FIFA 2022: ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. అక్కడ రోమాన్స్ చేస్తే ఏడేళ్లు జైలు శిక్ష? కలవరపెడుతోన్న కొత్త రూల్స్..

|

Jun 24, 2022 | 5:04 PM

ప్రపంచ కప్ సందర్భంగా వన్-నైట్ స్టాండ్‌లు, పబ్లిక్ రొమాన్స్‌ను కూడా ఖతార్ నిషేధించినట్లు వార్తలు వస్తున్నాయి. డైలీ స్టార్ కథనం ప్రకారం, విదేశీయులు అరబ్ దేశంలోని కఠినమైన చట్టాలను అనుసరించాల్సి ఉంటుందని ఖతార్ స్పష్టం చేసింది.

FIFA 2022: ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. అక్కడ రోమాన్స్ చేస్తే ఏడేళ్లు జైలు శిక్ష? కలవరపెడుతోన్న కొత్త రూల్స్..
Fifa 2022
Follow us on

FIFA ఫుట్‌బాల్ ప్రపంచ కప్ 2022ని ఈ ఏడాది నవంబర్‌లో ఖతార్ నిర్వహిస్తోంది. ప్రపంచం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ఫుట్‌బాల్ ప్రేమికులు ఇక్కడికి చేరుకుంటారు. ఖతార్ ఇప్పటికే చర్చలో నిలిచింది. LGBTQ, మానవ హక్కుల ఉల్లంఘనలపై నిత్య వార్తల్లో నిలుస్తోంది. నవంబర్ 21 నుంచి డిసెంబర్ 18 వరకు జరగనున్న ఫిఫా ప్రపంచ కప్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఖతార్‌కు హోస్టింగ్ ఇచ్చినప్పటి నుంచి, అసలు వివాదం ప్రారంభమైంది. ఎందుకంటే, గల్ఫ్ దేశంలో జరిగే ప్రపంచకప్‌లో అభిమానులకు ఎన్నో కఠినమైన రూల్స్ విధించారు. దీంతో ఫిఫా ప్రపంచ కప్‌లో మ్యాచ్‌లను స్డేడియంలో కూర్చుని చూడాలనుకునే వారికి ఇదోక బ్యాడ్‌న్యూస్ లాంటిదే. అసలు ఈ రూల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

ప్రపంచ కప్ సందర్భంగా వన్-నైట్ స్టాండ్‌లు, పబ్లిక్ రొమాన్స్‌ను కూడా ఖతార్ నిషేధించినట్లు వార్తలు వస్తున్నాయి. డైలీ స్టార్ కథనం ప్రకారం, విదేశీయులు అరబ్ దేశంలోని కఠినమైన చట్టాలను అనుసరించాల్సి ఉంటుందని ఖతార్ స్పష్టం చేసింది. భార్యాభర్తలు కాకుండా.. శారీరక సంబంధం పెట్టుకుంటే ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.

ఇవే కాకుండా విదేశీ అభిమానులకు ఎన్నో కష్టతరమైన, కఠినమైన చట్టాలను ఖతార్ ప్రభుత్వం అమలు చేస్తోంది.

ఇవి కూడా చదవండి

స్వలింగ సంపర్కుల శారీరక సంబంధాలకు శిక్షలు..

ఖతార్ ఇస్లామిక్ షరియా చట్టం మేరకు, ఒంటరిగా శారీరక సంబంధం కలిగి ఉండటం నేరంగా పరిగణిస్తున్నారు. అలాగే, స్వలింగ సంపర్కానికి శిక్షలు విధించే నిబంధన కూడా ఉంది. ఇలాంటి నేరాలకు సంబంధించి విదేశీయులకు కూడా 7 ఏళ్ల జైలు శిక్ష విధించవచ్చని ఖతార్ పోలీసులు తెలిపారు. భార్యాభర్తలు కానివారు ఏకాభిప్రాయంతో సెక్స్ చేసినా నేరంగా పరిగణిస్తున్నారు.

ఆంక్షలు ఎలా ఉన్నాయంటే?

ఖతార్‌లో ఫుట్‌బాల్ మ్యాచ్ తర్వాత పార్టీలు, మద్యం సేవించడం కూడా నిషేధించారు. అలాగే దంపతుల ఇంటిపేర్లు ఒకేలా లేకుంటే వారికి హోటల్‌లో వేర్వేరు గదులు కేటాయించనున్నారు. కలిసి గదిని పొందాలంటే భార్యాభర్తలమని నిరూపించుకోవాల్సి ఉంటుంది.

‘బహిరంగ శృంగారం మా సంస్కృతిలో భాగం కాదు’

బహిరంగ ప్రదేశాల్లో రొమాన్స్ చేయడం ఖతార్ సంస్కృతిలో భాగం కాదని, అందుకే విదేశీయులకు అనుమతి ఇవ్వలేమని ఫిఫా వరల్డ్ కప్ చీఫ్ అఫీషియల్ నాసర్ అల్-ఖాటర్ చెప్పుకొచ్చారు. ఖతార్‌కు వచ్చే ఫుట్‌బాల్ ప్రేమికుల భద్రత తమ ప్రాధాన్యత అని ఆయన తెలిపారు.

ఇంత కఠినమైన నిబంధనలు అమలులో ఉన్న దేశం ఖతార్ మాత్రమే కాదు. షరియా చట్టం ప్రకారం చాలా అరబ్ దేశాల్లో ఇటువంటి నియమాలు సర్వసాధారణం. వివాహానికి ముందు, భర్త లేదా భార్యతో కాకుండా ఇతరులతో సెక్స్ చేయడం పెద్ద నేరంగా పరిగణిస్తారు. ఇలాంటి నేరాలకు మధ్యప్రాచ్యంలోని వివిధ దేశాలలో కొట్టడం నుంచి జైలు, మరణ శిక్షలు విధిస్తున్నట్లు మనం తరచుగా వింటూనే ఉన్నాం.

కోవిడ్ రూల్స్?

అభిమానులందరూ తప్పనిసరిగా Ehteraz ట్రాక్, ట్రేస్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. వారు 48 గంటల ముందు పీసీఆర్ టెస్ట్ నెగిటివ్ చూపించాల్సి ఉంటుంది. దీనితో పాటు, పూర్తిగా టీకాలు వేసుకున్నట్లు పత్రాలు కూడా చూపించాల్సి ఉంటుంది.

అభిమానులు మద్యం తీసుకోకుండా ఉంటారా?

ఖతార్‌లో మద్యం నిషేధించలేదు. కానీ, కొన్ని చోట్ల మాత్రమే అనుమతి ఉంది. లైసెన్స్ ఉన్న రెస్టారెంట్లలో మాత్రమే మద్యం తీసుకోవచ్చు. చట్టపరంగా మద్యపానం సేవించే వయస్సును 21 సంవత్సరాలుగా నిర్ణయించారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే రూ. 64 వేల జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష విధించవచ్చు.

డ్రెస్ కోడ్?

మహిళా అభిమానులు భుజాలను కప్పి ఉంచే దుస్తులను ధరించాల్సి ఉంటుంది. బహిరంగ ప్రదేశాల్లో పొడవాటి స్కర్టులు లేదా ప్యాంటు ధరించాలి. పురుషులు కూడా బహిరంగ ప్రదేశాల్లో షార్ట్‌లు ధరించడం నిషేధం.

LGBTQపై వివాదం?

ఖతార్‌లో స్వలింగసంపర్కం చట్టవిరుద్ధం. ఫిఫా అధికారిక జాబితాలో ఉన్న 69 హోటళ్లలో 3 గే జంటల బుకింగ్‌ను తిరస్కరించినట్లు ఇటీవల వెల్లడైంది.

ఎలాంటివి తీసుకెళ్లకూడదు?

ఖతార్ ఒక ఇస్లామిక్ దేశం. ఆ దేశంలోకి ఎంట్రీ ఇచ్చే విషయంలో కఠినమైన నిబంధనలు ఉన్నాయి. లగేజీలో ఆల్కహాల్, డ్రగ్స్, అశ్లీలత, ఇస్లామేతర మతపరమైన పుస్తకాలు ఉండకూడదు. ఈ-సిగరెట్లను కూడా నిషేధించారు.

అభిమానులు ఎక్కడ ఆగుతారు?

అభిమానులు అధికారిక ఖతార్ 2022 పోర్టల్ ద్వారా హోటళ్లను బుక్ చేసుకోగలరు. అయితే దీని కోసం వారు మ్యాచ్ టికెట్ అప్లికేషన్ నంబర్‌కు కచ్చితంగా చూపించాల్సి ఉంటుంది.

టోర్నీ ఎందుకు వివాదాస్పదమైంది?

ఆతిథ్యం ఇవ్వడానికి ఖతార్ లంచాలు ఇచ్చిందని ఆరోపించారు. నిర్మాణ పనుల్లో 6,500 మందికి పైగా కార్మికులు చనిపోయారు. కార్మికులపై దోపిడీకి పాల్పడినట్లు కూడా వార్తలు వచ్చాయి.