Pele Records: 16 ఏళ్లకే ఎంట్రీ.. 3 ప్రపంచకప్‌లు సొంతం.. ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ పీలే కెరీర్ రికార్డులు ఇవే..

Pele Passes Away: బ్రెజిల్ ఫుట్‌బాల్ స్టార్ పీలే (82) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుమార్తె ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తెలియజేసింది. అతను నవంబర్ 29న సావో పాలోలోని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఇజ్రాయెలీ ఆసుపత్రిలో చేరాడు.

Pele Records: 16 ఏళ్లకే ఎంట్రీ.. 3 ప్రపంచకప్‌లు సొంతం.. ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ పీలే కెరీర్ రికార్డులు ఇవే..
Pele Records

Updated on: Dec 30, 2022 | 2:34 AM

Pele Passes Away: బ్రెజిల్ ఫుట్‌బాల్ స్టార్ పీలే (82) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుమార్తె ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తెలియజేసింది. పీలే ప్రపంచంలోనే అత్యుత్తమ ఫుట్‌బాల్ ఆటగాడిగా పేరుగాంచాడు. 20వ శతాబ్దపు గొప్ప ఫుట్‌బాల్ క్రీడాకారుడు పీలే పెద్దపేగు క్యాన్సర్‌తో బాధపడుతూ, కొంతకాలం క్రితం ఆసుపత్రిలో చేరాడు. రికార్డుల రారాజుగా పేరుగాంచిన పీలే.. 16 ఏళ్ల వయసులోనే తన సత్తా చూపించడం మొదలు పెట్టాడు. ఆయన పేరుపై ఉన్న రికార్డులను ఓసారి పరిశీలిద్దాం..

మూడుసార్లు ప్రపంచకప్‌ గెలిచిన రికార్డు..

1958, 1962, 1970లో పీలే నేతృత్వంలోని బ్రెజిల్ జట్టు ప్రపంచకప్‌ను గెలుచుకుంది. పీలే మొత్తం 4 ప్రపంచకప్‌లు ఆడారు. అందులో మూడు ప్రపంచకప్‌లను గెలిచారు. మూడు ప్రపంచకప్‌లు గెలిచిన ఏకైక ఆటగాడిగా పీలే నిలిచాడు. అనంతరం 1971లో బ్రెజిల్ జాతీయ జట్టు నుంచి రిటైరయ్యాడు.

ఇవి కూడా చదవండి

16 ఏళ్ల వయసులో జాతీయ జట్టులోకి ఎంట్రీ..

ఫుట్‌బాల్ ప్లేయర్‌గా పీలే కెరీర్ చాలా చిన్న వయస్సులోనే ప్రారంభమైంది. పీలే 15 సంవత్సరాల వయస్సులో శాంటోస్ తరపున ఫుట్‌బాల్ ఆడటం ప్రారంభించాడు. 16 సంవత్సరాల వయస్సులో పీలే బ్రెజిల్ జాతీయ జట్టులో చేరాడు. పీలే 7 జూలై 1957న అర్జెంటీనా తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో బ్రెజిల్ 2-1తో విజయం సాధించగా, పీలే ఆ మ్యాచ్‌లో గోల్ చేసి చరిత్ర సృష్టించాడు. ఆ సమయంలో, పీలే వయస్సు 16 సంవత్సరాల 9 నెలలు మాత్రమే. అతను గోల్ చేసిన అత్యంత పిన్న వయస్కుడైన బ్రెజిలియన్ ఆటగాడిగా నిలిచాడు. మరుసటి సంవత్సరం, అతను ప్రపంచ కప్‌లో పాల్గొన్నాడు. పీలే ఆ సమయంలో ప్రపంచ కప్‌లో ఆడిన అతి పిన్న వయస్కుడైన ఆటగాను రికార్డులు నెలకొల్పాడు.

మరిన్ని రికార్డులు..

పీలే పేరుతో కొన్ని ప్రత్యేకమైన రికార్డులు జతచేయబడ్డాయి. అతను తన కెరీర్‌లో 1279 గోల్స్ సాధించగా, అతను 3 ఫిఫా ప్రపంచ కప్‌లను గెలుచుకోవడంలో విజయం సాధించాడు. ఇది కాకుండా, పీలే 6 బ్రెజిలియన్ లీగ్ టైటిళ్లను గెలుచుకున్నాడు. రెండుసార్లు కోపా లిబర్టాడోర్స్ టైటిల్‌ను గెలుచుకున్నాడు.

సాకర్‌లో రికార్డుల రారాజు..

ప్రపంచంలోనే అత్యుత్తమ ఫుట్‌బాల్ ప్లేయర్‌గా పేరొందిన పీలే తన కెరీర్‌లో 1366 మ్యాచ్‌ల్లో మొత్తం 1281 గోల్స్ చేశాడు. అతని గోల్ సగటు ప్రతి మ్యాచ్‌కు 0.94. ఇది ఫుట్‌బాల్ ప్రపంచంలో అత్యుత్తమంగా పరిగణిస్తుంటారు.

పీలే అసలు పేరు..

పీలే అసలు పేరు ఎడ్సన్ అరంటెస్ డో నాస్సిమెంటో . కానీ, ప్రపంచానికి అతన్ని పీలే అని మాత్రమే తెలుసు. అతను అక్టోబర్ 23, 1940న బ్రెజిల్‌లోని ట్రెస్ కొరాకోస్‌లో జన్మించాడు. ఫిఫా చేత ‘ది గ్రేటెస్ట్’ బిరుదు కూడా పొందాడు. పీలే తన జీవితంలో మూడు వివాహాలు చేసుకున్నాడు. మొత్తం ఏడుగురు పిల్లలు ఉన్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us