FIFA World Cup 2022: పోలాండ్‌కు షాకిచ్చిన డిఫెండింగ్ ఛాంపియన్.. క్వార్టర్ ఫైనల్‌ చేరిన ఫ్రాన్స్..

| Edited By: Anil kumar poka

Dec 05, 2022 | 9:19 AM

France vs Poland: డిఫెండింగ్ ఛాంపియన్స్ ఫ్రాన్స్ తమ ప్రీ-క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లో పోలాండ్‌ను 3-1తో ఓడించి 2022 ఫిఫా ప్రపంచ కప్‌లో చివరి ఎనిమిది స్థానాల్లో తమ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో గిరౌడ్, ఎంబాపేలు ఫ్రాన్స్‌కు విజయాన్ని అందించారు.

FIFA World Cup 2022: పోలాండ్‌కు షాకిచ్చిన డిఫెండింగ్ ఛాంపియన్.. క్వార్టర్ ఫైనల్‌ చేరిన ఫ్రాన్స్..
Fifa Wc 2022 France Vs Poland
Follow us on

ఆదివారం జరిగిన రౌండ్-16 మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ 3-1 తేడాతో పోలాండ్‌ను ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఫ్రాన్స్ తరపున సెంటర్ ఫార్వర్డ్ ఆలివర్ గిరౌడ్, స్ట్రైకర్ ఎంబాపే గోల్స్ చేశారు. మ్యాచ్‌లో మొదటి అర్ధభాగం ముగిసే సమయానికి 44వ నిమిషంలో గిరౌడ్ తొలి గోల్ చేసి తన జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. దీని తర్వాత రెండో అర్ధభాగంలో 74వ నిమిషంలో ఎంబాపే గోల్ చేసి ఫ్రాన్స్ ఆధిక్యాన్ని రెట్టింపు చేశాడు. మ్యాచ్ ముగిసే సమయానికి ముందు, ఎంబాప్పే మరోసారి తన క్లాస్‌ని ప్రదర్శించాడు. బంతిని గోల్ పోస్ట్‌కి తీసుకెళ్లడం ద్వారా తన జట్టుకు విజయాన్ని అందించాడు. ఇంజురీ టైమ్‌లో, పోలాండ్‌కు పెనాల్టీ ద్వారా గోల్ తేడాను తగ్గించే అవకాశం లభించింది. రాబర్ట్ లెవాండోస్కీ జట్టుకు ఏకైక గోల్ చేశాడు.

తొలి అర్ధభాగంలో హోరాహోరీ పోరు..

మ్యాచ్ తొలి అర్ధభాగంలో ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు సాగింది. తొలి 44 నిమిషాల పాటు ఇరు జట్లూ ఒకరి డిఫెన్స్‌లోకి దూసుకెళ్లడంలో విఫలమయ్యాయి. ఫ్రాన్స్ 10 సార్లు గోల్‌ను టార్గెట్ చేస్తే, పోలాండ్ 8 సార్లు చేయగలిగింది. కానీ, ప్రథమార్ధం చివరి క్షణాల్లో ఒలివర్ గిరౌడ్ పోలాండ్ గోల్‌ను ఛేదించగలిగాడు. దీంతో ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో ఫ్రాన్స్ తరపున అత్యధిక గోల్స్ స్కోరర్‌గా నిలిచాడు. 90వ నిమిషం పూర్తయిన ఈ మ్యాచ్‌లో ఎంబాపే ఫ్రాన్స్‌కు మూడో గోల్‌ చేశాడు. ఈ మ్యాచ్‌లో రెండు గోల్స్ చేయడం ద్వారా, ఎంబాప్పే టోర్నమెంట్‌లో మొత్తం 5 గోల్స్‌తో గోల్డెన్ బూట్ పొందడానికి రేసులో ముందున్నాడు.

ఎంబాప్పే సరికొత్త రికార్డు..

ఎంబాప్పే ఫిఫా ప్రపంచ కప్ గోల్స్ సంఖ్య 9కి పెరిగింది. ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో 24 ఏళ్లలోపు 8 గోల్స్ చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..