Hockey World Cup 2023: మొదలైన హాకీ పండుగ.. ఆటగాళ్లకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ..
FIH Hockey World Cup 2023 Opening Ceremony: హాకీ ప్రపంచ కప్ 2023 సమరానికి రంగం సిద్ధమైంది. బుధవారం రాత్రి అద్భుతమైన ప్రారంభ వేడుకతో ప్రకటించారు. ఇక మ్యాచ్‌లు శుక్రవారం నుంచి ప్రారంభమవుతాయి. టోర్నీలో భాగంగా తొలిరోజు స్పెయిన్‌తో భారత హాకీ జట్టు తలపడనుంది.

హాకీ ప్రపంచ కప్ 2023 పురుషుల హాకీ ప్రపంచ కప్ 2023 బుధవారం సాయంత్రం కటక్‌లోని బారాబతి స్టేడియంలో వేలాది మంది హాకీ ప్రేమికుల సాక్షిగా ప్రారంభ వేడుకతో షురూ అయ్యాయి. కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ఎఫ్‌ఐహెచ్ ప్రెసిడెంట్ తైబ్ ఇక్రమ్, హాకీ ఇండియా ప్రెసిడెంట్ దిలీప్ టిర్కీ ఈ వేడుకకు హాజరై మొత్తం 16 జట్ల సభ్యులకు స్వాగతం పలికారు.
ఇక్రమ్ తన ప్రసంగంలో, ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌కు వరుసగా రెండుసార్లు ఆతిథ్యం ఇచ్చినందుకు ఒడిశాను అభినందించాడు. రాష్ట్రాన్ని ‘ల్యాండ్ ఆఫ్ హాకీ’ అని ప్రకటించారు. 2018 ప్రపంచకప్‌నకు ఒడిశా ఆతిథ్యం ఇచ్చింది. ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించినందుకు ఒడిశా ప్రభుత్వానికి థాకూర్ కృతజ్ఞతలు తెలిపారు. భారత ప్రజల ఉత్సాహం ఆట పట్ల వారి ప్రేమను ప్రతిబింబిస్తుందని అన్నారు.
రాష్ట్రాలు ఇలాంటి క్రీడా కార్యక్రమాలను నిర్వహించేందుకు కేంద్రం ఎల్లప్పుడూ సహకరిస్తుందని చెప్పుకొచ్చారు. ఒడిశా ఆతిథ్యానికి చాలా కాలంగా పేరుగాంచిందని, ప్రతి సందర్శకుడు రాష్ట్రం నుంచి మంచి జ్ఞాపకాలను తీసుకెళ్తారని ఆశిస్తున్నానని పట్నాయక్ అన్నారు. పురుషుల హాకీ ప్రపంచకప్‌కు వరుసగా రెండుసార్లు ఆతిథ్యమివ్వడంలో ఒడిశాకు మద్దతుగా నిలిచినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.




అసలు సమరం జనవరి 13 నుంచి..
జనవరి 13 నుంచి జనవరి 29 వరకు రూర్కెలాలోని బిర్సా ముండా హాకీ స్టేడియం, భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియం రెండు వేదికలపై మ్యాచ్‌లు జరగనున్నాయి. రూర్కెలాలో 20 మ్యాచ్‌లు, ఫైనల్‌తో సహా 24 మ్యాచ్‌లు భువనేశ్వర్‌లో జరగనున్నాయి.
శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ..
జనవరి 13 నుంచి ఒడిశాలో ప్రారంభం కానున్న హాకీ ప్రపంచకప్ కోసం అన్ని జట్లకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ గ్లోబల్ ఈవెంట్ క్రీడా స్ఫూర్తిని బలోపేతం చేయడమే కాకుండా హాకీ మరింత ప్రాచుర్యం పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎఫ్‌ఐహెచ్ పురుషుల హాకీ ప్రపంచ కప్ ప్రారంభోత్సవానికి ముందు మోదీ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. “2023 హాకీ ప్రపంచ కప్ ఒడిశాలో ప్రారంభం కానున్నందున, పాల్గొనే అన్ని జట్లకు నా శుభాకాంక్షలు” తెలిపారు. ఈ టోర్నమెంట్ క్రీడాస్ఫూర్తిని మరింత బలోపేతం చేసి, అందమైన హాకీ గేమ్‌ను ప్రాచుర్యంలోకి తీసుకురావాలి. ఈ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వడం భారత్‌కు గర్వకారణం అంటూ చెప్పుకొచ్చారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
