AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

News9 CBC 2025: న్యూస్9 కార్పొరేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌కు సర్వం సిద్ధం.. మ్యాచ్‌ల పూర్తి షెడ్యూల్ ఇదే..

భారతదేశంలోని నెంబర్ 1 నెట్‌వర్క్.. టీవీ9 నెట్‌వర్క్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.. ముఖ్యంగా దేశవ్యాప్తంగా క్రీడా కల్చర్‌ పెంపొందించడానికి కృషిచేస్తోంది.. గతేడాది కార్పొరేట్ ఫుట్‌బాల్ కప్‌ పోటీలను, ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ ను విజయవంతంగా నిర్వహించింది. అయితే.. ఈ ఏడాది న్యూస్9 కార్పొరేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ 2025ను నిర్వహించేందుకు సమయాత్తమవుతోంది..

News9 CBC 2025: న్యూస్9 కార్పొరేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌కు సర్వం సిద్ధం.. మ్యాచ్‌ల పూర్తి షెడ్యూల్ ఇదే..
News9 Corporate Badminton Championship 2025
Shaik Madar Saheb
|

Updated on: May 08, 2025 | 8:49 AM

Share

భారతదేశంలోని నెంబర్ 1 నెట్‌వర్క్.. టీవీ9 నెట్‌వర్క్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.. ముఖ్యంగా దేశవ్యాప్తంగా క్రీడా కల్చర్‌ పెంపొందించడానికి కృషిచేస్తోంది.. గతేడాది కార్పొరేట్ ఫుట్‌బాల్ కప్‌ పోటీలను, ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ ను విజయవంతంగా నిర్వహించింది. అయితే.. ఈ ఏడాది న్యూస్9 కార్పొరేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ 2025ను నిర్వహించేందుకు సమయాత్తమవుతోంది.. ఇందులో దేశ వ్యాప్తంగా ఉన్న కార్పొరేట్ ఉద్యోగులకు అవకాశాన్ని అందిస్తుది. ఈ టోర్నమెంట్‌ను దిగ్గజ మాజీ బ్యాడ్మింటన్ పుల్లెల గోపీచంద్ ఆధ్వర్యంలో జరగనుంది.. మే 9 నుంచి 11 వరకు హైదరాబాద్‌లోని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో 3 రోజుల పాటు న్యూస్9 కార్పొరేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ 2025 జరగనుంది.

న్యూస్9 CBC కి సంబంధించి ఇప్పటికే రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి.. షెడ్యూల్ కూడా వచ్చేసింది.. శుక్రవారం నుంచి న్యూస్9 కార్పొరేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ 2025 ప్రారంభం కానుంది. అయితే.. న్యూస్9 కార్పొరేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది.. పరిశ్రమలోని కొన్ని ప్రముఖ కార్పొరేట్‌ కంపెనీల నుండి ఉద్యోగుల రిజిస్ట్రేషన్లు వెల్లువెత్తాయి. డాక్టర్ రెడ్డీస్, మైక్రోసాఫ్ట్, యాక్సెంచర్, ఇన్ఫోసిస్, విప్రో, అమెజాన్, జెన్ ప్యాక్ట్, క్యాప్‌జెమిని, మరెన్నో కంపెనీలు బాగా ప్రాతినిధ్యం వహిస్తున్నాయి.. ఈ ఉత్తేజకరమైన ఈవెంట్ కోసం ప్రముఖ కార్పోరేట్ కంపెనీలు ఉత్సాహాన్ని ప్రదర్శిస్తుండటం విశేషం..

మే 9 నుండి మే 11, 2025 వరకు జరగనున్న ఈ ఛాంపియన్‌షిప్ కార్పోరేట్ కంపెనీ ఉద్యోగుల ప్రతిభను వెలికితీయడంతోపాటు – క్రీడా స్ఫూర్తిని చాటనుంది.

అధికారిక మ్యాచ్ షెడ్యూల్ విడుదల అయింది.. ఆటగాళ్లు తమ సంబంధిత మ్యాచ్‌లకు సిద్ధం కావడానికి సమయాన్ని తనిఖీ చేసుకోవచ్చు.. పూర్తి షెడ్యూల్‌ను ఈ కింద ఇచ్చిన లింకులో చూడండి..

న్యూస్9 మ్యాచ్ షెడ్యూల్ ను ఇక్కడ చెక్ చేసుకోండి..

ఈ ఈవెంట్ కేవలం పోటీని మించి, స్నేహాన్ని పెంపొందించడానికి, కార్పొరేట్ సంబంధాలను నిర్మించడానికి.. నిపుణులలో క్రీడా స్ఫూర్తిని జరుపుకోవడానికి ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తుంది. పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ, గచ్చిబౌలి, హైదరాబాద్ లో జరిగే.. న్యూస్ 9 కార్పొరేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. ఇది కార్పొరేట్ క్రీడలలో ఒక ల్యాండ్‌మార్క్ ఈవెంట్‌గా నిలిచిపోనుంది.