ISSF Shooting: ఢిల్లీ వేదికగా జరుగుతోన్న ఐఎస్‌ఎస్‌ఎఫ్ ఘూటింగ్ ప్రపంచకప్‌లో భారత షూటర్స్ జోరు కొనసాగుతోంది. ప్లేయర్లు పతకాల పంట పండిస్తున్నారు. ఇప్పటి వరకు 12 స్వర్ణాలు, 7 రజతాలు, 6 కాంస్య పతకాలతో దూసుకెళుతున్నారు.
శుక్రవారం జరిగిన 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ మిక్స్‌డీ టీమ్ ఈవెంట్‌లో భారత ద్వయం సంజీవ్ రాజ్‌పుత్, తేజస్విని సావంత్.. ఉక్రెయిన్ జోడీ సెరీ కులిష్, అన్నా ఇలినాపై 31-29 తో విజయం సాధించింది. పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నారు. ఇక ఇదే విభాగంలో ఐశ్వరీ ప్రతాప్‌సింగ్ తోమర్, సునిధి చౌహాన్ ద్వయం కాంస్య పతకాన్ని గెలుచుకుంది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ టీమ్ ఈవెంట్‌లో 47-25తో నీరజ్‌కుమార్, స్వప్నిల్ కుశాలశ్రీ, చైన్ సింగ్ త్రయం పసిడి పతకాన్ని సాధించింది. ఇక పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ పిస్టల్‌లో విజయ్‌వీర్ సిద్ధు రజత పతకాన్ని దక్కించుకున్నాడు. ఇక హైదరాబాద్ షూటర్ కైనాన్ చినాయ్ నాలుగో స్థానంలో నిలిచాడు. దీంతో తృటిలో పతకాన్ని సొంతం చేసుకునే అవకాశాన్ని కోల్పోయాడు.
Also Read: Breaking News: క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్‌కు కరోనా పాజిటివ్.. ట్విట్టర్ వేదికగా ప్రకటన.!