PKL 2024 Final: పీకేఎల్ 10వ సీజన్ విజేతగా పల్టాన్.. తొలిసారి ట్రోఫీ సొంతం.. ఫైనల్లో హర్యానాపై గెలుపు..

Haryana Steelers vs Puneri Paltan: హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలోని GMC బాలయోగి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన ప్రో కబడ్డీ లీగ్ 10వ సీజన్ ఫైనల్ మ్యాచ్‌లో పుణెరి పల్టన్ హర్యానా స్టీలర్స్‌ను ఓడించి తొలిసారిగా ప్రో కబడ్డీ లీగ్ ట్రోఫీని ఎగరేసుకుపోయింది. ఈ లీగ్‌లో పుణెరి పల్టాన్ టోర్నీ ఆద్యంతం మంచి ప్రదర్శన చేసింది. తదనుగుణంగా లీగ్ దశలో మొత్తం 96 పాయింట్లు సాధించిన పల్టాన్ జట్టు.. ఆఖరి మ్యాచ్ తొలి అర్ధభాగంలోనూ అదే ఆటను కొనసాగించింది.

PKL 2024 Final: పీకేఎల్ 10వ సీజన్ విజేతగా పల్టాన్.. తొలిసారి ట్రోఫీ సొంతం.. ఫైనల్లో హర్యానాపై గెలుపు..
Haryana Steelers Vs Puneri
Follow us
Venkata Chari

|

Updated on: Mar 02, 2024 | 8:28 AM

PKL 2024 Final: హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలోని జిఎంసి బాలయోగి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన ప్రో కబడ్డీ లీగ్ 10వ సీజన్ ఫైనల్(Pro Kabaddi League) మ్యాచ్‌లో పుణెరి పల్టాన్ జట్టు హర్యానా స్టీలర్స్ (Haryana Steelers vs Puneri Paltan) జట్టును ఓడించి తొలిసారి ప్రొ కబడ్డీ లీగ్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో పుణెరి పల్టన్ 28-25తో హర్యానా స్టీలర్స్‌పై విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్‌లో పుణెరి పల్టన్‌ తరపున అద్భుత ప్రదర్శన చేసిన పంకజ్‌ మోహితే, మోహిత్‌ గోయెట్‌లు జట్టు విజయాన్ని కైవసం చేసుకున్నారు.

ఆరంభం నుంచి పల్టాన్‌ ఆధిపత్యం..

ఈ లీగ్‌లో పుణెరి పల్టాన్ టోర్నీ ఆద్యంతం మంచి ప్రదర్శన చేసింది. తదనుగుణంగా లీగ్ దశలో మొత్తం 96 పాయింట్లు సాధించిన పల్టాన్ జట్టు.. ఆఖరి మ్యాచ్ తొలి అర్ధభాగంలోనూ అదే ఆటను కొనసాగించింది. తద్వారా 13-10 ఆధిక్యంతో తొలి అర్ధభాగం ముగిసింది. రెండో అర్ధభాగంలో పుణెరి తరపున పంకజ్ మోహిత్ మరింత దూకుడుగా ఆడి జట్టుకు నాలుగు ముఖ్యమైన పాయింట్లను అందించాడు.

ఇవి కూడా చదవండి

సెకండాఫ్‌లో ఓ మోస్తరు పోరాటం..

తొలి అర్ధభాగంలో 3 పాయింట్లతో వెనుకబడిన హర్యానా జట్టు ద్వితీయార్థంలో పుంజుకునే ప్రయత్నం చేసింది. కానీ, పుణెరి జట్టు ఇందుకు అనుమతించలేదు. ద్వితీయార్థంలో ఇరు జట్లు చెరో 15 పాయింట్లు సాధించి మ్యాచ్‌ను ఉత్కంఠభరితంగా మార్చాయి. కానీ, తొలి అర్ధభాగంలో పుణెరి పల్టాన్ సాధించిన ఆధిక్యం జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు 43 రైడ్‌లు చేశాయి. ఇందులో హర్యానా స్టీలర్స్ 15 విజయవంతమైన రైడ్‌లు చేయగా, పుణెరి పల్టాన్ 12 విజయవంతమైన రైడ్‌లు చేసింది. చివరగా, లీగ్ అంతటా అత్యుత్తమ డిఫెండర్‌గా నిలిచిన ఇరాన్‌కు చెందిన మహ్మద్రెజా ఈ సీజన్‌లో ఉత్తమ డిఫెండర్ అవార్డును కూడా అందుకున్నాడు.

రెండు జట్లు..

పుణెరి పల్టాన్ జట్టు: అభినేష్ నడరాజన్, గౌరవ్ ఖత్రి, సంకేత్ సావంత్, పంకజ్ మోహితే, అస్లాం ఇనామాదర్, మోహిత్ గోయత్, ఆకాశ్ షిండే, బాదల్ సింగ్, ఆదిత్య షిండే, మహ్మద్రెజా షాద్లుయ్ చెయెన్నె, వాహిద్ రెజీమర్, అహ్మద్ ముస్తఫా ఇనామదర్.

హర్యానా స్టీలర్స్ జట్టు: చంద్రన్ రంజిత్, కె ప్రపంజన్, సిద్ధార్థ్ దేశాయ్, వినయ్, తేజస్ పాటిల్, శివమ్ పటారే, విశాల్ టైట్, ఘనశ్యామ్ మగర్, హసన్ బల్బూల్, హర్దీప్, జైదీప్ దహియా, రాహుల్ సెట్పాల్, రవీంద్ర చౌహాన్, మోహిత్ నందాల్, మోను కు హుడా, హర్ష్ సన్నీ సెహ్రావత్, మోహిత్, హిమాన్షు చౌదరి, ఆశిష్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..