Roger Federer: స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌కు చేదు అనుభం.. క్వార్టర్​ఫైనల్లోనే ఓటమి..

|

Mar 12, 2021 | 12:02 PM

Roger Federer Failed: స్విట్జర్లాండ్​ టెన్నిస్ దిగ్గజం... మాజీ నెంబర్ రోజర్​ ఫెదరర్‌..​ ఖతార్​ ఓపెన్‌లో చేదు అనుభం ఎదురైంది.  ఏడాది తర్వాత కోర్టులోకి ఎంట్రీ..

Roger Federer: స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌కు చేదు అనుభం.. క్వార్టర్​ఫైనల్లోనే ఓటమి..
Roger Federer Withdraws
Follow us on

Roger Federer Withdraws: స్విట్జర్లాండ్​ టెన్నిస్ దిగ్గజం… మాజీ నెంబర్ రోజర్​ ఫెదరర్‌..​ ఖతార్​ ఓపెన్‌లో చేదు అనుభం ఎదురైంది.  ఏడాది తర్వాత కోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన స్విస్ ఆటగాడు.. క్వార్టర్​ఫైనల్లోనే ఓటమిని చవి చూశాడు. జార్జియా ప్లేయర్ బసిల్​ష్విలి చేతిలో ఓడిపోయాడు.

ఏడాది గ్యాప్ తర్వాత కోట్టులోకి అడుగు పెట్టిన స్విస్​ మాస్టర్​ రోజర్​ ఫెదరర్ ఒక్క విజయంతో సరిపెట్టుకున్నాడు. మోకాలి గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఫెదరర్ కు గత 13
నెలల్లో తర్వాత తొలి మ్యాచ్ గెలిచినప్పటికీ.. క్వార్టర్​ఫైనల్ నుంచే వెనుదిరిగాడు.

క్వార్టర్​ఫైనల్ నుంచే…

ఖతార్​ ఓపెన్లో ఫెదరర్ క్వార్టర్​ఫైనల్లోనే నిష్క్రమించాడు. రెండో సీడ్​ ఫెదరర్ 6-3, 1-6, 5-7తో బసిల్​ష్విలి (జార్జియా) చేతిలో ఓడిపోయాడు.  తొలి సెట్​ గెలిచి జోరు మీద కనిపించిన ఫెదరర్ .. రెండో సెట్​ను దారుణంగా ఓడిపోయాడు. పేలవమైన ప్రదర్శనతో కేవలం 1-6తో మ్యాచ్‌ను జారవిడుచుకున్నాడు. మూడో సెట్లో పోరాడినా పదకొండో గేమ్​లో సర్వీస్​ చేజార్చుకుని ఓటమి చవిచూశాడు. ఈ టోర్నీలో ఫెదరర్ ఒకే ఒక్క విజయాన్ని అందుకున్నాడు. తొలి రౌండ్లో అతడికి బై లభించడంతో విజయం లభించింది. తొలి మ్యాచ్‌లో 7-6,3-6,7-5తో డాన్ ఎవాన్స్ (బ్రిటన్)పై విజయంను అందుకున్న సంగతి తెలిసిందే.

దుబాయ్​ ఏటీపీ టోర్నీ తప్పుకుంటున్నా…

దుబాయ్​ ఏటీపీ టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లుగా రోజర్ ఫెదరర్ ప్రకటించాడు. ఖతార్​ ఓపెన్​లో క్వార్టర్స్​లోనే ఓటమి పాలైన ఈ స్విస్​ దిగ్గజం.. మళ్లీ శిక్షణకు వెళ్లడానికి నిర్ణయించుకున్నాడు.

ఖతార్ ఓపెన్​లో క్వార్టర్​ఫైనల్లో ఓటమి పాలైన ఫెదరర్​.. ఈ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. మళ్లీ శిక్షణ​కు వెళ్లడం మంచిదని పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి

Gunathilaka Out or not?: లంక, విండీస్ వన్డేలో వివాదం.. బంతిని కాళ్లతో తన్నాడని బ్యాట్స్‌మెన్ గుణతిలక ఔట్..!

India vs England: టీ 20 సిరీస్ ఎప్పుడు, ఎక్కడ, ఎన్ని గంటలకో తెలుసా..! అయితే లైవ్ ఇలా చూడండి..!

Vijay Hazare Trophy: పాకిస్తాన్‌పై కోహ్లీ చేసిన రికార్డుకు బ్రేక్ పడింది.. పరుగుల వరద పారించిన షా..