Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్‌కు ఇండియన్‌ షూటర్లను ప్రకటించిన రైఫిల్‌ అసోసియేషన్‌..

|

Apr 05, 2021 | 2:51 PM

Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత షూటింగ్‌ జట్టును ప్రకటించారు. నేషనల్‌ రైఫిల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌ఆర్‌ఏఐ) ఆదివారం ఈ జాబితాను విడుదల చేసింది...

Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్‌కు ఇండియన్‌ షూటర్లను ప్రకటించిన రైఫిల్‌ అసోసియేషన్‌..
Tokyo Team
Follow us on

Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత షూటింగ్‌ జట్టును ప్రకటించారు. నేషనల్‌ రైఫిల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌ఆర్‌ఏఐ) ఆదివారం ఈ జాబితాను విడుదల చేసింది. టోక్యో ఒలింపిక్స్‌లో భారత షూటర్లు 10 కేటగిరీలకుగాను 15 బెర్త్‌లు సంపాదించారు.
ఇదిలా ఉంటే మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో ప్రపంచ నెంబర్‌ వన్‌, తమిళనాడు షూటర్‌ ఇలవేనిల్‌ వలారివన్‌కు టోక్యోలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కింది. అయితే ఈమె నేరుగా అర్హత పొందలేదు.. దీనికి కారణం ఎన్‌ఆర్‌ఏఐ నిబంధనల ప్రకారం బెర్త్‌ అనేది దేశానికి చెందుతుంది కానీ అర్హత సాధించిన షూటర్‌కు కాదు. ఈ క్రమంలోనే ఎన్‌ఆర్‌ఏఐ 15 మందితో జట్టును ఎంపిక చేసింది.

మహిళల విభాగంలో ఎంపికైన వారు:

50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్‌: అంజుమ్, తేజస్విని.
25 మీటర్ల స్పోర్ట్స్‌ పిస్టల్‌: రాహీ, మనూ.
10 మీటర్ల రైఫిల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌: దివ్యాంశ్, ఇలవేనిల్‌.
10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌: అపూర్వీ, ఇలవేనిల్‌.
10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌: మనూ భాకర్, యశస్విని.
10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌: సౌరభ్, మనూ భాకర్‌.

పురుషుల విభాగంలో ఎంపికైన వారు:

50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్‌: సంజీవ్‌ రాజ్‌పుత్
స్కీట్‌ ఈవెంట్‌: అంగద్‌వీర్, మేరాజ్‌ అహ్మద్‌ఖాన్‌.
10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌: దివ్యాంశ్, దీపక్‌, ఐశ్వరీ ప్రతాప్‌ సింగ్‌.
10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌: సౌరభ్‌ చౌధరీ, అభిషేక్‌ వర్మ.

Also Read: IPL 2021: సన్‌రైజర్స్ హైదరాబాద్: ఆ ముగ్గురు ఆటగాళ్లే జట్టుకు బలం.. ప్లేఆఫ్స్ టికెట్ ఖచ్చితమే.!

IPL Live streaming: హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌‌ లేకుండానే మొబైల్‌లో ఐపీఎల్‌ మ్యాచ్‌లు.. ఏలాగంటే..

IPL 2021: 13 బంతుల్లో 10 వికెట్లు పడగొట్టిన చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్.. అతడు ఎవరంటే.!