ఫుట్ బాల్ మాంత్రికుడు డీగో మారడోనాను డాక్టర్లే చంపారని ఆయనకు వైద్యం చేసిన నర్సు తెలిపింది. వారి నిర్లక్ష్యం కారణంగానే ఆయన మృతి చెందాడని..ముఖ్యంగా ఆయన చివరి రోజుల్లో ఏ మాత్రం పట్టించుకోలేదని దహియానా గినెలా మాడ్రిడ్ అనే నర్సు తెలిపిందని ఆమె తరఫు లాయర్ వెల్లడించారు. తమను విచారిస్తున్న ప్రాసిక్యూటర్లకు ఆయన విషయాన్ని తెలియజేస్తూ..మారడోనా బ్రెయిన్ సర్జరీ నుంచి కోలుకున్నాక కూడా ఏ డాక్టరూ ఆయన ఆరోగ్య స్థితిని పరీక్షించలేదని తమ క్లయింటు చెప్పినట్ట్టు పేర్కొన్నారు. మారడోనా గత ఏడాది నవంబరులో తన 60 ఏళ్ళ వయస్సులో గుండెపోటుతో ఆర్జెంటీనా లోని ఆసుపత్రిలో మృతి చెందారు. గుండెజబ్బుతో బాధ పడుతున్న ఆయనకు అప్పట్లో సైకియాట్రిక్ చికిత్స కూడా అవసరమే అయిందని ఆ లాయర్ వెల్లడించారు.
హాస్పిటల్ లో ఆయన పడిపోయినప్పుడు మాడ్రిడ్ ఆయనకు వెంటనే సీఏటీ స్కాన్ చేయాలని చెప్పగా అక్కడే ఉన్న డాక్టర్.. అవసరం లేదని, జర్నలిస్టులు ఇది చూస్తే బాగుండదని అన్నాడని ఆమె వెల్లడించిందని ఆయన పేర్కొన్నారు. మారడోనా మృతి కేసులో ప్రాసిక్యూటర్లు ఏడుగురు నించితులను విచారిస్తున్నారు. వారిలో మాడ్రిడ్ కూడా ఒకరు. అయితే ఆమె తన తరఫున వాదించేందుకు లాయర్ ను నియమించుకుంది. ఏ డాక్టర్ కూడా మారడోనా మరణాన్ని ఆపలేకపోయారని,, అయన చివరి రోజుల్లో తానే ఆయన బెడ్ వద్ద ఉన్నానని తన క్లయింటు అయిన మాడ్రిడ్ చెప్పినట్టు ఆ న్యాయవాది వివరించారు.
కాగా మారడోనా సంతానంలో అయిదుగురు పిల్లలు ఇచ్చిన ఫిర్యాదును పురస్కరించుకుని ప్రాసిక్యూటర్లు ఆయన వ్యక్తిగత వైద్యునితో సహా ఈ ఏడుగురిని ప్రాసిక్యూట్ చేస్తున్నారు. వీరిని కోర్టు దోషులుగా ప్రకటించిన పక్షంలో 8 ఏళ్ళ నుంచి పాతికేళ్ల వరకు జైలు శిక్ష పడవచ్చు.
మరిన్ని ఇక్కడ చూడండి: గంగా నదిలో కొట్టుకొచ్చిన చెక్కపెట్టెలో చిన్నారి.!మహాభారతం నాటి సీన్ మళ్లీ రిపీట్..వైరల్ అవుతున్న వీడియో :viral video.