Paris Paralympics 2024: రెండో రోజు అదరగొట్టిన భారత అథ్లెట్లు.. షూటింగ్‌లో నాలుగో పతకం..

Paris Paralympics 2024: పారిస్ పారాలింపిక్స్ 2024లో భారత ఆటగాళ్ల బలమైన ప్రదర్శన కొనసాగుతోంది. పారాలింపిక్స్ 2024లో భాగంగా రెండో రోజు కూడా భారత్ ఆకట్టుకుంది. మొత్తంగా నాలుగో పతకాన్ని సాధించింది. షూటింగ్‌లో ఈ పతకం వచ్చింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ SH1 ఫైనల్లో భారత షూటర్ మనీష్ నర్వాల్ రజత పతకాన్ని గెలుచుకున్నాడు. మనీష్ నర్వాల్ గత పారాలింపిక్స్‌లో కూడా అద్భుత ప్రదర్శన చేసి స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఫైనల్లో మనీష్ 234.9 స్కోర్ చేశాడు.

Paris Paralympics 2024: రెండో రోజు అదరగొట్టిన భారత అథ్లెట్లు.. షూటింగ్‌లో నాలుగో పతకం..
Paris Paralympics 2024
Follow us

|

Updated on: Aug 31, 2024 | 8:15 AM

Paris Paralympics 2024: పారిస్ పారాలింపిక్స్ 2024లో భారత ఆటగాళ్ల బలమైన ప్రదర్శన కొనసాగుతోంది. పారాలింపిక్స్ 2024లో భాగంగా రెండో రోజు కూడా భారత్ ఆకట్టుకుంది. మొత్తంగా నాలుగో పతకాన్ని సాధించింది. షూటింగ్‌లో ఈ పతకం వచ్చింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ SH1 ఫైనల్లో భారత షూటర్ మనీష్ నర్వాల్ రజత పతకాన్ని గెలుచుకున్నాడు. మనీష్ నర్వాల్ గత పారాలింపిక్స్‌లో కూడా అద్భుత ప్రదర్శన చేసి స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఫైనల్లో మనీష్ 234.9 స్కోర్ చేశాడు.

గోల్డ్ మెడల్ కోల్పోయిన మనీష్..

10 మీటర్ల ఎయిర్ పిస్టల్ SH1 ఫైనల్‌లో మనీష్ నర్వాల్, దక్షిణ కొరియాకు చెందిన జియోన్ జోంగ్డు మధ్య యుద్ధం జరిగింది. కొన్నిసార్లు మనీష్ ముందుండగా, మరికొన్ని సార్లు జాన్ జోంగ్డు లీడ్‌గా నిలిచాడు. కానీ చివరికి, జియోంగ్డు విజయం సాధించగలిగాడు. ఈ ఈవెంట్‌లో 237.4 పాయింట్లు సాధించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. కాగా, ఫైనల్లో మనీష్ మొత్తం 234.9 పాయింట్లు సాధించాడు. మరోవైపు చైనాకు చెందిన యాంగ్ చావో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. అతను మొత్తం 214.3 మార్కులు సాధించాడు.

షూటర్ మనీష్ నర్వాల్ ఎవరు?

17 అక్టోబర్ 2001న జన్మించిన మనీష్ నర్వాల్ ఒక భారతీయ పారా పిస్టల్ షూటర్. వరల్డ్ షూటింగ్ పారా స్పోర్ట్ ర్యాంకింగ్స్ ప్రకారం, అతను పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ SH1లో ప్రపంచంలో నాల్గవ స్థానంలో ఉన్నాడు. 2016లో బల్లభ్‌గఢ్‌లో షూటింగ్‌ ప్రారంభించాడు. అతను 2021 పారా షూటింగ్ ప్రపంచ కప్‌లో P4 మిక్స్‌డ్ 50 మీటర్ల పిస్టల్ SH1 ఈవెంట్‌లో బంగారు పతకాన్ని గెలుచుకుని ప్రపంచ రికార్డు సృష్టించాడు. టోక్యో పారాలింపిక్స్‌లో మనీష్ నర్వాల్ బంగారు పతకం సాధించాడు. అతను మిక్స్‌డ్ P4-50 మీటర్ల పిస్టల్ SH1లో ఈ పతకాన్ని సాధించాడు.

మనీష్ నర్వాల్ కుడి చేయి చిన్నప్పటి నుంచి పని చేయదు. అతను ఫుట్‌బాల్ ఆడేందుకు ఇష్టపడ్డాడు. కానీ ఒకసారి అతను తీవ్రంగా గాయపడ్డాడు. అతని తల్లిదండ్రులు అతన్ని ఫుట్‌బాల్‌ను వదులుకొమ్మని సూచించారు. ఆ తరువాత అతని నాన్న స్నేహితులలో ఒకరి సలహా మేరకు, షూటింగ్ ప్రారంభించాను. కానీ అతని తండ్రి వద్ద పిస్టల్ కొనడానికి కూడా డబ్బు లేదు. అలాంటి పరిస్థితుల్లో తన ఇంటిని ఏడు లక్షల రూపాయలకు అమ్మి మనీష్‌కు పిస్టల్‌ కొనిచ్చాడు. తన తండ్రి చేసిన ఈ త్యాగాన్ని ఆయన పట్టించుకోలేదు. ఈరోజు తన తండ్రితో పాటు యావత్ దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

విమానంలో లవ్ ప్రపోజల్ | పాత జ్ఞాపకాలతో గల్లీ క్రికెట్.!
విమానంలో లవ్ ప్రపోజల్ | పాత జ్ఞాపకాలతో గల్లీ క్రికెట్.!
మంచు ఫ్యామిలీ మూడో తరం "తిన్నడు".! మంచు అవ్రామ్‌ పోస్టర్‌ లుక్‌..
మంచు ఫ్యామిలీ మూడో తరం
అన్నం వండేవాడు.. మంచిగా ఉండేవాడు.! కోల్‌కతా ఘటన నిందితుడి తల్లి.
అన్నం వండేవాడు.. మంచిగా ఉండేవాడు.! కోల్‌కతా ఘటన నిందితుడి తల్లి.
భారత్‌లో టెలిగ్రామ్‌ యాప్ బ్యాన్.? సెక్షన్ 14C ప్రకారం..
భారత్‌లో టెలిగ్రామ్‌ యాప్ బ్యాన్.? సెక్షన్ 14C ప్రకారం..
రాజమౌళి నా అవసరం లేదన్నారు.! నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్..
రాజమౌళి నా అవసరం లేదన్నారు.! నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్..
తింటే అరగదు.. వదిలేస్తే ప్రాణం నిలవదు! చిన్నారి ప్రాణం ఖరీదు..
తింటే అరగదు.. వదిలేస్తే ప్రాణం నిలవదు! చిన్నారి ప్రాణం ఖరీదు..
మీ ఆధార్‌ని ఇతరులు వినియోగిస్తున్నారా.? తెలుసుకోండి ఇలా.!
మీ ఆధార్‌ని ఇతరులు వినియోగిస్తున్నారా.? తెలుసుకోండి ఇలా.!
చికెన్‌తో పాటు పెరుగు తింటున్నారా? జాగ్రత్త.. ఇది మీ కోసమే.!
చికెన్‌తో పాటు పెరుగు తింటున్నారా? జాగ్రత్త.. ఇది మీ కోసమే.!
వీళ్లు పుష్పానే మించిపోయారు.. పైకి చూస్తే ఖాళీ లారీ.. లోపల మాత్రం
వీళ్లు పుష్పానే మించిపోయారు.. పైకి చూస్తే ఖాళీ లారీ.. లోపల మాత్రం
హిట్టా.? ఫట్టా.? నాని సరిపోదా శనివారం మూవీకి షాకింగ్ రివ్యూ.!
హిట్టా.? ఫట్టా.? నాని సరిపోదా శనివారం మూవీకి షాకింగ్ రివ్యూ.!