సియట్ క్రికెట్ రేటింగ్స్(CCR) అంతర్జాతీయ అవార్డులు!

సియట్ క్రికెట్ రేటింగ్స్(CCR) అంతర్జాతీయ అవార్డుల్లో భాగంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు. బెస్ట్ బ్యాట్స్‌మెన్‌ అవార్డు కూడా కోహ్లికే దక్కింది. ఇంటర్నేషనల్ బెస్ట్ బౌలర్ ఆఫ్ ది ఇయర్‌గా జస్ప్రీత్ బుమ్రా ఎంపికయ్యాడు. భారత మాజీ క్రికెటర్ మొహిందర్ అమర్‌నాథ్‌కు లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డును ప్రకటించారు. ఆస్ట్రేలియా గడ్డ మీద జరిగిన టెస్టు సిరీస్‌లో అద్భుతంగా రాణించిన ఛటేశ్వర్ పుజారా ఇంటర్నేషనల్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ […]

సియట్ క్రికెట్ రేటింగ్స్(CCR) అంతర్జాతీయ అవార్డులు!

Edited By:

Updated on: May 14, 2019 | 6:15 PM

సియట్ క్రికెట్ రేటింగ్స్(CCR) అంతర్జాతీయ అవార్డుల్లో భాగంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు. బెస్ట్ బ్యాట్స్‌మెన్‌ అవార్డు కూడా కోహ్లికే దక్కింది. ఇంటర్నేషనల్ బెస్ట్ బౌలర్ ఆఫ్ ది ఇయర్‌గా జస్ప్రీత్ బుమ్రా ఎంపికయ్యాడు. భారత మాజీ క్రికెటర్ మొహిందర్ అమర్‌నాథ్‌కు లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డును ప్రకటించారు.

ఆస్ట్రేలియా గడ్డ మీద జరిగిన టెస్టు సిరీస్‌లో అద్భుతంగా రాణించిన ఛటేశ్వర్ పుజారా ఇంటర్నేషనల్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును సొంతం చేసుకోగా.. రోహిత్ శర్మ ఇంటర్నేషనల్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపికయ్యాడు. కుల్దీప్ యాదవ్ ఔట్‌స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఇయర్‌గా నిలవగా.. స్మృతి మంధన ఇంటర్నేషనల్ ఉమెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైంది.

ఇంటర్నేషనల్ టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా ఆరోన్ ఫించ్, ఇంటర్నేషనల్ టీ20 బౌలర్ ఆఫ్ ది ఇయర్‌గా రషీద్ ఖాన్, డొమెస్టిక్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా అశుతోష్ అమన్ ఎంపికయ్యారు.