఉండేవాడిని కాదు. ఆర్‌జీవీ వ్యాఖ్యలు.

ఈ ఫోటోలో సింహం ఎక్కడుందో కనిపెట్టండి.! కళ్లకు పని చెప్పండి.. గుర్తించండి!

500 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్.. 20 ఓవర్ల మ్యాచ్.. కేవలం 39 బంతుల్లోనే ఫలితం.. తుఫాన్ సృష్టించిన ఓపెనర్ ఎవరంటే?