PV Sindhu: డెన్మార్క్ ఓపెన్ టోర్నీ నుంచి సింధు ఔట్.. క్వార్టర్ ఫైనల్‌లో ఆన్ సెయంగ్ చేతిలో ఓటమి
PV Sindhu: డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 1000 టోర్నీలో ప్రపంచ ఛాంపియన్ తెలుగు తేజం పీవీ సింధు పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన..
PV Sindhu: డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 1000 టోర్నీలో ప్రపంచ ఛాంపియన్ తెలుగు తేజం పీవీ సింధు పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సింధు ఓటమిపాలైంది. దక్షిణ కొరియా క్రీడాకారిణి ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ ఆన్ సెయంగ్ తో క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ ఏడో ర్యాంకర్ సింధు తలపడింది. ఈ మ్యాచ్ 36 నిమిషాల్లో ముగిసింది. 11–21, 12–21తో ఆన్ సెయంగ్ చేతిలో సింధు ఓటమి పాలైంది. ఆగస్ట్‌లో టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న తర్వాత తన మొదటి అంతర్జాతీయ టోర్నమెంట్ ఆడిన సింధుకు నిరాశ ఎదురైంది.
తనకంటే ఒక ర్యాంక్ కింద ఉన్న ఆన్ సెయంగ్‌తో జరిగిన పోరులో సింధు తన ప్రతిభకు తగిన పోరాటం ప్రదర్శించలేదు. మ్యాచ్ మొదలు పెట్టినప్పుడు సింధు 2-1తో ఆధిక్యంలోకి వెళ్ళింది.. ఆనంతరం ఆన్ సెయంగ్ పుంజుకుని వరసగా ఐదు పాయింట్లు గెలిచింది. 6–2తో ముందంజ వేసింది. అనంతరం ఆన్ సెయంగ్ వెనుదిరిగి చూడలేదు వరసగా పాయింట్స్ తో సింధు పై పైచేయి సాధించింది. మొదటి గేమ్ ను సొంతం చేసుకుంది. ఇక రెండో సెట్ లో కూడా సింధు పై అదే జోరు కొనసాగించిన ఆన్ సెయంగ్ సింధు కోలుకోకుండా చేసింది. వరస సెట్స్ తో విజయం సొంతం చేసుకుని సెమీ ఫైనల్ లో అడుగు పెట్టింది. సింధు ఒక్కసారి కూడా ప్రత్యర్ధి స్కోర్ ను సమయం చేయలేదు. గతంలో కూడా ఆన్ సెయంగ్ తో తలపడిన సింధు ఓటమి పాలయ్యింది.
Also Read: ఏపీ ముఖ్యమంత్రి జగన్ నేటి విశాఖ జిల్లా పర్యటన రద్దు.. ఈ మేరకు ప్రకటన రిలీజ్ చేసిన సీఎంవో..