ఆఫ్టర్ రిటైర్మెంట్.. ధోని ఓ పెయింటర్!

2019 ప్రపంచకప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి భారత మాజీ సారధి, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ ప్రకటించనున్నాడని వార్తలు వచ్చాయి. ఇక దీనిపై పెద్ద చర్చ కూడా జరిగింది. ఇక తాజాగా అతడికి సంబంధించిన ఓ వీడియో ఈ చర్చకు ఊతమిస్తూ ఆన్లైన్ లో చక్కర్లు కొడుతోంది. అందులో ధోనీ మాట్లాడుతూ.. తన గురించి ఎవరికీ తెలియని ఓ  రహస్యాన్ని వెల్లడించాడు. అదేంటంటే తాను స్వయంగా గీసిన పెయింటింగ్స్‌ను అభిమానులకు పరిచయం చేశాడు. […]

ఆఫ్టర్ రిటైర్మెంట్.. ధోని ఓ పెయింటర్!

Updated on: May 22, 2019 | 11:58 AM

2019 ప్రపంచకప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి భారత మాజీ సారధి, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ ప్రకటించనున్నాడని వార్తలు వచ్చాయి. ఇక దీనిపై పెద్ద చర్చ కూడా జరిగింది. ఇక తాజాగా అతడికి సంబంధించిన ఓ వీడియో ఈ చర్చకు ఊతమిస్తూ ఆన్లైన్ లో చక్కర్లు కొడుతోంది. అందులో ధోనీ మాట్లాడుతూ.. తన గురించి ఎవరికీ తెలియని ఓ  రహస్యాన్ని వెల్లడించాడు. అదేంటంటే తాను స్వయంగా గీసిన పెయింటింగ్స్‌ను అభిమానులకు పరిచయం చేశాడు.

ధోనీ ఆ వీడియోలో మాట్లాడుతూ ‘మీ అందరికీ తెలియని ఓ విషయం చెప్పాలనుకుంటున్నా. నేను పాఠశాలలో చదువుకునే రోజుల్లోనే ఒక కళాకారుడిని కావాలనుకున్నా. ఇప్పటికే క్రికెట్‌ ఆడాను.. ఇక నా కల సాకారం చేసుకునే సమయం ఆసన్నమైంది. కాబట్టి నేను గీసిన కొన్ని పెయింటింగ్స్‌ మీకు పరిచయం చేయాలనుకుంటున్నా’ అని చెప్పుకొచ్చాడు. కాగా, ధోనీ చూపించిన మూడు పెయింటింగ్స్‌లో మొదటిది ల్యాండ్‌స్కేప్‌ కాగా… రెండోది భవిష్యత్‌లో రవాణాకి ఉపయోగించే ఓ విమానం.. ఇక మూడోది తన నమూనా చిత్రమని చెప్పుకొచ్చాడు. ఇక రిటైర్మెంట్ తర్వాత మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనిలో ఉన్న కళాత్మకతను మనం చూడవచ్చు.