భారత్‌తోపాటు ఆసియాలోని అథ్లెట్లందరికీ శుభవార్త అందింది. 2022 ఆసియా క్రీడల(Asian Games 2022) నిర్వహణపై క్లారిటీ వచ్చింది. కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది జరగాల్సిన క్రీడలు వాయిదా పడ్డాయి. కాగా, ఈ గేమ్స్‌ను వచ్చే ఏడాది అంటే 2023లో నిర్వహించేందుకు ప్లాన్ సిద్ధమైంది. 19వ ఆసియా క్రీడలు వచ్చే ఏడాది సెప్టెంబరు 23 నుంచి ప్రారంభమవుతాయని ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ మంగళవారం జూలై 19న ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ గేమ్స్ అక్టోబర్ 8 వరకు జరుగుతాయని పేర్కొంది. కాగా, క్రీడల వేదికలో ఎలాంటి మార్పు లేదని, చైనాలోని హాంగ్‌జౌ(Hangzhou)లో జరగనున్నట్లు ప్రకటించింది.
ఈ మేరకు OCA మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. “ఆసియన్ ఒలింపిక్ కౌన్సిల్ 19వ ఆసియా క్రీడల కోసం కొత్త తేదీలను ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. హాంగ్‌జౌలో 23 సెప్టెంబర్ నుంచి 8 అక్టోబర్ 2023 వరకు ఆసియా గేమ్స్ జరుగుతాయి. 19వ సీజన్ వాస్తవానికి హాంగ్‌జౌలో 10 సెప్టెంబర్ నుంచి 25 సెప్టెంబర్ 2022 వరకు జరగాల్సి ఉంది. అయితే COVID-19 మహమ్మారి కారణంగా, OCA ఎగ్జిక్యూటివ్ బోర్డ్ 6 మే 2022న గేమ్‌లను వాయిదా వేయాలని నిర్ణయించింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..