Asian Games 2022: క్రీడాకారులకు షాకిచ్చిన చైనా.. ఆసియా గేమ్స్ 2022 నిర్వహించలేమంటూ ప్రకటన.. ఎందుకంటే?

|

May 06, 2022 | 3:18 PM

ఆసియా క్రీడలు 2022 గురించి షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ గేమ్‌లను నిరవధికంగా వాయిదా వేసినట్లు చైనా మీడియా పేర్కొంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో హాంగ్‌జౌలో ఆసియా క్రీడలు జరగాల్సి ఉంది. కానీ..

Asian Games 2022: క్రీడాకారులకు షాకిచ్చిన చైనా..  ఆసియా గేమ్స్ 2022 నిర్వహించలేమంటూ ప్రకటన.. ఎందుకంటే?
Asian Games
Follow us on

ఆసియా క్రీడలు 2022(Asian Games 2022) గురించి షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ గేమ్‌లను నిరవధికంగా వాయిదా వేసినట్లు చైనా(China) మీడియా పేర్కొంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో హాంగ్‌జౌలో ఆసియా క్రీడలు జరగాల్సి ఉంది. కానీ, ఈ గేమ్స్ ప్రస్తుతం వాయిదా పడడంతో.. తదుపరి తేదీపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. క్రీడల నిర్వహణలో జాప్యానికి గల కారణాలను కూడా వెల్లడించలేదు. కానీ, చైనాలో పెరుగుతున్న కరోనా (Covid 19) కేసు దృష్ట్యా వాయిదా వేసినట్లు తెలుస్తోంది. చైనాలో పెరుగుతున్న కరోనా కేసు కారణంగా ఆసియా క్రీడలు వాయిదా పడినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరగాల్సిన ఈ ఈవెంట్ వాయిదా పడిన తర్వాత, మరలా ఎప్పుడు నిర్వహిస్తారో ఇంకా ప్రకటించలేదు. “ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా 19వ ఆసియా క్రీడలను చైనాలోని హాంగ్‌జౌలో సెప్టెంబర్ 10 నుంచి 25 వరకు నిర్వహించేందుకు సిద్ధమైంది. కానీ, చైనా ఈ క్రీడలను ప్రస్తుతానికైతే నిర్వహించలేమని ప్రకటించింది అంటూ చైనా మీడియా కూడా పలు వార్తలను వెల్లడించాయి. కాగా, వాయిదా ప్రకటించి తర్వాత ఈ ఆటల నిర్వహణ కోసం కొత్త తేదీలను తర్వలో వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.

హాంగ్‌జౌలో 2 వారాల పాటు లాక్‌డౌన్..

హాంగ్‌జౌలో ఆసియా క్రీడలు నిర్వహించనున్నారు. చైనాలోని అతిపెద్ద నగరమైన షాంఘై సమీపంలోనే ఇది ఉంది. ఈ నగరంలో కరోనాను నియంత్రించేందుకు ప్రభుత్వం 2 వారాల పాటు లాక్‌డౌన్ విధించింది. మొత్తం 56 క్రీడా వేదికలున్న హాంగ్‌జౌలో గత నెలలోనే స్పోర్ట్స్ కాంప్లెక్స్ పూర్తయిందని నిర్వాహకులు చెబుతున్నారు. ఆసియా క్రీడల తర్వాత ఆసియా పారా గేమ్స్ కూడా ఇక్కడే నిర్వహించనున్నారు.

ఈ ఏడాది 40 గేమ్స్ జరగనున్నాయి..

నివేదిక ప్రకారం, ఈ సంవత్సరం ఆసియా క్రీడలలో 40 క్రీడలు చేర్చారు. వాటిలో క్రికెట్ కూడా ఒకటి. ఈ 40 క్రీడాంశాల్లో మహిళలు, పురుషులు వేర్వేరు విభాగాల్లో మొత్తం 61 ఈవెంట్లు నిర్వహించాల్సి ఉంది. ఇందులో క్రికెట్ పునరాగమనం చేస్తుండగా, బ్రేక్ డ్యాన్స్, ఇ-స్పోర్ట్ మొదటిసారిగా ఆసియాడ్‌లో భాగమయ్యాయి. ఇవేకాకుండా అథ్లెటిక్స్, ఆర్చరీ, బ్యాడ్మింటన్, రెజ్లింగ్, బాక్సింగ్ వంటి క్రీడలు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలవనున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: IPL 2022 Purple Cap: చాహల్‌, కుల్దీప్ మధ్య ఒక వికెట్‌ మాత్రమే తేడా.. ఖలీల్‌ అహ్మద్‌ 3 వికెట్లు తీసినా రేసుకి దూరంగానే..!

IPL 2022: తల్లి ఇళ్లల్లో బట్టలు ఉతికి కష్టపడి పెంచింది.. ఇప్పుడు కొడుకు గొప్ప క్రికెటర్..!