AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: ప్లే ఆఫ్స్‌ నుంచి CSK ఎలిమినేట్‌..! రిటైర్మెంట్‌పై తేల్చిపారేసిన ధోని.. ఏమన్నాడంటే..?

ఐపీఎల్‌ 2025లొ భాగంగా బుధవారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో మరోసారి చెన్నై ఓటమిని చవిచూసింది. ఈ ఓటమితో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు ఇక ఈసీజన్‌లో ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకున్నట్టే అని తెలుస్తోంది. ఈ తరుణంలో చెన్నై సూపర్ కింగ్స్ ఐదు ఐపీఎల్ టైటిళ్లను ఆందించిన ఎంఎస్ ధోని రిటైర్‌మెంట్‌ విషమంపై మరోసారి తెరపైకి వచ్చింది. అయితే బుధవారం మ్యాచ్‌ టాస్‌ సమయంలో రిటైర్మెంట్‌పై ధోని సడన్ షాక్ ఇచ్చాడు. తాను నెక్స్ట్ మ్యాచ్‌లో ఆడకపోవచ్చునంటూ అభిమానుల గుండెల్లో బాంబు పేల్చాడు. అసలు ధోని ఎందుకలా అన్నాడు. ఆయన మాట్లల్లో అర్థమెంటో తెలుసుకుందాం పదండి.

IPL 2025: ప్లే ఆఫ్స్‌ నుంచి CSK ఎలిమినేట్‌..! రిటైర్మెంట్‌పై తేల్చిపారేసిన ధోని.. ఏమన్నాడంటే..?
Ms Dhoni Retirement
Anand T
|

Updated on: May 01, 2025 | 10:47 AM

Share

సీఎస్‌కే అనగానే ఫస్ట్ గుర్తొచ్చే పేరు ఎంఎస్‌ ధోని. ఆయన గ్రౌండ్‌లోకి వచ్చారంటే చాలు, అరుపులు, కేకలతో గ్రౌండ్‌ మొత్తం మారుమోగాల్సిందే. చాలా వరకు ఫ్యాన్స్‌ కూడా ధోని బ్యాటింగ్ కోసం ఎదురుచూస్తుంటారు. మ్యాచ్ గెలిచినా ఓడినా..ధోని బ్యాటింగ్ ఆడితే చాలు అనుకుంటారు. ఇక ధోని కూడా వయస్సు మీద పడుతున్నా, శరీరం సహకరించక పోయినా ఫ్యాన్స్‌ కోసం ఇంకా ఆడుతూ వస్తున్నారు. అయితే ఐపీఎల్‌ సీజన్‌ ముగింపు దశకు వచ్చిందంటే చాలు.. ఇక ధోని రిటైర్మెంట్‌ విషయం ట్రెండింగ్‌లోకి వస్తుంది. అయితే ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్‌ రేసులో ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సీఎస్‌కే ఓటమి చవిచూసింది. చెన్నై ప్లేఆప్స్‌ రేసు నుంచి తప్పుకుంది. దీంతో ధోని తర్వాతి మ్యాచ్‌లు, తర్వాతి సీజన్‌ ఆడుతారా.. లేదా అనే చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. అయితే బుధవారం మ్యాచ్‌ టాస్‌ సమయంలో రిటైర్మెంట్‌పై ధోని సడన్ షాక్ ఇచ్చాడు. నువ్వు నెక్ట్స్‌ ఇయర్‌ కూడా చెపాక్‌కు వచ్చి ఆడుతావా అని కామెంటేటర్ అడిన ప్రశ్నకు.. ఎంఎస్‌ ధోని సమాధానం ఇస్తూ ..తాను నెక్స్ట్ ఇయర్ కాదు.. నెక్ట్స్‌ మ్యాచ్‌కే వస్తానో లేదో తెలియదంటూ అభిమానుల గుండెల్లో బాంబు పేల్చాడు.

అసలు ధోని ఏమన్నారు.

బుధవారం చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై -పంజామ్‌ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఇక మ్యాచ్‌కు ముందూ టాస్‌ వేసే సమయంలో ధోని మాట్లాడేందుకు వచ్చారు. ధోని రాగానే చెపాక్ స్టేడియం ఒక్కసారిగా దద్దరిల్లింది. ధోనిని చూసి సీఎస్‌కే ఫ్యాన్స్‌ అందరూ మాహి, మాహీ అంటూ కేకలు వేశారు. ఇక ఈ తరుణంలో కామెంటేటర్ ధోనికి ఓ ఆసక్తికరమైన ప్రశ్నవేశారు. మీరు నెక్ట్స్‌ సీజన్‌ కూడా ఇలానే చెపాక్‌ స్టేడియంకు వచ్చి ఆడతారా? అని అడిగారు. ఇక ఆయన ప్రశ్నకు సమాధానంగా ఇస్తూ..ధోని ఇలా అన్నారు. నెక్స్ట్ ఇయర్ కాదుకదా.. నెక్స్ట్ మ్యాచ్‌కే వస్తానో.. లేదో నాకు కూడా తెలియదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. దీని సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇక ఈ వీడియో చూసిన ఫ్యాన్స్‌ ధోని నెక్ట్స్‌ మ్యాచ్‌ అడుతారా లేదా అనే దైలమాలో పడ్డారు. అయితే ధోని నవ్వుతూ మాట్లాడారు కాబట్టి.. ఇది జోక్‌ అయి ఉంటుందిలే అని కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.

మరిన్ని ఐపీఎల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..