Kyle Jamieson IPL Auction 2021: అనుకున్నట్లుగానే జరిగింది. న్యూజిలాండ్ యువ ఆల్‌రౌండర్ కైల్ జేమిసన్ కోసం ఫ్రాంచైజీలు పోటీపడ్డారు. 75 లక్షల బేస్ ప్రైస్‌తో మొదలైన జేమిసన్ బిడ్ రూ. 15 కోట్ల దగ్గర ముగిసింది. భారీ మొత్తానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ యువ ఆటగాడిని సొంతం చేసుకుంది. వన్డేలు, టెస్టులు, టీ20లు అని తేడా లేకుండా జేమిసన్ అద్భుతంగా రాణిస్తున్నాడు. మరి ఐపీఎల్‌లో ఎలా రాణిస్తాడో వేచి చూడాలి. కాగా, ఈ ఐపీఎల్ మినీ వేలంలో అనూహ్యంగా అపార అనుభవం ఉన్న సీనియర్ ఆటగాళ్లకు ఎదురుదెబ్బ తగలగా.. యువ కెరటాలు, స్టార్ ప్లేయర్స్‌పై ఫ్రాంచైజీలు గురి సాధించాయి.
అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు వీరే…
- గ్లెన్ మ్యాక్స్‌వెల్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(రూ.14.25 కోట్లు)
- క్రిస్ మోరిస్ – రాజస్థాన్ రాయల్స్(రూ.16.25 కోట్లు)
- జహ్య్ రిచర్డ్‌సన్ – పంజాబ్ కింగ్స్(రూ.14 కోట్లు)
- మొయిన్ అలీ – చెన్నై సూపర్ కింగ్స్(రూ. 7 కోట్లు)
- నాథన్ కౌల్టర్‌నైల్ – ముంబై ఇండియన్స్(రూ.5 కోట్లు)
- కృష్ణప్ప గౌతమ్ – చెన్నై సూపర్ కింగ్స్(రూ. 9.25 కోట్లు)
- టామ్ కరన్ – ఢిల్లీ క్యాపిటల్స్(రూ. 5.25 కోట్లు)
- షారుఖ్ ఖాన్ – పంజాబ్ కింగ్స్(రూ.5.25 లక్షలు)
- శివమ్ దూబే – రాజస్థాన్ రాయల్స్(రూ. 4.40 కోట్లు)
- మెరెడిత్ – పంజాబ్ కింగ్స్(రూ. 8 కోట్లు)
- జేమిసన్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(రూ. 15 కోట్లు)
- శివమ్ దూబే – రాజస్థాన్ రాయల్స్(రూ. 4.40 కోట్లు)
- ఆడమ్ మిలన్- ముంబై ఇండియన్స్(రూ.3.20 కోట్లు)
- షకిబుల్ హాసన్ – కోల్‌కతా నైట్ రైడర్స్(రూ.3.20 కోట్లు)
- పీయూష్ చావ్లా – ముంబై ఇండియన్స్(రూ. 2.40 కోట్లు)
- స్టీవ్ స్మిత్ – ఢిల్లీ క్యాపిటల్స్ (రూ. 2.20 కోట్లు)
- హెన్రికస్ – పంజాబ్ కింగ్స్ (రూ. 4.20 కోట్లు)