అశ్విన్ రికార్డును బ్రేక్ చేసిన బుమ్రా..

| Edited By:

Aug 24, 2019 | 12:20 PM

టీమిండియా పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా మరో రికార్డు సాధించాడు. టెస్టు క్రికెట్ ఫార్మాట్‌లో అతి తక్కువ బంతుల్లో యాభై వికెట్లు సాధించిన భారత బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఈ ఘనత సాధించాడు.ఈ క్రమంలోనే రవిచంద్రన్‌ అశ్విన్‌ రికార్డును బుమ్రా బ్రేక్‌ చేశాడు. విండీస్‌ ఆటగాడు డారెన్‌ బ్రేవో వికెట్‌ను తీయడం ద్వారా టెస్టు క్రికెట్‌లో 50వ వికెట్‌ మార్కును చేరాడు. బుమ్రాకు 2,465 బంతులు 50 వికెట్లు తీయగా.. అశ్విన్‌ 2,597 […]

అశ్విన్ రికార్డును బ్రేక్ చేసిన బుమ్రా..
Follow us on

టీమిండియా పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా మరో రికార్డు సాధించాడు. టెస్టు క్రికెట్ ఫార్మాట్‌లో అతి తక్కువ బంతుల్లో యాభై వికెట్లు సాధించిన భారత బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఈ ఘనత సాధించాడు.ఈ క్రమంలోనే రవిచంద్రన్‌ అశ్విన్‌ రికార్డును బుమ్రా బ్రేక్‌ చేశాడు. విండీస్‌ ఆటగాడు డారెన్‌ బ్రేవో వికెట్‌ను తీయడం ద్వారా టెస్టు క్రికెట్‌లో 50వ వికెట్‌ మార్కును చేరాడు. బుమ్రాకు 2,465 బంతులు 50 వికెట్లు తీయగా.. అశ్విన్‌ 2,597 బంతుల 50 వికెట్లు తీసి ఇప్పటివరకూ అగ్రస్థానంలో కొనసాగాడు. అంతేకాకుండా టెస్టుల పరంగా చూసినా కూడా 50 వికెట్లను వేగవంతంగా సాధించిన బౌలర్‌గా బుమ్రా రికార్డు సాధించాడు. ఇప్పటివరకూ వెంకటేష్‌ ప్రసాద్‌, మహ్మద్‌ షమీ పేరిట ఉన్న ఈ రికార్డు ఉండగా, దాన్ని సైతం బుమ్రా బద్ధలు కొట్టాడు. వీరిద్దరూ 13వ టెస్టులో 50వ టెస్టు వికెట్‌ను సాధించగా, బుమ్రా 11వ టెస్టులో దాన్ని బ్రేక్‌ చేయడం ఇక్కడ మరో విశేషం.