MS Dhoni: మళ్లీ అభిమానుల మనసు గెల్చుకున్న ఎం.ఎస్‌.ధోని.. పాక్‌ క్రికెటర్‌కు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ పంపిన టీమిండియా మాజీ కెప్టెన్‌..

|

Jan 07, 2022 | 9:13 PM

మహేంద్రసింగ్‌ ధోనీ.. కెప్టెన్‌గా, ఆటగాడిగా టీమిండియాకు ఎన్నో మరుపురాని విజయాలు అందించిన ఇతని గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కేవలం ఆటతోనే కాకుండా తోటి క్రికెటర్లు, ఇతర జట్ల ఆటగాళ్లతో అతను వ్యవహరించే

MS Dhoni: మళ్లీ అభిమానుల మనసు గెల్చుకున్న ఎం.ఎస్‌.ధోని.. పాక్‌ క్రికెటర్‌కు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ పంపిన టీమిండియా మాజీ కెప్టెన్‌..
Follow us on

మహేంద్రసింగ్‌ ధోనీ.. కెప్టెన్‌గా, ఆటగాడిగా టీమిండియాకు ఎన్నో మరుపురాని విజయాలు అందించిన ఇతని గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కేవలం ఆటతోనే కాకుండా తోటి క్రికెటర్లు, ఇతర జట్ల ఆటగాళ్లతో అతను వ్యవహరించే తీరుతో కోట్లాది మంది అభిమానుల మనసులు గెల్చుకున్నాడీ జార్ఖండ్‌ డైనమైట్‌. తాజాగా ఈ విషయం మరోసారి నిరూపితమైంది. పాకిస్తాన్‌ స్టార్‌ పేసర్‌ హ్యారిస్‌ రవూఫ్‌కు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ పంపించాడు. తన సంతకంతో కూడిన జెర్సీని రవూఫ్‌కు పంపి అతడిని సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాడు ధోని. ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ క్రికెట్‌లో రాణిస్తోన్న పాక్‌ యంగ్‌ క్రికెటర్‌కు ఓ దిగ్గజ ఆటగాడు జెర్సీ పంపించాడంటే మామూలు విషయమేమీ కాదు. అందుకే తన సంతోషాన్ని సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నాడు.

మా కెప్టెన్‌ మాటిస్తే..తప్పడంతే..
‘ క్రికెట్‌ దిగ్గజం.. కెప్టెన్‌ కూల్‌ ఎంఎస్‌ ధోని ఈ అందమైన బహుమతిని నాకు పంపించాడు. తన షర్టు ఇది. తన మంచి మనసుతో నెంబర్‌ ‘7’ ఇంకా హృదయాలను కొల్లగొడుతూనే ఉన్నాడు’ అంటూ ధోనిపై తన అభిమానం చాటుకున్నాడు రవూఫ్‌. కాగా ఇందుకు స్పందించిన చెన్నై సూపర్‌ కింగ్స్‌( సీఎస్‌కే) మేనేజర్‌ రసెల్‌ రాధాకృష్ణన్‌.. ‘మా కెప్టెన్‌ మాట ఇచ్చాడంటే.. తప్పక నెరవేరుస్తాడు’ అని తమ సారథిపై ప్రశంసలు కురిపించాడు. కాగా ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న ధోని 2021లో చెన్నైను ఛాంపియన్‌గా నిలిపిన సంగతి తెలిసిందే. ఇక దుబయిలో నిర్వహించిన టీ20 ప్రపంచకప్‌ 2021 సందర్భంగా టీమిండియాకు మెంటార్‌గా వ్యవహరించాడు ధోని. ఆ టోర్నీలో భారత్‌తో పాకిస్తాన్‌ మ్యాచ్‌ ముగిసిన తర్వాత దాయాది జట్టు ఆటగాళ్లతో కాసేపు ముచ్చటించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Also Read:

Coronavirus: తెలంగాణలో కోరలు చాస్తోన్న కరోనా.. హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు.. 24 గంటల్లో ఏకంగా..

Deepthi Sunaina: నేను ఒంటరిని కాదు.. తండ్రితో ఎమోషనల్‌ వీడియోను షేర్‌ చేసిన దీప్తి సునయన..

Coronavirus: ఒమిక్రాన్‌పై ఆందోళన అవసరం లేదు.. ఇంటి నుంచే సాధారణ చికిత్స తీసుకుంటే బయటపడవచ్చు: దక్షిణఫ్రికా మెడికల్‌ అసోసియేషన్‌ ఛైర్‌పర్సన్‌