Australian Open 2023: చరిత్ర సృష్టించిన సెర్బియా స్టార్‌.. పదోసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ను గెల్చుకున్న జకోవిచ్‌

సరిగ్గా ఒక ఏడాది క్రితం ఇదే గడ్డపై తీవ్ర అవమానాలు ఎదుర్కొన్నాడు జకోవిచ్‌. కరోనా టీకా తీసుకోలేదన్న కారణంతో ఈ టోర్నీలో పాల్గొనకుండా జకోవిచ్‌పై నిషేధం విధించారు. ఆ అవమానానికి ఇప్పుడు ప్రతీకారం తీర్చుకున్నాడు. రికార్డు స్థాయిలో పదోసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌ను గెల్చుకుని చరిత్ర సృష్టించాడు.

Australian Open 2023: చరిత్ర సృష్టించిన సెర్బియా స్టార్‌.. పదోసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ను గెల్చుకున్న జకోవిచ్‌
Novak Djokovic

Updated on: Jan 29, 2023 | 6:06 PM

ఆస్ట్రేలియా ఓపెన్‌-2023 పురుషుల సింగిల్స్‌ విజేతగా సెర్బియా సూపర్‌స్టార్‌ స్టార్‌ నోవాక్‌ జకోవిచ్‌ ఆవిర్భవించాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో గ్రీక్ ఆటగాడు స్టెఫనోస్ సిట్సిపస్‌పై 6-3,7-6(7/4),7-6(7/5) తేడాతో జకోవిచ్‌ విజయం సాధించాడు. జకోవిచ్‌ కెరీర్‌లో ఇది 10 ఆస్ట్రేలియా ఓపెన్‌ టైటిల్‌ కావడం విశేషం. ఈ విజయంతో 22 గ్రాండ్‌స్లామ్‌లతో స్పెయిన్‌ బుల్‌ రఫెల్‌ నాదల్‌ రికార్డును సమం చేశాడు జకోవిచ్‌. కాగా సరిగ్గా ఒక ఏడాది క్రితం ఇదే గడ్డపై తీవ్ర అవమానాలు ఎదుర్కొన్నాడు జకోవిచ్‌. కరోనా వ్యాక్సిన్‌ వ్యవహారం నేపథ్యంలో ఆస్ట్రేలియాకు వెళ్లి మరీ గతేడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ఆడకుండా వెనుదిరగాల్సి వచ్చింది. ఈ టోర్నీలో పాల్గొనకుండా జకోవిచ్‌పై నిషేధం విధించారు. ఆ అవమానానికి ఇప్పుడు ప్రతీకారం తీర్చుకున్నాడు. ఈసారి ఎలాంటి అడ్డంకులు లేకపోవడంతో తనదైన ఆటతీరును జకోవిచ్‌ ప్రదర్శించాడు. రికార్డు స్థాయిలో పదోసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌ను గెల్చుకుని చరిత్ర సృష్టించాడు. దీనికి తోడు టాప్‌ ఆటగాడు నాదల్ గాయం కారణంగా ఆరంభంలోనే ఇంటిముఖం పట్టడం కూడా జకోవిచ్‌కు కలిసొచ్చింది.

కాగా ఈ విజయంతో జకోవిచ్ మరోసారి రఫెల్ నాదల్‌ రికార్డును సమం చేశాడు జకోవిచ్.  నాదల్ ఖాతాలో ఇప్పటివరకు 22 పురుషుల సింగిల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో ముందున్నాడు.  ఇప్పుడు జకోవిచ్ కూడా 22వ టైటిల్‌తో నాదల్ స్థాయికి చేరుకున్నాడు. అయితే రాబోయే  ఫ్రెంచ్ ఓపెన్‌లో ఎవరో ఒకరు ఈ రికార్డును అధిగమించే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి