Gukesh: ప్రపంచ నంబర్ 1కు మరోసారి షాకిచ్చిన భారత యువ గ్రాండ్‌మాస్టర్.. లాస్ట్ మినిట్‌లో అదిరిపోయే స్కెచ్‌తో..

D Gukesh defeated World No. 1 Magnus Carlsen: గురువారం క్రొయేషియాలోని జాగ్రెబ్‌లో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ సూపర్ యునైటెడ్ రాపిడ్ 2025 ఆరో రౌండ్‌లో ప్రపంచ నంబర్ 1 మాగ్నస్ కార్ల్‌సెన్‌‌కు ఊహించని షాక్ తగలింది. డిఫెండింగ్ ప్రపంచ ఛాంపియన్ భారత ఆటగాడు డి. గుకేష్ చేతిలో ఓడిపోయాడు.

Gukesh: ప్రపంచ నంబర్ 1కు మరోసారి షాకిచ్చిన భారత యువ గ్రాండ్‌మాస్టర్.. లాస్ట్ మినిట్‌లో అదిరిపోయే స్కెచ్‌తో..
D Gukesh

Updated on: Jul 04, 2025 | 7:56 AM

D Gukesh Defeated World No. 1 Magnus Carlsen: చెస్ ప్రపంచంలో భారత యువ సంచలనం డీ. గుకేశ్ మరోసారి తన సత్తాను చాటాడు. ప్రపంచ నంబర్ 1 మాగ్నస్ కార్ల్‌సెన్‌ను ఓడించి సంచలనం సృష్టించాడు. గతంలో వీరి మధ్య జరిగిన మ్యాచ్‌లో కార్ల్‌సెన్ ఓటమిని జీర్ణించుకోలేక టేబుల్‌పై గట్టిగా చరిచి కోపాన్ని ప్రదర్శించిన సంఘటన అందరికీ తెలిసిందే. అయితే, ఈసారి అలాంటి దృశ్యాలు లేవు. గుకేశ్ గంభీరంగా, నిశ్శబ్దంగా తన విజయాన్ని సాధించాడు.

నార్వే చెస్ టోర్నమెంట్‌లో భాగంగా జరిగిన ఈ రౌండ్‌లో గుకేశ్ అద్భుతమైన వ్యూహంతో కార్ల్‌సెన్‌ను చిత్తు చేశాడు. ఆటలో ఒక దశలో కార్ల్‌సెన్ పైచేయి సాధిస్తున్నట్లు కనిపించినా, గుకేశ్ సంయమనం, వ్యూహాత్మక కదలికలు అతనికి విజయాన్ని అందించాయి. చివరి క్షణాల్లో ఆటను మలుపు తిప్పి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.

ఈ విజయం గుకేశ్ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలుస్తుంది. ఇది కార్ల్‌సెన్‌పై గుకేశ్‌కు క్లాసికల్ గేమ్‌లో మొదటి విజయం కావడం విశేషం. ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన తర్వాత కార్ల్‌సెన్‌ను ఓడించడం గుకేశ్ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. గుకేశ్ తన నిశ్శబ్ద ఆత్మవిశ్వాసం, తీవ్రమైన ఏకాగ్రతతో ఏం సాధించగలడో ప్రపంచానికి చూపించాడని విశ్లేషకులు ప్రశంసించారు.

గతంలో కార్ల్‌సెన్ ఓడిపోయినప్పుడు టేబుల్‌ను కొట్టడం, పావులు చెల్లాచెదురుగా పడటం వంటివి జరిగాయి. ఆ సంఘటనపై కార్ల్‌సెన్ తర్వాత పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. అయితే, ఈసారి గుకేశ్ గెలిచినప్పుడు, కార్ల్‌సెన్ సంయమనం పాటించడం విశేషం.

42వ స్థానంలో గుకేష్..


ఓడిపోయినప్పప్పటికీ, కార్ల్‌సెన్ అన్ని ఫార్మాట్లలో అత్యుత్తమ ఆటగాడిగా కొనసాగుతున్నాడు. అయితే గుకేష్ ర్యాపిడ్ ఫార్మాట్‌లో 42వ స్థానంలో ఉన్నాడు. ఈ యువ భారతీయుడు ఇప్పటివరకు ఈ ఈవెంట్‌లో అత్యుత్తమ ఆటగాడిగా కొనసాగుతున్నాడు.

ఆరు రౌండ్ల తర్వాత, గుకేష్ వరుసగా ఐదు విజయాలతో 10 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్నాడు. జాన్-క్రిజ్‌టాఫ్ డుడా ఎనిమిది పాయింట్లతో రెండవ స్థానంలో ఉండగా, వెస్లీ సో 7 పాయింట్లతో మూడవ స్థానంలో ఉన్నాడు. కార్ల్‌సెన్, మరో ఇద్దరు తలో 6 పాయింట్లు సాధించారు. రాపిడ్ ఈవెంట్ శుక్రవారం ముగుస్తుంది. ఇంకా మూడు రౌండ్లు మిగిలి ఉన్నాయి.

ఈ విజయం భారత చదరంగ రంగానికి, యువ క్రీడాకారులకు ఎంతో స్ఫూర్తినిస్తుంది. గుకేశ్ భవిష్యత్తులో మరిన్ని ఘనతలు సాధిస్తాడని, ప్రపంచ చదరంగంలో భారత జెండాను మరింత ఉన్నతంగా ఎగరేస్తాడని ఆశిద్దాం.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..