మరో రికార్డు సాధించిన బుమ్రా..
వెంస్టీడీస్‌తో జరుగుతున్న టెస్ట్ సీరీస్‌లో భారత క్రికెటర్లు రికార్డులను బ్రేక్ చేస్తున్నారు. భారత ఫాస్ట్ బౌలర్ బుమ్రా కూడా రికార్డులను తిరగరాస్తున్నాడు. తాజాగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో బుమ్రా నిప్పులు చెరుగుతూ బంతులు విసిరాడు. ఈ రాకెట్లాంటి బంతులకు విండీస్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్ దారిపట్టారు. వరుస మూడు బంతుల్లో మూడు వికెట్లు తీసి హ్యాట్రిక్ సాధించాడు. తొమ్మిదో ఓవర్‌లో రెండో బంతికి నాలుగు పరుగులు చేసిన డారెన్ బ్రావోను ఔట్ చేశాడు. బుమ్రా వేసిన బంతిని […]

వెంస్టీడీస్‌తో జరుగుతున్న టెస్ట్ సీరీస్‌లో భారత క్రికెటర్లు రికార్డులను బ్రేక్ చేస్తున్నారు. భారత ఫాస్ట్ బౌలర్ బుమ్రా కూడా రికార్డులను తిరగరాస్తున్నాడు. తాజాగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో బుమ్రా నిప్పులు చెరుగుతూ బంతులు విసిరాడు. ఈ రాకెట్లాంటి బంతులకు విండీస్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్ దారిపట్టారు. వరుస మూడు బంతుల్లో మూడు వికెట్లు తీసి హ్యాట్రిక్ సాధించాడు. తొమ్మిదో ఓవర్‌లో రెండో బంతికి నాలుగు పరుగులు చేసిన డారెన్ బ్రావోను ఔట్ చేశాడు. బుమ్రా వేసిన బంతిని బ్రావో బ్యాట్‌ను టచ్ చేస్తూ.. స్లిప్‌లో ఉన్న కేఎల్ రాహుల్ చేతిలో పడింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బ్రూక్స్.. డక్ అవుటయ్యాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన చేజ్ కూడా పరుగులేమీ చేయకుండా ఎల్బీ ఔట్ అయ్యాడు. ఇలా వరుసగా 9వ ఓవర్లో 3,4,5, బంతులకు వరుస వికెట్లు తీసి హ్యాట్రిక్ సాధించాడు. అంతేకాదు అంతకు ముందు వేసిన ఏడో ఓవర్‌లో కూడా ఓపెనర్ క్యాంప్‌బెల్‌ను రెండు పరుగులకే బుమ్రా పెవిలియన్‌కు పంపాడు. తక్కువ పరుగుల వ్యవధిలోనే విండీస్ నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
హ్యాట్రిక్ సాధించిన బుమ్రా.. రికార్డుల్లో నిలిచాడు. టెస్టు క్రికెట్‌లో భారత్ తరఫున బుమ్రా సాధించిన ఈ హ్యాట్రిక్ మూడోది. అంతకుముందు 2001లో స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆస్ట్రేలియాపై హ్యాట్రిక్ నమోదు చేయగా.. 2006లో ఇర్ఫాన్ పఠాన్ పాక్‌పై హ్యాట్రిక్ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. మళ్లీ 13 ఏళ్ల తర్వాత తాజాగా బుమ్రా ఈ ఘనత అందుకున్నాడు.