ధోనీకి ఆస్ట్రేలియా ఆటగాడి మద్దతు

| Edited By: Srinu

Mar 06, 2019 | 7:48 PM

విశాఖ: భారత పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా జట్టు తొలి టీ20 మ్యాచ్‌లో కోహ్లీ సేనను ఓడించింది.  తొలి బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 127 పరుగులు మాత్రమే చేసింది. అయితే ఈ తక్కువ స్కోర్‌కు పలువురు ధోనీపై విమర్శలు చేస్తున్నారు. అందుకు కారణం ధోనీ ఆటతీరే. అందరూ ఔటౌతున్నా క్రీజ్‌లో ధోనీ నిలదొక్కుకున్నాడు. కానీ చాలా నిదానంగా ఆడాడు. మరొకొన్ని పరుగులు చేసి ఉంటే భారత్ గెలిచి ఉండేది. చివరి ఓవర్‌లో 14 […]

ధోనీకి ఆస్ట్రేలియా ఆటగాడి మద్దతు
Follow us on

విశాఖ: భారత పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా జట్టు తొలి టీ20 మ్యాచ్‌లో కోహ్లీ సేనను ఓడించింది.  తొలి బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 127 పరుగులు మాత్రమే చేసింది. అయితే ఈ తక్కువ స్కోర్‌కు పలువురు ధోనీపై విమర్శలు చేస్తున్నారు. అందుకు కారణం ధోనీ ఆటతీరే. అందరూ ఔటౌతున్నా క్రీజ్‌లో ధోనీ నిలదొక్కుకున్నాడు. కానీ చాలా నిదానంగా ఆడాడు. మరొకొన్ని పరుగులు చేసి ఉంటే భారత్ గెలిచి ఉండేది. చివరి ఓవర్‌లో 14 పరుగులు చేసి ఆసిస్ గెలిచింది.

చివరి రెండు బంతుల్లో అయితే 6 పరుగులు చేసి గెలవగలిగారు. అలాంటిది టీ20ల్లో వేగంగా ఆడాల్సింది పోయి ధోనీ 37 బంతుల్లో 29 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో మహీపై విమర్శలు మొదలయ్యాయి. అయితే మహీకి ఆస్ట్రేలియా ఆటగాడు మాక్స్‌వెల్ మాత్రం మద్దతుగా నిలిచాడు. విశాఖ పిచ్‌పై బంతులు చాలా తక్కువ ఎత్తులో వస్తున్నాయి. అలాంటి పరిస్థితిలో ధోనీనే కాదు ఎవరైనా ఇబ్బంది పడక తప్పదు.

కఠిన పరిస్థితుల్లో సైతం ధోనీ బాగా ఆడాడని మాక్స్‌వెల్ చెప్పాడు.  ధోనీ ప్రపంచంలోనే నెంబర్ వన్ ఫినిషర్. మంచి రన్‌రేట్‌నే కొనసాగించాడని మద్దతుగా నిలిచాడు. అయితే ఇలాంటి పిచ్‌పై భారత బౌలర్లు బూమ్రా, కృనాల్ పాండ్యా వంటి వారిని ఎదుర్కోవడం మాత్రం కష్టమే. ఎందుకంటే వాళ్లు లో బంతులు బాగా వేయగలరు. అందులోనూ లైన్ అండ్ లెంగ్త్‌ను వాళ్లు పర్‌ఫెక్ట్‌గా ఫాలో అవుతారని మాక్స్‌వెల్ చెప్పాడు.