రాణించిన భారత్…బుమ్రా హ్యాట్రిక్… విండీస్ 87/7

రాణించిన భారత్...బుమ్రా హ్యాట్రిక్... విండీస్ 87/7

విండీస్‌తో జరుగుతున్న టెస్టులో భారత్ భారీ స్కోరు చేసింది. తెలుగు తేజం హనుమ విహారి (225 బంతుల్లో 111 బ్యాటింగ్; 16 ఫోర్లు) అజేయ శతకంతో కదంతొక్కడంతో కడపటి వార్తలందేసరికి టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 140.1 ఓవర్లలో 416 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (76; 10 ఫోర్లు) అర్ధశతకంతో మెరిశాడు. సొగసరి లక్ష్మణ్‌ను తలపించేలా చూడచక్కటి కవర్ డ్రైవ్‌లు.. ది వాల్ రాహుల్ ద్రవిడ్‌ను గుర్తుచేసేలా దుర్భేద్యమైన డిఫెన్స్‌తో ఆకట్టుకున్న విహారి.. గంటల […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Sep 01, 2019 | 5:50 AM

విండీస్‌తో జరుగుతున్న టెస్టులో భారత్ భారీ స్కోరు చేసింది. తెలుగు తేజం హనుమ విహారి (225 బంతుల్లో 111 బ్యాటింగ్; 16 ఫోర్లు) అజేయ శతకంతో కదంతొక్కడంతో కడపటి వార్తలందేసరికి టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 140.1 ఓవర్లలో 416 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (76; 10 ఫోర్లు) అర్ధశతకంతో మెరిశాడు. సొగసరి లక్ష్మణ్‌ను తలపించేలా చూడచక్కటి కవర్ డ్రైవ్‌లు.. ది వాల్ రాహుల్ ద్రవిడ్‌ను గుర్తుచేసేలా దుర్భేద్యమైన డిఫెన్స్‌తో ఆకట్టుకున్న విహారి.. గంటల తరబడి క్రీజులో పాతుకుపోయి టీమ్‌ఇండియాకు భారీ స్కోరు సాధించిపెట్టాడు. ఒక ఎండ్‌లో ఇషాంత్ భారీ షాట్లు ఆడుతూ చకచకా పరుగులు జతచేయడం వెనుక కూడా విహారి గొప్పదనం ఉంది. లంబూను స్వేచ్ఛగా ఆడేందుకు అవకాశం ఇచ్చిన హనుమ తాను మాత్రం ఆచితూచి అడుగులు ముందుకువేశాడు. ఈ క్రమంలో సరిగ్గా 200 బంతుల్లో టెస్టు క్రికెట్‌లో తొలి సెంచరీ తన పేరిట రాసుకున్నాడు. ఎనిమిదో వికెట్‌కు ఇషాంత్ శర్మ (57)తో కలిసి అజేయంగా 102 పరుగులు జోడించడం విశేషం. విండీస్ బౌలర్లలో హోల్డర్‌కు 4 వికెట్లు దక్కాయి.

వెస్టిండీస్‌తో రెండో టెస్టులో భారత్‌ భారీ ఆధిక్యం దిశగా అడుగులు వేస్తోంది. రెండో రోజు ఆటలో మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ హనుమ విహారి(111; 225బంతుల్లో 16×4) శతకంతో రాణించి జట్టును మెరుగైన స్థితిలో నిలపగా.. పేస్‌ బౌలర్‌ బుమ్రా(6/16) హ్యాట్రిక్‌తో చెలరేగి ప్రత్యర్థి జట్టును పీకల్లోతు కష్టాల్లోకి నెట్టేశాడు. అతని ధాటికి రెండో రోజు ఆట ముగిసే సమయానికి విండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 33 ఓవర్లకి 7 వికెట్లు కోల్పోయి 87 పరుగులు చేసింది. క్రీజులో కార్న్‌వాల్‌(4 బ్యాటింగ్‌), హమిల్టన్‌(2 బ్యాటింగ్‌) ఉన్నారు. అంతకుముందు 264/5తో ఆట మొదలుపెట్టిన కోహ్లీసేన 416 పరుగుల వద్ద ఆలౌటైంది. ఇషాంత్‌ శర్మ(57; 80బంతుల్లో 7×4) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతానికి భారత్‌ 329 పరుగుల ఆధిక్యంలో ఉంది. విండీస్ మొదటి ఇన్నింగ్స్ లో 7 వికెట్లు కోల్పోయి 87 పరుగులు చేసింది. బుమ్రా హ్యాట్రిక్ తో 6 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu