స్మిత్‌ను అడ్డుకునేది ఆర్చర్ ఒక్కడే – వార్న్

యాషెస్‌లో స్టీవ్‌స్మిత్‌ బ్యాటింగ్‌కు కళ్లెం వేయడం ఇంగ్లాండ్‌ పేసర్‌ జోఫ్రాఆర్చర్‌కు మాత్రమే సాధ్యమని ఆసీస్ దిగ్గజం షేన్‌వార్న్‌ అభిప్రాయపడ్డాడు. లార్డ్స్‌ మైదానంలో జరగబోయే రెండో టెస్టుకు ఇంగ్లాండ్‌ జట్టు శుక్రవారం 12 మంది సభ్యల పేర్లను ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆర్చర్‌ రెండో టెస్టులో అరంగేట్రం చేసే అవకాశం ఉంది. కాగా ఆసీస్‌ బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌స్మిత్‌ తొలి మ్యాచ్‌లో 144, 142 వరుస శతకాలు బాది ఆసీస్‌ను 251 పరుగుల భారీ తేడాతో గెలిపించాడు. బాల్‌ టాంపరింగ్‌ […]

స్మిత్‌ను అడ్డుకునేది ఆర్చర్ ఒక్కడే - వార్న్
Follow us

| Edited By:

Updated on: Aug 10, 2019 | 4:30 PM

యాషెస్‌లో స్టీవ్‌స్మిత్‌ బ్యాటింగ్‌కు కళ్లెం వేయడం ఇంగ్లాండ్‌ పేసర్‌ జోఫ్రాఆర్చర్‌కు మాత్రమే సాధ్యమని ఆసీస్ దిగ్గజం షేన్‌వార్న్‌ అభిప్రాయపడ్డాడు. లార్డ్స్‌ మైదానంలో జరగబోయే రెండో టెస్టుకు ఇంగ్లాండ్‌ జట్టు శుక్రవారం 12 మంది సభ్యల పేర్లను ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆర్చర్‌ రెండో టెస్టులో అరంగేట్రం చేసే అవకాశం ఉంది. కాగా ఆసీస్‌ బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌స్మిత్‌ తొలి మ్యాచ్‌లో 144, 142 వరుస శతకాలు బాది ఆసీస్‌ను 251 పరుగుల భారీ తేడాతో గెలిపించాడు. బాల్‌ టాంపరింగ్‌ వివాదంలో ఏడాది పాటు ఆటకు దూరమైన అతడు తిరిగి ఈ మ్యాచ్‌తోనే టెస్టుల్లో ఘనంగా పునరాగమనం చేశాడు.

మరోవైపు తొలి టెస్టులో గాయపడిన ఇంగ్లాండ్‌ పేసర్‌ అండర్సన్‌కి బదులు జోఫ్రాఆర్చర్‌ని రెండో టెస్టుకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా రాజస్థాన్‌ రాయల్స్‌ మెంటార్‌ షేన్‌వార్న్‌ మాట్లాడుతూ‌.. ‘యాషెస్‌లో స్టీవ్‌స్మిత్‌ ఇప్పటికే తన అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు జోఫ్రాఆర్చర్‌ ఇంగాండ్‌ జట్టులో చేరడంతో స్మిత్‌కు పెద్దసవాల్‌గా మారే అవకాశం ఉంది. అయితే ఈ సిరీస్‌లో ఆడే ప్రతీ ఇన్నింగ్స్‌లో స్మిత్‌ శతకం సాధించాలని కోరుకుంటా. జోఫ్రా రాకతో ఇంగ్లాండ్‌ జట్టు బలంగా మారొచ్చు. కాగా ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ తరఫున ఆడిన వీరిద్దరూ(స్మిత్‌, ఆర్చర్‌) నెట్స్‌లో సాధన చేసిన అనుభవం ఉంది. ఈ నేపథ్యంలో స్మిత్‌ను అడ్డుకునేందుకు ఆర్చర్‌కే ఎక్కువ అవకాశాలు ఉంటాయి’ అని చెప్పుకొచ్చాడు.