Paris Olympics: వద్దన్నా వినలేదు.. బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి నైట్‌ ఔట్.. కట్‌చేస్తే.. ఒలింపిక్స్ నుంచి ఔట్..

|

Jul 31, 2024 | 9:21 AM

Brazilian swimmer Ana Carolina Vieira: బ్రెజిల్‌ స్విమ్మింగ్‌ కమిటీ హెడ్‌ గుత్సావో ఒట్‌సుకా మాట్లాడుతూ.. ' ఎంతో కష్టపడి ఒలింపిక్స్‌ క్రీడా గ్రామానికి వచ్చింది ఎంజాయ్‌ చేసేందుకు కాదు. దేశం తరపున ఆడి పతకం గెలవాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు. కానీ, అనా కరోలినా మాత్రం రూల్స్‌కు విరుద్ధంగా వ్యవహరించింది. దీంతో ఇదే విషయాన్ని ఒలింపిక్స్ కమిటీ దృష్టికి తీసుకువెళ్లాం. వివరాలను పరిశీలించిన అధికారులు తగిన చర్యలు తీసుకున్నారు’’ అంటూ తెలిపాడు.

Paris Olympics: వద్దన్నా వినలేదు.. బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి నైట్‌ ఔట్.. కట్‌చేస్తే.. ఒలింపిక్స్ నుంచి ఔట్..
Brazilian Swimmer Ana Carolina Vieira
Follow us on

Brazilian swimmer Ana Carolina Vieira: విశ్వ క్రీడల ఈవెంట్ ఒలింపిక్స్ పారిస్‌లో ప్రారంభమయ్యాయి. ఇందులో 10 వేల మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఈ క్రీడల్లో పతకం సాధించాలని ప్రతీ క్రీడాకారుడు కోరుకుంటాడు. ఇందుకోసం కొన్ని సంవత్సరాలకు ముందే ప్రాక్టీస్ ప్రారంభిస్తారు. ఎన్నో కష్టాలు ఎదుర్కొని, తీవ్రంగా శ్రమిస్తుంటారు. అయితే, చివరి వరకు నిలిచిన వారినే పతకం వరిస్తుంది. కానీ, కొంతమంది మాత్రం తమ ప్రయాణాన్ని మధ్యలోనే వదిలేయాల్సి వస్తుంది. మరికొంతమంది తమ తప్పులతో ఎంతో అద్భుతమైన అవకాశాన్ని చేజార్చుకుంటుంటారు. ఇలాంటి వారిలో బ్రెజిలియన్ స్విమ్మర్ అనా కరోలినా వియెరా చేరింది. ఒలింపిక్స్‌లో పాల్గొనకుండా భారీ షాక్‌ తగిలింది. ఒలింపిక్ క్రీడల గ్రామం నుంచి బహిష్కరణకు గురైంది. ఒలింపిక్స్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈమెపై ఇలాంటి చర్య తీసుకున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..

జులై 26న, అనా కరోలినా తన ప్రియుడితో కలిసి పారిస్‌లోని ఈఫిల్ టవర్‌ని చూడటానికి వెళ్లింది. ఈ సమయంలో ఆమె ఎవరి అనుమతి తీసుకోలేదు. అలాగే, ఆమె తన సోషల్‌ మీడియాలో చేసిన ఓ పోస్ట్‌‌తో.. విషయం తెలుసుకున్న ఒలింపిక్ అధికారులు.. ఎటువంటి అనుమతి తీసుకోకుండా, రూల్స్‌కు విరుద్ధంగా వ్యవహరించడంపై ఆగ్రహించింది. మీడియా నివేదికల ప్రకారం, ఆమె చర్యను ఒలింపిక్ కమిటీ నిబంధనల ఉల్లంఘనగా పరిగణించింది. దీంతో మహిళా స్విమ్మర్‌ను ఒలింపిక్ క్రీడా గ్రామం నుంచి బహిష్కరణ చేశారు.

అయితే, అనా కరోలినా బాయ్ ఫ్రెండ్ గాబ్రియేల్ శాంటోస్‌ మాత్రం క్షమించాలంటూ ఒలింపిక్ కమిటీని వేడుకున్నాడంట. దీంతో శాంటోస్‌కు మాత్రం ఒలింపిక్స్‌లో పాల్గొనే ఛాన్స్ ఇచ్చారు. కాగా, శనివారం జరిగిన పురుషుల 4×100 ఫ్రీస్టైల్ హీట్స్‌లో ఆయన ఓటమిపాలయ్యాడు.

ఇవి కూడా చదవండి

ఈ క్రమంలో బ్రెజిల్‌ స్విమ్మింగ్‌ కమిటీ హెడ్‌ గుత్సావో ఒట్‌సుకా మాట్లాడుతూ.. ‘ ఎంతో కష్టపడి ఒలింపిక్స్‌ క్రీడా గ్రామానికి వచ్చింది ఎంజాయ్‌ చేసేందుకు కాదు. దేశం తరపున ఆడి పతకం గెలవాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు. కానీ, అనా కరోలినా మాత్రం రూల్స్‌కు విరుద్ధంగా వ్యవహరించింది. దీంతో ఇదే విషయాన్ని ఒలింపిక్స్ కమిటీ దృష్టికి తీసుకువెళ్లాం. వివరాలను పరిశీలించిన అధికారులు తగిన చర్యలు తీసుకున్నారు’’ అంటూ తెలిపాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..