PKL 2021: నాలుగేళ్లుగా వరుస వైఫల్యాలు.. ప్లేఆఫ్‌ చేరకుండానే లీగ్‌ నుంచి నిష్క్రమణ.. తొలి పోరుకు సరికొత్తగా సిద్ధం..!

|

Dec 22, 2021 | 10:02 AM

Pro Kabaddi League Season 8: ప్రొ-కబడ్డీ లీగ్ నాల్గవ సీజన్ వరకు, 8 జట్లు పాల్గొనేవి. అయితే ఐదవ సీజన్‌లో 4 ఇతర జట్లు చేరాయి. ప్రస్తుతం ఈ టోర్నీలో మొత్తం 12 జట్లు టైటిల్ కోసం పోటీపడుతున్నాయి.

PKL 2021: నాలుగేళ్లుగా వరుస వైఫల్యాలు.. ప్లేఆఫ్‌ చేరకుండానే లీగ్‌ నుంచి నిష్క్రమణ.. తొలి పోరుకు సరికొత్తగా సిద్ధం..!
Pro Kabaddi League 2021 Tamil Thalaivas
Follow us on

Tamil Thalaivas Stats: ప్రో-కబడ్డీ లీగ్ ఎనిమిదో సీజన్ డిసెంబర్ 22 నుంచి ప్రారంభం కానుంది. కరోనా కారణంగా గతేడాది టోర్నీ జరగలేదు. ఈసారి ఉత్కంఠభరితంగా సాగుతున్న ఈ కబడ్డీ లీగ్‌ను పూర్తి సన్నద్ధతతో నిర్వహిస్తున్నారు. బుధవారం నుంచి అభిమానులు కబడ్డీ మ్యాచ్‌లను వీక్షించనున్నారు. ఈ రోజు మనం తమిళ్ తలైవాస్ టీమ్ గురించి తెలుసుకుందాం. ఈ జట్టు 2017లో ఈ లీగ్‌లోకి ప్రవేశించింది. అప్పటి నుంచి, జట్టు మూడు సీజన్లు ఆడింది. కానీ, ఒక్కసారి కూడా ప్లే ఆఫ్స్‌కు చేరుకోలేకపోయింది. అయితే ఈ సారి కొత్త ఆశలతో మైదానంలోకి దిగిన తమిళ్ తలైవాస్ టైటిల్‌ను చేజిక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. జట్టు పాత రికార్డులు, జట్టు గురించి తెలుసుకుందాం.

ఇప్పటివరకు జట్టు ప్రదర్శన ఎలా ఉందంటే..
1. 2017లో తమిళ్ తలైవాస్ ప్రో కబడ్డీ లీగ్‌లోకి ప్రవేశించింది. జట్టు రాకతో టోర్నీలో ఉత్కంఠ పెరుగుతుందని అభిమానులు భావించినా.. తలైవా ఆటగాళ్లు మాత్రం రాణించలేకపోయారు. ఐదవ సీజన్‌లో, జట్టు మొత్తం 22 మ్యాచ్‌లు ఆడింది. అందులో కేవలం 6 మ్యాచ్‌లు మాత్రమే గెలవగలిగింది. ఆ జట్టు 14 మ్యాచ్‌ల్లో ఓడిపోగా, రెండు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి.

2. ప్రో-కబడ్డీ లీగ్ ఆరో సీజన్‌లో తమిళ్ తలైవాస్ రాణించకపోవడంతో ఆ జట్టు కష్టాల్లో పడింది.ఈ సీజన్‌లో ఆ జట్టు 22 మ్యాచ్‌లు ఆడింది. అందులో కేవలం 5 మ్యాచ్‌లు మాత్రమే గెలుపొందింది. ఆ జట్టు 13 మ్యాచ్‌ల్లో ఓడిపోగా, 4 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి.

3. ఇక ఏడో సీజన్‌లో జట్టు ప్రదర్శన అత్యంత నిరాశపరిచింది. గత సీజన్‌లో తమిళ్ తలైవాస్ 22 మ్యాచ్‌లు ఆడగా, అందులో కేవలం 4 మ్యాచ్‌లు మాత్రమే గెలవగలిగారు. ఆ జట్టు 15 మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూడగా, మూడు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. గత సీజన్‌లో ఆ జట్టు అత్యంత వెనుకబడి పాయింట్ల పట్టికలో 12వ స్థానంలో నిలిచింది.

సీజన్ 8 కోసం తమిళ్ తలైవాస్ జట్టు..
రైడర్స్: పర్పంజన్, మంజీత్, ఎంఎస్ అతుల్, భవానీ రాజ్‌పుత్

డిఫెండర్లు: సాగర్, హిమాన్షు, ఎం అభిషేక్, మహ్మద్ తుహిన్, సుర్జిత్ సింగ్, మహ్మద్ తరదీ, సాహిల్

ఆల్‌రౌండర్: అన్వర్ సాహిబ్, సౌరభ్ తానాజీ, సాగర్ కృష్ణ, సంతపన్‌సెల్వం

Also Read:

Watch Video: 200 టెస్ట్ మ్యాచ్‌ల కెరీర్.. ఒకే ఒక్కసారి ఇలా ఔట్.. ఆ భారత బ్యాట్స్‌మెన్ ఎవరో తెలుసా?

Pro Kabaddi League: కబడ్డీ కూతకు వేళాయే.. సరికొత్తగా రీఎంట్రీ.. వారికి మాత్రం నోఛాన్స్.. తొలి పోరులో తలపడేది ఎవరంటే?