AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: ఇదెక్కడి మాస్‌ రా మామ.. బౌండరీ లైన్‌ వద్ద గాలిలో విన్యాసాలు.. కళ్లు చెదిరే క్యాచ్‌ పట్టిన చెన్నై ఆటగాడు!

ఐపీఎల్‌ 2025 సీజన్‌లో భాగంగా బుధవారం జరిగిన చెన్నై వర్సెస్‌ పంజాబ్ కింగ్స్‌ మ్యాచ్‌లో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. చెన్నై ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్ గాలిలో విన్యాసాలు చేశాడు. 18వ ఓవర్లో జడేజా బౌలింగ్‌లో పంజాబ్‌ బ్యాటర్‌ భారీ షాట్‌ కొట్టిన బంతిని సిక్స్‌ పోనివ్వకుండా ఒడిసిపట్టుకున్నాడు. రెండుసార్లు బౌండరీ లైన్‌ దాటి మరీ బంతిని గాల్లోకి ఎగురవేస్తూ కళ్లు చెదిరే క్యాచ్‌ పట్టి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు.

IPL 2025: ఇదెక్కడి మాస్‌ రా మామ.. బౌండరీ లైన్‌ వద్ద గాలిలో విన్యాసాలు.. కళ్లు చెదిరే క్యాచ్‌ పట్టిన చెన్నై ఆటగాడు!
Dewald Brevis
Anand T
|

Updated on: May 01, 2025 | 9:28 AM

Share

ఐపీఎల్‌ 2025 సీజన్‌లో భాగంగా బుధవారం జరిగిన చెన్నై వర్సెస్‌ పంజాబ్ కింగ్స్‌ మ్యాచ్‌లో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఈ మ్యాచ్‌లో చెన్నై ప్లేయర్ డెవాల్డ్ బ్రెవిస్ అలియాస్ జూనియర్ ఏబీడీగా పిలిచే ఈ సౌతాఫ్రికా ప్లేయర్..గాలిలో విన్యాసాలు చేస్తూ.. తన ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఇక ఈ సీజన్‌లో ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే చెన్నై సూపర్‌ కింగ్స్‌ తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో డెవాల్డ్ బ్రెవిస్ అద్భుతం సృష్టించాడు. జట్టు వరుస ఓటములతో నిరాశలో ఫ్యాన్స్‌కు తన అద్భుత ప్రదర్శనతో ఉత్సాహాన్ని ఇచ్చాడు. శశాంక్ సింగ్ కొట్టిన బంతిని సిక్స్‌ పోనివ్వకుండా ఒడిసిపట్టుకున్నాడు. అతను పట్టి క్యాచ్‌ను చూస్తే.. వావ్‌ ఇది అబ్భుతం అనాల్సిందే.

చెన్నై వేదికగా పంజాబ్‌ వర్సెస్ చెన్నై మధ్య జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసి 191 పరుగుల విజయలక్ష్యాన్ని పంజాబ్‌ ముందు ఉంచింది చెన్నై సూపర్‌ కింగ్స్‌.. ఇక 191 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి పంజాబ్‌ కింగ్స్‌ జట్టు బరిలోకి దిగింది. పంజాబ్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌ కొనసాగుతోంది. ఈ వోవర్‌లో చెన్నై బౌలర్ జడేజా వేసిన బంతిని బ్యాటర్ సిక్సర్‌గా మలిచేందుకు భారీ షాట్ ఆడాడు. అయితే, బాల్ బౌండరీ వద్ద నిల్చున్న డెవాల్డ్ బ్రెవిస్‌ వద్దకు వచ్చింది. ఇక అతను గాలిలో విన్యాసాలు చేస్తూ.. ఆశ్చర్యకరమైన రీతిలో బాల్‌ను పట్టుకున్నాడు. పంజాబ్‌ బ్యాటర్ శశాంక్ సింగ్ కొట్టిన బంతి గాలిలోకి లేచి, బౌండరీ లైన్‌ దాటి వెళ్లడం కనిపించింది. బౌండరీ వద్ద నిలబడిన బ్రెవిస్ బంతిని గమనించాడు. దాన్ని సిక్స్‌ పోనివ్వకుండా ఒడిసిపట్టుకున్నారు. రెండుసార్లు బౌండరీ లైన్‌ దాటి మరీ బంతిని గాల్లోకి ఎగురవేస్తూ కళ్లు చెదిరే క్యాచ్‌ పట్టి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. దీంతో సిక్స్‌ పోతుందనుకున్న బంతిని బ్రెవిస్ క్యాచ్‌ పట్టి ఔట్‌ చేయడంతో.. బ్యాటర్‌ షాకవుతూ పెవిలియన్ చేరాడు.

బ్రెవిస్ తన అద్భుతమైన ఫీల్డింగ్‌తో కళ్లు చెదిరే క్యాచ్‌ పట్టి.. జట్టు వరుస ఓటములను చూసి నిరాశలో ఉన్న అభిమానుల్లో ఉత్సాహం నింపాడు. బ్రెవిస్ పట్టిన క్యాచ్‌ చూసి స్టేడియంలో ఉన్న చెన్నై ఫ్యాన్స్‌ మొత్తం కేకలు వేశారు. ఇక బ్రెవిస్‌ క్యాచ్‌ పట్టిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నారు. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్‌ అందరూ.. కళ్లు చెదిరేలా ఉంది వర్మా అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ చెన్నై 4వికెట్ల తేదాతో విజయం సాధించింది. ఇక ఓటమితో చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్ రేసు నుంచి వైదొలిగినట్లైంది.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!